బైబులు భాష్య సంపుటావళి - పవిత్రాత్మ/మనవి మాట
మనవి మాట
బైబులు భాష్యం సంచికలను 1972లో ప్రారంభించాం. ఇప్పటికి 157 సంచికలు ముగిశాయి. వీటినే యిప్పుడు పది బైబులుభాష్యం సంపుటాలనుగా ముద్రించాం.ఈ సంచికల్లో ఓ 60 మాత్రం ఇదివరకే "బైబులు గ్రంథమాల" అనే పేరుతో పుస్తక రూపాన్ని సంతరించుకొని పలు ముద్రణలు పొందాయి.
ప్రస్తుతం ఈ 157 సంచికలమను,వీటిల్లో వచ్చే అంశాలను బట్టి, ఓ క్రమపద్ధతిలో అమర్చాం.ఈ సంపుటాల్లో వుంది ప్రధానంగా బైబులు వివరణలు,దైవశాస్త్ర విషయాలు ,ప్రార్థనాంశాలు.మన క్రైస్తవ భక్తి విశ్వసాలను బలపరిచేది ముఖ్యంగా ఈ యంశాలే. ఎందరో వేదపంతుల భావాలు ఈ పుస్థకాల్లోకి వచ్చయీ. ఆ మహానుభావులందరికీ వందనాలు. ఈ పుస్థకాలు మన క్రైస్తవమత సత్యాలను లోతుగా అర్థంచేసికోవడానికీ,ప్రార్థన జేసికోవగడానికీ,ఇతురులకు భోధించడానికీ గూడ ఎంతో వుపయోగపడతాయి.కనుక మన గురువులు,మఠ కన్యలు,ఉపదేశులు,గ్రుహస్థులు మొదలైనవాళ్ళు ఎవరైనాసరే వీటిని వినియోగించుకొని ఆధ్యాత్మిక లాభాన్ని పొందవచ్చు.
చాల సంవత్సరాల పొడుగున కొనసాగించిన రచనలు కనుక ఈ గ్రంథాల్లో పునరుక్తులు అనివార్యమైయ్యాయి.పాఠకులు మన్నింతురుగాక. మొదట వ్రాసిన సంచికలకు తర్వాత వ్రసిన వటికి శైలిలో కూడా భేదం వుంది.
మన క్యా