బసవరాజు అప్పారావు గీతములు/లజ్జ
స్వరూపం
లజ్జ
మాటలైన తిన్నగరావే, నను
పాటపాడు మందు వేమి దేవా?
మేటి గాయకుడవౌ నీకడనే
పాటపాడు టేమిసొంపు దేవా?
పదములకూర్పే యెఱుగని నే నెటు
పాటల నల్లంగలనో దేవా?
హృదయ సుమము విచ్చకయే యెటు జి
మ్మెడు భావపరిమళము నోదేవా?
తల్లిబోవ చిన్నతనముననె వే
తల్లుల ప్రేమను బ్రోచిన దేవా?
పిల్లని చింతాగానము విన నీ
యుల్లము నిజముగ గోరెనె దేవా?
మాటలైన తిన్నగ రావే, నను
పాట బాడు మందు వేమి దేవా?