బసవరాజు అప్పారావు గీతములు/తెలిసీ తెలియని పలుకులు
స్వరూపం
తెలిసీ తెలియని పలుకులు
పదిమందిలోన పాట బాడుమని
బలవంతము జేయకు నాథా!
పదిమందిలోన పాటలు బాడగ
భయము సిగ్గు వేయును దేవా!
పలువుర రంజింపగ నిచ్చకాల
పాటలు రావే నోటికి దేవా!
తెలిసీ తెలియని పలుకుల గూర్చిన
వలపు పాటలే వచ్చును దేవా! ||పది||
చదువు నీ కడం జాల గల్గుటను
వినిపింతు ప్రేమమెల్లను దేవా!
కనికరించి యొక్కడవె నా ప్రణయ
గానము వినరాలేవా?
పదిమందిలోన పాట బాడుమని
బలవంతము జేయకు నాథా!