బసవరాజు అప్పారావు గీతములు/సౌఖ్యమే లేదా?
స్వరూపం
సౌఖ్యమే లేదా?
సౌఖ్యమే లేదా
లోకమున
సౌఖ్యమే లేదా?
కమలలోచనల
కౌగిళులందున ||సౌఖ్య||
ముద్దులబిడ్డల
మురిపెపుమాటల ||సౌఖ్య||
తల్లిదండ్రులను
తగ కొలుచుటలో ||సౌఖ్య||
బీదసాదలను
ప్రేమ జూచుటలో ||సౌఖ్య||
చెలులకు సాయపు
చేయిచ్చుటలో ||సౌఖ్య||
భగవంతుని మది
భక్తి గొలుచుటలో ||సౌఖ్య||