బసవరాజు అప్పారావు గీతములు/ప్రణయకలహము
Jump to navigation
Jump to search
ప్రణయకలహము
రొంయి రొయ్యని పాడు తుమ్మెదా
నీవు
కయ్యాలు వద్దనీ తుమ్మెదా
ఆలిమొగులనందు కయ్యం తుమ్మెదా
నున్న
నద్దంమీద పెసరగింజ తుమ్మెదా
వెయ్యి తేనెబొట్లు బోస్తా తుమ్మెదా
చిట్టి
కయ్యాలు మానిపిస్తె తుమ్మెదా.
నాగుల చవితి
నీ పుట్టదరికి నా పాప లొచ్చేరు
పాప పుణ్యమ్ముల వాసనే లేని