బసవరాజు అప్పారావు గీతములు/విరహిణి

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

విరహిణి

దీప కళికలు విన్ననై తెల్లబారె
పాన్పుపై నిడ్డపూవులు వాడిపోయె
పిట్టలన్నియు తమ గూళ్ళ వీడి పరచు
స్వామి, నీ దాసికడ కింక వచ్చుటేమి?
కనులు మూతలుపడి నిద్ర గమ్ముచుండె
బడలికంజేసి అవశత నొడలు తూలు
పరవశగజూచి నాసిగ్గుతెరను జీల్చి
చోరువలె పట్టుపడకుండ పారిపోవు
నప్పుడైనను దయయుంచి యంతరంగ
మందు నా ప్రేమ మన్నించి, మరచిపోక
లేపి, నీ ముద్దు మోమును జూపి వేగ
నా మనోలోలతను బాపునాథ! దేవ!