Jump to content

బసవరాజు అప్పారావు గీతములు/నా జీవనదము

వికీసోర్స్ నుండి

నా జీవనదము

అకటా నా జీవనదం బిదియే
మడవుల గుట్టలబడి పారున్‌?
ఒకచో నేనియు చల్లనినీడల
సుకమగు కౌగిలి యబ్బదయ్యెగా!
ఆడుట గుట్టలతోనే, పాటలు
బాడుట గుట్టలకొరకే, అకటా!
వీడెను జవసత్వములన్నియు నీ
పాడుకొండ రాళ్ళపైన దొర్లన్‌
ఇంతేనా? ఇంతేనా? సౌఖ్యం
బీజన్మకు నిక నింతేనా?
సుంతయైన దయ లేదా దేవా?
ఎంతకాల మిటు లోపిక బట్టెద?
అకటా నా జీవనదం బిదియే
మడవుల గుట్టలబడి పాఱున్‌?