Jump to content

బ్రహ్మానందము/శష్పవిజయము

వికీసోర్స్ నుండి

శ్రీరస్తు

శష్పవిజయము

క.

‘శ్రీకంఠుని తలమీఁదను
కూకొంటివి మురికితొత్త!’ కూకోనఁటవే
నీ కెట్లు మేనుజిక్కెను
పూకా! యనుసతుల మెచ్చు పురుషుఁ దలంతున్.


ఆ.

గంగచన్ను లంటఁగా చేయి నెత్తంగ
లోన చంకయీఁకె లూని పట్టి
లాగు గౌరి నెంతు, వేగ దానిని తూలఁ
గనరు విభుని మెచ్చు గంగఁ దలఁతు.


ఆ.

‘పట్టుపట్టు మంచు పదిమంది నైనను
దెంగఁగలవె? దూలఁ దీర్పఁగలవె?
విడువ వేల నున్నపడతుల?’ నను రాధ
మాట కులుకు హరిని మదిఁ దలంతు.


క.

‘బాలా నీ చనుగొండలు
వాలుటకున్ గారణంబు వచియింపు’ మనన్
‘మూలమునఁ బట్టి త్రవ్వఁగ
కూలవె?’ యను నట్టి రాధకు న్నుతిఁజేతున్.


ఆ.

‘జపతపాలచేత సర్వకాలంబులు
మసలువాని కింట మంచ మేల?
నల్లు లెక్కుటకునొ! నా కొఱకో?’ యని
వాణి పలుక, నేడ్చు బ్రహ్మఁ గొలుతు.


ఆ.

‘అబల! యింట నీవు నరగడి యైనను
మెలఁగ వెట్లు కూడగలుగుదు’ నన

‘పప్పవెల్లఁ బెట్టి పడుకొందు నీ కొఱ’
కంచు దెప్పు వాణి నాశ్రయింతు.


సీ.

వ్యాసుని నోటిలో పా సొకింత విదిల్చి
               వాల్మీకి కందులో భాగ మిచ్చి
కాళిదాసుం డుంచుకాంతను పడదెంగి
               భోజునినోట నామొడ్డ పెట్టి
శ్రీహర్షునిల్లాలిసిండ బ్రద్దలు చేసి
               దండిచేతకి నాదుదండ మిచ్చి
భవభూతితల్లిని పలుమార్లు విషయించి
               మాఘుపెద్దత్తకు మచ్చికపడి


తే.

నన్నయాభిఖ్యుసతిగొల్లి నలఁగదెంగి
తిక్కకవియాలి చనుమొన ల్నొక్కి నొక్కి
శష్పవిజయంబుఁ జెప్పెద చదువువారి
కేకదంతుండు నిచ్చుత నింత బొచ్చు.


ఈపద్యమునకుఁ బాఠబేధ మీవిధముగాఁ బ్రచారములో నున్నది.


సీ.

ముందుగా వాల్మీకి ముసలితొప్పెకు మ్రొక్కి
               వ్యాసునిశిశ్నంపాసు కడిగి
భట్టమయూరునివట్టలు పూజించి
               శివభద్రునాతులు చిక్కుదీసి
భవభూతి మొదలైన బహుగ్రంథకారుల
               వృషణాలపొక్కుల వెదకి చితిపి
కాళిదాసునిపింగుఁ గౌఁగిట గదియించి
               మొల్లగొల్లికి నాదు చుల్లఁ జూపి


తే.

మూర్తికవినోట గాడిదమొడ్డఁ బెట్టి
పెద్దనార్యునిగుద్దకు పేడు కొట్టి
చెప్పెదను శష్పవిషయమ్ము చిత్తగింపుఁ
డేకదంతుండు మీ కిచ్చు నింతబొచ్చు.

చ.

ఒకనికవిత్వము న్వినుచు నూరక యుండను, నాకవిత్వ మం
దొక రొకతప్పు దిద్దు నెడ నూకొని చూడను, రంపకత్తితో
సిక మొద లంటఁ గోసెదను, చెప్పునఁ గొట్టెద, మోము దన్నెదన్,
పకపక నవ్వి వూసెద, నపండితునోటను మొడ్డ వెట్టెదన్.


వ.

సకలాభ్యుదయపరంపరాభివృద్ధిగా నా యొనర్పంబోవు శష్పవిజయంబునకుఁ గథావిధానం బెట్టిదనిన.


తే.

అనుఁగుఁదమ్మునితో రాము డడవియందు
నున్న, వాల్మీకి చనుదెంచి, యో నృపాల
చంద్రమా! యన రాముఁడు సరగ వాని
నమితవిధులను బూజించి యనియె నిట్లు.


క.

మునివర! నా కొకసంగతి
వినుపింపగవలెను సురులు వేడుకతో దే
నిని గొనివచ్చిరి భూమికి
ననయము భూసురు లటంచు ననుచుంద్రుకదా.


క.

అన విని నవ్వుచు రాముని
గనుఁగొని వచియించె నిటుల, కౌసల్యసుతా!
వినవయ్య తగినసంగతి
వినియుంటిని నేను తొల్లి వివిధంబులుగాన్.


క.

పెనమునగల నూనెను వేఁ
గినబూరెవిధాన వార్ధికిన్ మధ్యముగాఁ
గనుపట్టు లంక యయ్యది
ఘనద్వీపం బందు రాదికవిభాంచోతుల్.


ఆ.

వాళ్ళతల్లిదెంగ వర్ణించి యున్నారు
యింక నింత యైన శంక లేక
మగుడ దాని నేల మఱిమఱి వర్ణింప
చదువువారి కక్కజంబు గొలుప?

ఆ.

ఐనఁ గొంతవఱకు నైనను వర్ణింప
కుందు నేని కవులు మందుఁ డంచుఁ
దిట్టఁగలరు, గాన నట్టి యా లంకను
బొగడ ధాత యైనఁ దగఁడు తగఁడు.


తే.

శుక్రుఁడును మున్ను గల్గు నసురులు విశ్వ
కర్మదరి కేగి వానియీకెలను చిక్కుఁ
దీయఁగా నెట్టకేలకు దివ్య మైన
పట్టణము గట్టి లంక నాఁ బెట్టెఁబేరు.


తే.

మట్టుగలకాంతలను పసిపట్టె నేని
ముప్పతిప్పలఁ బెట్టుచు తొప్పె దూర్చి
రక్త మొల్కుచు నుండగా రతికిఁ దార్చి
దంపి విడిచెడి ఘోటకతతులు గలవు.


తే.

అచ్చటియేన్గులు విషయించు నపుడు కాళ్ళ
క్రింద నున్నట్టి కొండలు కెడలి నలిగి
పిండిగా రాలి వారిధి నుండ దాని
నిసుక యంచును బల్కుదు రెల్లవారు.


తే.

పట్టణము స్వర్ణమయ మౌచు భాసిలంగ
మేడలనుగూడ వర్ణించ నేడ, మాదు
పద్యమును బాడుగా నేల, బాగు బాగు
భవనములుగూడ నట్టి వై వన్నె కెక్కు.


తే.

అచటఁ గలపూలవనముల యందు గల్గు
పూవు లెల్లను రక్కసిపూవుఁబోండ్లు
పూకులం దోఁపుకుందురు పుళ్ళు మాన
నైనచో వానిఁ బొగడ నెవ్వానితరము.


తే.

లంకఁ గలరాక్షసులయొక్కబింక మైన
మేఢ్రములు పోఁకమానుల మించి యుండ

వారియాకారముల నేల వర్ణనంబుఁ
జేయవలె ప్రాజ్ఞు లెల్ల రిస్సీ యనంగ.


సీ.

గడ్డికుప్పలఁబోల గలయట్టి చన్నులు
               కరిగర్భములవంటి గర్భములును
బండిచక్రము లట్ల భాసిల్లు పిఱుఁదులు
               గాన్గులం బోలిన కంఠములును
ఆదికూర్మముఁ బోలినట్టి పాదంబులు
               మందరగిరివంటి మధ్యమములు
బారలతోఁ గొల్వనేరని యూరులు
               జగతిలో లే వట్టి జంఘములును


తే.

గల్గుకాంతల పూకులఁ గల్గి నట్టి
వెండ్రుకల దీర్ఘముం జెప్ప వేధ తరమె?
యల త్రికోణపుబిలముల యావరణలు
లోతులం గన్నఁ గన్పట్టు నూతులవలె.


తే.

ఎట్టిచెలి యైన తనకొంగు నెత్తి యుచ్చఁ
బోయ నయ్యది యొకక్రోసు పొడవు బడును
పురుషులుంగూడ నట్టులే పోతురేని
మించుపో యంతకంటెను కొంచె మంత.


తే.

పంగలం జాపి ‘రా దెంగు దెంగు’ మంచు
కొంగు లెగ దీసి యాపురి కోమలాంగు
లంగడులలోనఁ దిరుగుదు రనుదినంబు
దొరకు మేఢ్రంబు లెల్లను దోఁపుకొంచు.


తే.

పురిని గల రాక్షసులు మేఢ్రములను జూచి
కొట్టునెడ తాళవృక్షముల్ గూడ నేల
పడుచు నుండుచు కాంతలు ప్రక్కఁ జేరి
దోఁపుకొందురు పూకుల లోపలగను.

తే.

అట్టి లంకాపురిని గల్గు నట్టి దివ్య
భవనములలోన నొకమహాభవనమందు
వెన్కసావడిప్రక్కను పెద్దపూల
తోఁటలో కుంభకర్ణుఁడు తూఁగి యుండె.


సీ.

ముకురంధ్రములనుండి పోయివచ్చుచు నున్న
               గాలిచే తరువులు గదలుచుండ
తొడలలో తామరమడిఁ బారగోఁకగా
               రజము కుప్పులు గాక రాలుచుండ
అప్పు డప్పుడు పిత్తినట్టి యాపిత్తులు
               గర్జనంబులబాఁతిగా నదింప
కనుఁగొలంకులనుండి కాఱెడు పుసినీరు
               ముద్దముద్దలు గట్టి పులియుచుండ


తే.

నావులించిన భూతము లవలఁ బాఱ
నొత్తిగిల్లిన మృగములు సత్తువేది
ప్రక్కలం బడి మ్రగ్గ నపారమైన
నిద్రలో నుండె యా రజనీచరుండు.


తే.

తనదు కులకాంత మిక్కిలి తత్తరమున
పూకుపై నీఁకె లన్నియు బుగ్గితోడఁ
దీసికొని ముట్టుస్నానంబు చేసి తగిన
భూషలం దొడిగియుఁ దాల్చె పుట్ట మొకటి.


తే.

పుట్టమును గట్టి నుదుటను బొట్టు వెట్టి
వేఁచి యుంచిన మాంసంబు వేఁడి దింత
నంజుకొంచును చల్దియన్నమును గుడిచి
మట్టమధ్యాహ్నమున రతి మనసు కల్గి.


సీ.

పట్టినొక్కుము చళ్ళు గట్టిగా చేతుల
               నంచు ఱైకను సడలించినట్టు

ముద్దుబెట్టుమ బుగ్గ మోహంబు రేఁగఁగా
               నంచును మూతి కందించునట్లు
కౌఁగలించుము మేను కసిదీఱిపోయెడు
               పగిది నంచును ముందు పడినయట్లు
దూర్పు మిందున మొడ్డ దూల తీఱెడు రీతి
               వే యని పూ కెళ్ళబెట్టినట్లు


తే.

స్వప్నముం గనె పాపము స్వచ్ఛ మైన
కోటగుమ్మంబులా గున్న కొమ్మయోని
కన్నులారంగఁ గాంచిన కారణమున
మెదలె నాకుంభకర్ణునిమేఢ్ర మంత.


తే.

మెదలి యేతము వలె లేచి మిన్ను ముట్టె
నేరు వర్ణింపనేర్తురు యెత్తు చుట్టు
కొలత యిది యేమి యనుచును దలఁచి స్వర్గ
వాసు లెల్లరు దేవేంద్రుపాలి కేగి.


క.

దేవా యేమని తెల్పుదు
మీ వీట న దేమొ గాని యేర్పడె దానిన్
భావింపఁగ నిర్భేద్యము
రావలె నని వారు వాని రావింపంగన్.


తే.

ఇంద్రుఁ డైరావతము నెక్కి యింపు గులుక
కుంభకర్ణునిమేఢ్రంపుగుండుఁ జూచి
క్షణములో బుట్టె నిది యేమొ స్వాంతమునకు
బోధపడకుండె నని తాను బోయె వేగ.


తే.

మనబృహస్పతి యెఱుఁగు నీ మాయ వాని
బిలువ నంపింతు నని యెంచి పిలువ నంపె
భటుల కొందఱ వా రేగి వాసవుండు
తమకొఱకు మమ్ముఁ బంపె నో తాపసేంద్ర!

క.

అని పలుకఁగ విని యాతఁడు
మనమున సంతోష మంది ‘మానిని! నే నిం
ద్రునిఁ జూడఁ బోవవలె, నీ
తనిఁ జూడుమ ప్రీతి’ నని సుధానిధిఁ జూపెన్.


తే.

‘ఎచటి కేగిన నీతని నేల నాకు
నొప్పఁ జెప్పెద రొక మీకె యుండె నొక్కొ
వీనిపైఁ బ్రీతి నే లేని దానివలెను
గానుపించెదనే మీదు కన్నులకును?’


క.

అని వానితోఁడ బలికిన
విని యంత నతండు జరుగువిధు లరయుటలో
మునిఁగికొనియుండ తారా
వనితామణి యాత్మ నిటుల భావించుకొనున్.


తే.

పోవఁ డింకేల నీ ముదిముండకొడుకు
జాము గా వచ్చె పిలుపంది జాగుసేయు
చుండె నని, పోనిలే యని సోగకనులు
చందురునిమీఁదఁ బఱపె నా చంద్రవదన.


తే.

‘గురువుగా రేగుచున్నారు గురుని పనులు
బడియె నీ తలపైన నీ భార మెట్లు
మోసెదవొ’ యంచు దరిజేరి ముద్దు బెట్టి
తారకారాజు నా తార తాఱితాఱి.


తే.

తారకారాజవా నీవు తార నేను
మనలమాత్రమె యుంచి తాఁ జనును కాదె
భయముచేతను నిద్దుర బట్ట దిఁకను
నీవునుంగూడ నా వంటి నియతిఁ గొనుము.


తే.

పాడువేదమ్ము లెల్లను బఠన చేసి
చక్కఁదనములగొంతుక చక్కఁదనము

బాడుజేయుచు నుంటివి, పాట నీకు
నేర్పెదను గాన నా యొద్దనే పరుండు.


తే.

అపరకర్మంబులను జేయునట్టివేద
మేల చదివెదు, ఛీ! నాకు చాలకష్ట
మట్టివేదము విందు వహా! యి దేమొ
కాంచఁగూడదె మఱి కొన్నిగ్రంథములను?


తే.

ఒడుగు చేయింతువో చిన్నిబుడుతవాని
కహహ! పెండిలి చేయింప నరుగువాఁడ
వా? వచింపుము యేటి కీ పాడువేద
మెవరు బోధించి రయ్య నీ కిది వృథాగ.


తే.

క్రొత్తవారలు దీనిని గొప్పగాను
భావనలు చేయుచుందురు ప్రాఁతవడ్డ
విసుగుకొందురు, పరు లేరు వినిన మెత్తు
రక్కటా! కైత గాన మాహావరింపు.


తే.

కవన మల్లుట నేర్పెదఁ గాక యున్న
వీణె నేర్పెద సంగీతవిధులలోన
బ్రాజ్ఞునిగఁ జేతు నేర్చుకో, పాడువేద
మెవరు వత్తురు? దానియ దేమి ఘనత?


తే.

కవన మల్లిన సంగీతకళ యెఱిఁగిన
పరులు కొనియాడుచుందురు పట్టుపట్టి
కామినులు నీదు కూటమికై దలంతు
రయ్యయో? వేద మేల నీ యందమునకు.


తే.

చదివితివి కావ్యములు కొన్న చాల వఱకు
శాస్త్రములఁ జూచినావు రసమ్ము లెల్ల
నేర్చితివి, గాన కవనము నేర్పె దేను
తాతతో మైత్రి మాని పెత్తనముఁ బూను.

తే.

తాత పెండిలిఁ జేయఁగా తరలు నపుడు
పోయెదవె నీవు, బియ్యపుమూట మోయ,
చదువుచుంటివి వేదముల్ చాలు చాలు,
వేద మెటువంటిదె వినలేదు నీవు.


తే.

భార్యపై రోఁతఁ బుట్టించు, భార్య యైన
పతిని మెచ్చని యట్లు చేడ్పరచు, పరుల
కాంత నైనను మోహింపఁ గడఁగె నేని
వలవ ననిపించు వేదమ్ము వాస్తవమ్ము.


తే.

ముష్టి నెత్తించు తుదకు సంతుష్టిఁ ద్రుంచి
సొగసు చెడగొట్టు రసికతఁ దగులఁ బెట్టు
ముదిమి గనుపించు రోఁతను ముట్టడించు
వెఱ్ఱివెంకన్నలకుఁ దప్ప వేద మేల?


తే.

తాతతోఁ గూడి నీవును తాతబుద్ధి
నేర్చుకొన బోకు, నావలె నీదు భార్య
దుఃఖపడు నిన్నుగాంచియే తుదిని నేను
ప్రాణములతోడ నుంటి నిప్పట్టు నందు.


తే.

అనుచు క న్గీటు తన జాణతనము జూచి
నంతలో చందురుఁడు వేగ నరిగె గదికి
తారయుం గూడ నాతని జేర నరిగి
కంచుకముఁ దీసి యా సుధాకరుని కొసఁగె.


తే.

‘ప్రాణమా, వీపు పై జూడు మబ్బ! చీమ
ప్రాఁకుచున్నది’ యన వాఁడు బాలవీపుఁ
జూచుచుండగఁ పయ్యెదచెంగు జార్చి
కనరె నంతయుఁ బరికింపఁ గా వలె నని.


తే.

స్వర్ణమయకాంతులం దేలు చాన వీపు
చేతితో రాయఁగా వాఁడు, చేడె మిన్న

‘అచట గా దిచ్చ టచటగా దిచట’ ననుచు
మెల్లమెల్లనఁ దనచీరె నెల్ల విప్పె.


తే.

‘ఇదిగొ కంఠంబుపై బ్రాఁకె వెదకు’ మనుచు
వస్త్రహీనంబుగా వానివైపు దిరిగె
పాప మాతండు కంఠంబుపైని చీమ
వెదకుచుండెను, వెదుక నా విద్రుమోష్ఠి.


తే.

బంగరపుబొంగరాలను భంగపడఁగఁ
ద్రొక్కగలయట్టి యా చనుదోయి, వాని
ఱొమ్మునం జేర్చి ‘యదిగొ కంఠమ్ము దాఁటి
మధ్య కరుదెంచె చూడు చీ’ మనుచుఁ ‘దాఁకి
ఱాచు’ మని చూపె చన్ను తారావధూటి.


తే.

వస్త్రహీనంబు లై యున్న వనితచనులు
కన్నులారంగ వీక్షించి ‘కాని చీమ
ప్రాకె నిదె’ యంచు చన్నుల బట్టి యెత్తి
పానుపున నుంచి చంద్రుఁడు బలుకరించె.


తే.

పానుపునఁ బెట్టి చన్నులఁ బట్టి మోవి
పలువిధమ్ముల నాని యా కలికి తమ్మ
లమ్ము నోటను గరచి వే నెమ్మి మీఱ
రతికిఁ దార్కొనె శశి యనురాగమునను.


క.

పట్టినచన్నులఁ బట్టుక
పెట్టిన యాపెట్టు మగుడి విడువక దానిన్
దిట్టముగా రమియించెను
నెట్టిన తమకంబుతోడ నియతి దలిర్పన్.


తే.

అంత నా తార వానిని పంత మూని
క్రిందికిం ద్రోసి పై కెక్కి పొందుచెందఁ

జేసి తమి హెచ్చి యుపరతి చేయఁదొడఁగె
నెత్తి యాతని నెదురొత్తు లొత్తు మనుచు.


తే.

పికిలిపిట్టలవిధమునఁ బెలఁగి పెనఁగి
జాగిలంబులపోలిక సాఁగి సాఁగి
పాములట్టుల మెలికలు పడుచు విడుచు
సమరతికి నంతఁ దార్కొనె చాన తాను.


తే.

ముద్దునకు ముద్దు తగు వలపునకు వలపు
దెప్పునకు దెప్పు తిట్టుకుఁ దిట్టు మఱియుఁ
గాటునకు కాటుగాను చీకాకు లంది
సమరతులఁ దేలిరంత నా చాన విభుఁడు.


తే.

మూఁడురతు లిట్లు దేలి యా ముగుద మిన్న
చన్ను నొకచేతఁ బట్టి యా చన్నుమొనను
వానినోటి కందీయఁగ వాఁడు బాలు
మాడ్కిగాఁ ద్రావుచుండగా మందయాన.


తే.

వాని తలఁబట్టి తనచన్ను వానియెదను
నాను నటుసేయ వే ఱొక చన్నుమొనను
రెండువేళ్ళను నుంపఁగా ‘దుండగి’ వని
ముద్దులం బెట్టె వాననెమ్మోము తార.


తే.

‘మగువ కోరిన చనువీయఁ దగదు యెంత
కైన’ నన వాని పుట్టము నతిరయమున
లాగి వైచియు ‘దెంగు వేవేగ’ ననుచు
వానిఁ బ్రతిమాలఁ దొడఁగె నవ్వాఁడు వేగ.


తే.

వస్త్రహీనంబుగా నున్న వనిత నడుము
బట్టి దరిజేర్చుకొనియె నా బాల వాని
క్రింద పడద్రోసి తన దగు క్రిందిపెదవి
చప్పరించియు నిలఁబడె యొప్పనటుల.

క.

నిలబడి నవ్వినదానిని
గని విభుఁ డతిలజ్జ చెంది కాళ్ళ న్ముడువన్
వనితామణి విడదీయుచుఁ
గనుఁగొని చే పట్టి ముద్దు గమ్మని పెట్టెన్.


తే.

ముద్దు బెట్టినతోడనే మొదటితెఱఁగు
గాను చుల్లను నొకచేత నూని పట్టి
‘నీద నాదా’ యటంచును వాద మాడి
‘నీదె’ యనిపించె వానిచే నెలఁత తుదకు.


తే.

‘నీవె యివి’ యంచు చన్నులు నేర్పుగాను
చేతులకు నిచ్చి ‘నాదిది చేతు’ ననుచు
మగుడ సంధింపఁగా జేసి బిగువు చూపి
కౌఁగిలించెను దగ్గరగాను జేర్చి.


తే.

కూరుచుని యుండియే కొంత గొడవ జరిపి
యున్న కాంతను జూచి యా చన్నుఁగవను
బట్టి పడఁద్రోసి పైబడి బాలకు స్పృహ
దప్పు నట్టుగఁ గూడె ‘పెత్తనము గాదె?’


తే.

చన్నులం బట్టి పడద్రోయుచున్న యట్టి
సమయమున జ్ఞప్తి కలదు, పై సమయమునను
జ్ఞప్తి మాత్రము లేకయె తృప్తిఁ గనెను
నహహ! యెంతటివాఁడు సుధాకరుండు.


తే.

ముద్దుఁ బెట్టుట యెఱుఁగదు మోము నెత్తి
పెదవి యానుట నెఱుఁగదు గదియఁ జేరి
రతి యొనర్చుట యెఱుఁగదు రాజు పాన్పు
దిగుట యెఱుఁగదు యేమని తెలుపవ వచ్చు!


తే.

పాన్పు దిగి సోముఁ డలదాని వల్వ సర్ది
తాను తన పుట్టమును గట్టు తఱిని చనుల

కంఠమున గల్గు చెమ్మట కండువాను
దుడిచి యా పైన మూతిని దుడిచి వైచి.


తే.

స్పృహ యొకించుకలే నట్టిసుందరాంగి
పగిదిఁ గనుఁగొని పయ్యెద పైకి జేర్చి
చన్నుగవఁ జూచి యివ్విరా చన్ను లనుచు
మొనలు ముద్దాడి మగుడను మూసి వైచి.


తే.

చిక్కులం బట్టి కొనగోళ్ళ చేత సర్ది
దువ్వి పేరులు సవరించి తొంగి చూసి
తిలక మెప్పటిరీతిగా దిద్ది, బట్ట
పూర్తిగా గప్పు తన దగు మోమునందు.


తే.

కాంత కఱచిన యట్టి యా కాటు లన్ని
పరుల కన్నులఁ బడకుండ బాగు చేసి
కొంచు తన గోటినొక్కులు కొమ్మచనుల
యందు గలవేమొ యనుచు పయ్యంట నంత.


తే.

పైకి తొలగించి వీక్షించి పడఁతి యేమి
కోపగించునొ యంచును కొంత జడిసి
పొలుపు మీఱఁగ కస్తూరి పూసి పూసి
కడు విచారించె చంద్రుఁ డా గాయములకు.


తే.

ముద్దులను బెట్టి యలదాని మోవి యాను
చుండఁగా వచ్చె నంత గురుండు, వాని
దక్కి చని ‘యేమి సెల’ వని ‘దండ’ మనిన
‘నేమి కనఁబడ దది యెట కేగె’ ననియె.


తే.

‘ఏడకుం బోవలేదు, నేఁ డేమొ కాని
పండుకొనియుండె శాలువా పైన గప్పి
అమ్మగా’రంచు విధుఁ డన నతఁడు వేగ
పాన్పు దరిజేరి యి ట్లని పలుఁకదొడఁగె.

తే.

‘ఏడ కేగెద నన్న నీ విప్పు డిటుల
కడు విచారంబు నొందెడు కారణంబు
దెలుపు మొకయింత యింతలోపలనె వత్తు’
నంచు లేపుచు నుండె నా యతివ నతఁడు.


తే.

పిలువఁగాఁ బిలువఁగా నది తెలివి వచ్చి
కనులు విప్పక, నేను నిన్ గందు నంచు
‘తారకానాథ!’ యంచును తార పిలువ
వచ్చి నిలఁబడ కన్విచ్చి వానిఁ గనియె.


తే.

పాప మా తాత వేఱుగా భావ మందుఁ
దలఁచు నంచును ‘తిండిపై వలపు నీకు
పుట్టదా చంద్ర బొత్తిగా భోజనమ్ము
మాను చుంటి వ దేమి కర్మమ్మొ కాని.


క.

నీకును నాకు విచారము
చేకూరు నటంచు నతఁడు చింతించకపోఁ
డా? కొంచెము చింతించిన
పాకారికి మనలపై కృపాఁ? ఱేరాజా?’


క.

అని విభునితోడ నను తా
రను గని గురుఁ డనియె ‘కాంత! రయమున నే వ
త్తును గాన కోప మింతయుఁ
గొనవల’ దని చెప్పి వెన్కకన్ దిరిగె నటన్.


తే.

వానియాకారమును జూచి వారు నవ్వు
కొనుచు నుండంగ నెఱుఁగఁ డా గోలతాత
వజ్రధరుసేవకులతోడ వాఁడు వోయె
తారకారాజు తారల తనివి దీఱ.


క.

తలకు నొకవస్త్ర మాపై
మొల నొకపొడికాయ ఫాలమున బూడిదెయున్

గళమున రుద్రాక్షలునుం
గలవారలఁ జూచి నవ్వ గడఁగరె రసికుల్?


క.

పగ లనక రాత్రి యనకయె
తెగ గూడుచు నుండె విభుఁడు తికమక వడుచున్
తగురీతి నతఁడు విసిఁగిన
తగులుకొనున్ బట్ట విప్పి తారయు నతనిన్.


తే.

పూలతోఁటల మాలతిపొదలలోన
పాన్పుపై, నేలపై చెంగుఁ బఱచుకొంచు
పట్టపగ లింటతలుపులు బయలు చేసి
మెలఁగుచుండిరి యే మనఁగలరు పరులు?


తే.

అన్నింటికి యేమి గాని యా యబ్జవదన
వంటఁ జేయుచు నున్న యా పట్టు నైన
మనసుపుట్టిన మడి విప్పి మరులుకొనుచుఁ
దగులుకొనుచుండు విభుతోడఁ దగవులాడి.


తే.

ఎన్నడేనియు మడి విప్పి దేని కాంత
‘తొందరగ నున్న’ దనుచు విధుని’పటంబు
విప్పి ర’మ్మని వంటింట వివిధగతుల
గూడుచుందురు మితిలేని కూర్మితోడ.


సీ.

స్నానంబు చేయించు చలువపన్నీటను
               పట్టుపుట్టము గట్టి పెట్టు తానె
అన్నము దినిపించు నదె బ్రతిమాలుచు
               విడిచిన యన్నంబు గుడుచు తానె
తిలకంబు దిద్ది ముద్దులుమూటగట్టఁగాఁ
               బీఁటపై కూర్చుండబెట్టు తానె
ముస్తాబు చేయును మురువు కొల్పెడు రీతి
               విడియంబు నోటను బెట్టు తానె

తే.

పాన్పు శుభ్రంబుగాఁ జేసి వచ్చి, స్నాన
మాడు నందాక తనయొద్ద నతని నుండు
మనుచుఁ బ్రార్థించి, తరువాత ననుపమాన
మైన తెఱఁగున ముస్తాబు లై చెలంగు.


తే.

అంత ముస్తాబుగా తయా రౌచు ఱైక
మాత్రమే తొడుగుమనుచు మాటిమాటి
కల్లవానిని బ్రతిమాలి యతనిచేత
కోరి తొడిగించుకొనుచుండు కొమ్మ సతము.


తే.

ఆతఁ డేనగ లిచ్చిన యానగలనె
యాతఁ డేచీర నిచ్చిన యద్ది మాత్ర
మాతఁ డేఱైక నొసఁగిన నదియ కాని
తాను మాత్రము స్వాతంత్ర్య మూన దెపుడు.


తే.

అది యతం డొక్కరీతి తయారు లగుచు
నిలువుటద్దంబు దరికేగి నిలిచి ‘మనల
లోన బాగుండునది, నీవ నేన?’ యనుచు
తగవు లొందుచు, తుద కెల్ల తగవు తీఱ.


తే.

కేలుకేలను గొని వేగఁ బూలపాన్పు
దరికిఁ జని పైకి యెక్కి యాతలిరుఁబోణి
‘నీవ నేనా’ యటంచు ననేకవిధుల
బలుకఁదొడఁగును సుధకారి మొలక లెత్త.


తే.

దినదినంబును వా రిదేతీరుగాను
సంతతానందవార్ధిలో స్నాన మాడి
మెలఁగుచుండంగ నట దేవతలగురుండు
వాసవునిఁ జేర, నింద్రుండు వంగి మ్రొక్కి.


క.

‘అనఘా! యీ యుచితాసన
మున నుండు’ డనిన దేవముఖ్యుం ‘డటులే’

యని కూర్చుని ‘పిలిపించిన
పని యెయ్యది’ యనిన దేవపతి యి ట్లనియెన్.


తే.

‘మొన్నటను లేదు, నిన్ననె మొలిచె నీడ
నెయ్యదో యెఱుంగఁగఁ గోరి యిపుడు మిమ్ము
పిలువనంపితి, మన మేగవలయు’ ననఁగ
నాతఁ డాయింద్రుఁ డికకొంద రటకుఁ జనిరి.


తే.

దేవగురుఁడు మహేంద్రుఁడుఁ బోవుచుండ
వారి వెనువెంటనే స్వర్గవాసు లెల్ల
రేగి రద్దాని గాంచి వచించె గురుఁడు
‘పార్వతీపతి లింగ మై వచ్చె’ ననుచు.


తే.

అనుచు నాకుంభకర్ణుని యనుపమాన
మేఢ్రముం జూచి గురుఁడు ‘స్వామీ’ యటంచు
మ్రొక్క నత్తరి నందఱు మ్రొక్కు లిడిరి
తగినవిధిఁ బోల్చె గురుఁ డని తలచి తలచి.


వ.

అప్పు డింద్రుఁడు.


తే.

భటుల రావించి ‘శివు డింద్రుపట్టణంబుఁ
గాంచ నరుదెంచె లింగంబు గాఁగ మాఱె
నెల్లవా రిట పూజించి యేగుఁ’ డనుచు
చాటగాఁ బంచె పౌరులు సంతసింప.


ఆ.

ఇంద్రు నాజ్ఞ గాన నెల్లవారలు మన
సార నిష్ఠతోడ స్నాన మాడి
యింతకంటె భాగ్య మెయ్యది యని దాని
పూజ సల్పువిధులఁ బూనుకొనిరి.


తే.

దేవతలు దేవకాంతలు దివ్య మైన
పగిది ముస్తాబు లై స్వర్ణపళ్ళెరముల

పత్రముల్ పళ్ళు పూవులు పలురకముల
ధూపసంభారములతోఁడ నేపు మీఱి.


తే.

అటుల సుర లెల్ల రట కేగి నంతలోన
రంభ యూర్వశి మేనకారమణు లెల్ల
ననుపమానంబుగాను తయారు లౌచు
వచ్చుచుండిరి యంచలవలె చెలంగి.


తే.

ఇంద్రుఁ డైరావతము నెక్కి వేడ్క మీఱ
దేవితోగూడ, తనవెంట దేవగురుని
నిల్పుకొని వచ్చె శివపూజ సల్పుట కయి
వచ్చు నత్తరి పలువురు వచ్చి రంత.


తే.

కుంభకర్ణునిమేఢ్రంపుగుండు చుట్టు
కలుగుచర్మముపై దేవగణము నిలిచి
యుండ, నింద్రుఁడు కులపతి నండనుంచి
గురునితోఁ గూడ వచ్చె నా గుండుదరికి.


తే.

అట్లు వచ్చి బృహస్పతి యధికవిధుల
మంత్రముల నెల్లఁ జదివి సన్మంగళముగఁ
జేసె నభిషేక మెంతయో చెలువు మీఱ
కుంభకర్ణునిమేఢ్రంపుగుండునకును.


తే.

వాసవునినాతి చేతితో బట్టుకొనిన
యగరుపుల్లలు చేజాఱి యందుఁ బడిన
కాలె నాగుండు, కాలగా కాంతిఁ దప్పి
వ్రాలిపోయెను చెప్పఁగా వశమె పైని.


తే.

అందుఁ గొందరు గెంతలే కతనిమేఢ్ర
మూఁతగాఁ గొని జాఱిరి యున్నవారు
స్వర్గమున నుండి జాఱెడివారు మొదల
చిక్కుగా నున్న నీఁకెలఁ జిక్కిరంత.

తే.

ఈఁకెలం జిక్కి పైకి రాలేక వనిని
డాఁగియున్నట్టి మేఁకలప్రోగుగాను
మెదలుచుండఁగ నింతలో గదలె కుంభ
కర్ణుఁ డారవమాసాంతకాలమునను.


తే.

నిద్ర మేల్కని క్షౌరికుని తనదఱికిఁ
బిల్చి యాతనిచే తల ముందు బోడి
గాను జేయించుకొని మొలక్షౌర మంత
వానిచేతను జేయించి వరలుతఱిని.


తే.

మంగలాతఁడు నారాచమందిరమున
శష్పముల నెల్ల ప్రోగుగా చక్కబరచి
వారినిధిలోన నాప్రోగుఁ బారవైచె
తేలి యేతెంచె దరిగల దేశమునకు.


తే.

అందులో చిక్కువడిపోయి నట్టిసురులు
సాగరప్రాంతమున నుండి సాగి రాగ
‘హరిహరీ’ యంచు నారదుఁ డల్లవారి
సురులుగా బోల్చి వీరు వసుధకు నెటుల
దిగిరొ యని యెంచి ‘మీరలు దేనిచేత
వచ్చినా’ రన్న వారలు పలుక నిజము.


తే.

కుంభకర్ణునిమేఢ్రంపుగుండువలన
భూమికిం దిగు సురు లౌట భూసురు లని
పేరుబెట్టుచు ‘రాజుల జేరి మీరు
బ్రదుకుఁ’ డంచును వారలపరము జేసె.


క.

ఇటు వారి జేసి నారదుఁ
డటనుండి మహేంద్రపురికి నరిగిన నతఁ డీ
పటుతాడనునకు మ్రొక్కిన
యట నాతం డనియె ‘క్షేమమా మాహేంద్రా!’

తే.

‘మౌనిచంద్రమ యే మని మన వొనర్తు
శంకరుఁడు మొన్న లింగ మై స్వర్గభూమి
చూడవచ్చెను పూజించి వానిఁ బంప
గలిగినారము మా పూర్వఫలమువలన.’


తే.

పాకశాసనుఁ డీరీతి బలుకుసరికి
పక్కునను నవ్వి ‘యెంతటి పాపకృత్య
మాచరించిరి! యది రావణానుజుఁ డగు
కుంభకర్ణునిమేఢ్రంపుగుండు సుమ్ము.


తే.

రామస్వప్నంబునను రాగ రాక్షసాధ
మునకు మేఢ్రంబు లేచి యీ పురము ముట్టె
దాని శంకరుఁ డంచును దలఁచి మీకు
గురుఁడు వలికెను వైదికితెఱఁగుఁ దోఁచ.


తే.

అట్టిమేఢ్రంబు వ్రాలుచున్నట్టితఱిని
మీర లెల్లరు స్వర్గంబుఁ జేరుకొనిరి
కొంద ఱలదాని నుండి యా కువలయమున
కరుగుఁ దెంచిరి నేఁ గంటి నచట వారి.


క.

సురు లయ్యును మేఢ్రముచేఁ
బరతెంచిరి భూమి కనుచు భావించుచు భూ
సురు లని పే రిడి వారల
నరవరులకు నప్పఁజెప్పినాఁడ మహేంద్రా!’


తే.

అనిన విని సిగ్గు నంది దేవాధినాథుఁ
‘డయ్య, తాపసచంద్ర! మీ రమలతతులు
పరులతో దీని దెలుపఁగా వలవ’ దనుచు
సాగి మ్రొక్కెను సిగ్గుచో వేగ వచ్చి.


తే.

వేగ నారదుఁ డేగి శ్రీవిష్ణుతోడ
బలుక నాతఁడు ధాతతో బలికె నంత

వాఁడు జని శివునికనె నావార్త పూర్తి
ప్రాఁకె నయ్యది దిక్కులపైన బాగ.


తే.

భూసురాభిఖ్య కిదియెపో మొదటికార
ణంబు శ్రీరామ! యెవరు నిక్కంబుగాను
దీనిఁ జదువుదురో వా రనూన మైన
సంపదలతోడ నుందురు సర్వవిధుల.


క.

ఈకథఁ జదివినవారును
జేకొని యర్థంబుఁ జెప్పఁ జెల్లినవారున్
ప్రాకటముగ వినువారలు
శ్రీకరు లై యుందు రమితశేముషితోడన్.


తే.

పాండురంగవిజయంబు బలికి వీర
జనమనోరంజనముఁ జేసి జగతి కాది
కారణం బైన వేఱొక కథ రచించి
శష్పవిజయంబు జెప్పితి సత్య మనుచు.


ఆ.

ఏడుమారు లెవ్వఁ డీకథ చదువడొఁ
కుంభకర్ణుమొడ్డ కుడిచి నట్లె!
రామలింగసుకవిరాయఁ డిట్టుల వల్కెఁ
గాన దప్పవశమె కలియుగమున!

గద్య
ఇది యాదిపురాణాదిసద్గ్రంథకార కృష్ణరాయదత్తతెనాల్యగ్రహార
తెనాలివంశపవిత్రార్యజనస్తోత్ర మల్లిఖార్జునతనూభవ
రామలింగప్రణీతం బగు శష్పవిజయం
బనుమహాప్రబంధంబునందు
సర్వంబు నేకాశ్వాసము
సంపూర్ణము