Jump to content

బైబులు భాష్య సంపుటావళి - పవిత్రాత్మ/ముందు మాట

వికీసోర్స్ నుండి

ముందుమాట

ఫా.జోజయ్య గారు తమ రచనల ద్వారా ఆంధ్ర శ్రీసభకు సుపరిచితులు.వారి అవిరళ క్రుషి,సేవతత్పరత,తెలుగులో చక్కని సాహిత్యాన్ని రాయాలనే తపన,దానికితగిన అంకితభావం వేనోళ్ళ కొనియాడదగింది.వీరు రచించిన చిన్నచిన్న పుస్తకాలను సంకలనం చేయడం అనే ప్రక్రియ వీరి జీవితకాలంలొనే జరగకపోయినట్లైతే,ఈ గొప్ప సాహిత్యన్ని కోల్పోయే అపాయం వుండేది.అరుదుగా పాఠకులకు తేలుహగులో లభ్యమయ్యే బైబులును మరియ కతోలిక వేదాంతమునకు సంభధించిన అంశాలను క్షుణ్ణంగా పరిశోధన జరిపి చక్కని భషలో ఆంధ్ర కతోలిక సంఘానికి గత మూప్పది సంవత్సరాల పైగా అందించారు ఫా.జోజయ్య గారు.

తెలుగు కతోలిక శ్రీసభకు,బైబులును క్రైస్తవ సిద్ధాంతాలను అర్థం చేసుకోవాలన్న కోరిక గల క్రైస్తవేతరులకు ఫా.జోజయ్యా గారు గొప్ప వరమని నేను భవిస్తున్నాను.వీరి రచనలు సత్యాన్ని అన్వేషించడ్ం యెడలా ఆయనకున్న పట్టుదలకు అందరికి జ్ఞానోపదయాన్ని కలిగించలన్న తపనకు,మరియ ఆంధ్ర శ్రీసభ పురోభివృద్ధి యెడల ఆయనకున్నతృస్టకు నిదర్శనలు.సరళమైన స్వచ్ఛమైన,సామాన్య ప్రజలకు అర్థమయ్యే తెలుగుభాషలో రచించబడిన ఈపుస్తకాలను చదివి,అధ్యాత్మిక జీవిత వికసానికి క్రైస్తవ సిద్ధాంతాలను లోతుగా అర్థం చేసుకోవటానికి వీటినివినియోగించుకోవాలని కోరుతున్నాము.ఎంతో నేర్పుతో,క్రమపద్ధతిలో విభజింపబదడిన రచనలు "బైబులు భష్య సంపుటావళి" అన్న పేరుతో పది సంపుటాలుగా అచ్చు వేస్తున్నందుకు అభినందిస్తున్నాను. ఈ గ్రథాల ప్రచురణ భాద్యతను తన భుజలపై వేసుకుని,సమయాన్ని వెచ్చించి,వెలసిన ఆర్థిక వనరులను చేకూర్చినందుకు,ఆంధ్ర శ్రీసభకు ఉపయోగకరమైన ఈ సాహిత్యన్ని ప్రజలకు అందించాలనే మంచికర్యాన్ని చెపట్టి విజయవంతంగా పూర్తి చెసినందుకు ఫా.మర్రెడ్డి గారిని నా హ్రుదయపూర్వకంగా అభినందిస్తున్నాను.

ఆణిముత్యాల్లాంటి ఈ రచనలు అధ్యాత్మిక సంపత్తిగా అందరూ గుర్తించాలని,కతోలిక క్రైస్తవ సమాజమంతా మూఖ్యంగా మేత్రాణులు,గురువులు,మఠవాసులు అందరు ఈ క్రుషినిభిన్ందించాలని,ఆదరించాలని నా ఆకంక్ష.మన ప్రజల స్తోమతకు తగినట్లుగా వీటి వెల కూడ చాల తగ్గించడమైనది.కావున ప్రతి ఒక్కరు,గ్రధలయాలు,ఆస్రమలు,మఠాలు,కతోలిక కేద్రాలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని నా మనవి.

ఫా.జోజయ్య గారు చేసిన ఈ కృషిని మరోసరి అభినందిస్తూ,వారు ఇంకా ఆంధ్ర శ్రీసభకు తమ అమూల్యమైన సేవలను రానున్న కాలంలో అందించాలని మనసారా కోరుకుంటూ,ప్రార్ఠిస్తూ...

ఇట్లు

మి జ్ఞానతండ్రీ

+మల్లవరపు ప్రకాష్

విజయవాడ పీఠాధిపతులు