బసవరాజు అప్పారావు గీతములు/మజా!

వికీసోర్స్ నుండి

యీదులయెంబడి వూరేగింపుతో
ఇలాయి లట్టే రాముడుకంటే
    ఎల్లా గెక్కూవా?

జగతీలోపల కులాల్లోకీ
సాకలవోళ్ళా కులమే గొప్పా,
సాకలవోళ్ళా కులానికల్లా
సక్కనిపుల్లీ రాముడె గొప్పా
    ఎల్లా గెక్కూవా, ఇం
    కెల్లా గెక్కూవా?

మజా!

ఎల్లొద్దామా పుల్లీ ఎల్లొద్దామా
కల్లు దుకానాని కెల్లొద్దామా పుల్లీ ||
కల్లూ తాగీనోళ్ళు
కైలాస మెల్తారంట
సారా తాగినోళ్ళు
సర్గ మెల్తారంట! || ఎల్లొద్దామా ||

కడుపూ సందరమైతె
కాలవ సారాయైతె
పడుతూ లేత్తూ తాగి
బాగా కై పెక్కాలి
ఎల్లొద్దామా పుల్లీ ఎల్లొద్దామా
కల్లు దుకానాని కెల్లొద్దామా!

వెఱ్ఱిపిల్ల

గుత్తొంకాయ్‌ కూరోయ్‌ బావా!
కోరి వండినానోయ్‌ బావా!
కూరలోపలా నా వలపంతా
కూరిపెట్టినానోయ్‌ బావా!
    కోరికతో తినవోయ్‌ బావా
తియ్యని పాయసమోయ్‌ బావా
తీరుగ వండానోయ్‌ బావా
పాయసమ్ములో నా ప్రేమనియేటి
పాలుబోసినానోయ్‌ బావా!
    బాగని మెచ్చాలోయ్‌ బావా!