బసవరాజు అప్పారావు గీతములు/రాజూ రాణి
స్వరూపం
రాజూ రాణి
రాజులలో రాజు నేను
రాణులలో రాణి వీవు
రాకుమారు డెపుడు కల్గునే
నాచిట్టి మనకు ?
లోక మెపుడు సంతసించునే ?
కవులకు కవిరాజును నా
కావ్యజగద్రాణి వీవు
కావ్యకన్య యెపుడు కల్గునే
నాచిట్టి మనకు ?
దివ్యపదవి యెపుడు కల్గునే ?
నాపాలిటి లక్ష్మి వీవు
నీపాలిటి విష్ణువు నే
నవమన్మథు డెపుడు కల్గునే
నాచిట్టి మనకు ?
భవమోచన మెపుడు కల్గునే ?