బసవరాజు అప్పారావు గీతములు/వెఱ్ఱిపిల్ల
Appearance
కడుపూ సందరమైతె
కాలవ సారాయైతె
పడుతూ లేత్తూ తాగి
బాగా కై పెక్కాలి
ఎల్లొద్దామా పుల్లీ ఎల్లొద్దామా
కల్లు దుకానాని కెల్లొద్దామా!
వెఱ్ఱిపిల్ల
గుత్తొంకాయ్ కూరోయ్ బావా!
కోరి వండినానోయ్ బావా!
కూరలోపలా నా వలపంతా
కూరిపెట్టినానోయ్ బావా!
కోరికతో తినవోయ్ బావా
తియ్యని పాయసమోయ్ బావా
తీరుగ వండానోయ్ బావా
పాయసమ్ములో నా ప్రేమనియేటి
పాలుబోసినానోయ్ బావా!
బాగని మెచ్చాలోయ్ బావా!
కమ్మని పూరీలోయ్ బావా!
కర కర వేచానోయ్ బావా!
కరకర వేగిన పూరీలతో నా
కాంక్ష వేపినానోయ్ బావా!
కనికరించి తినవోయ్ బావా!
వెన్నెల యిదుగోనోయ్ బావా!
కన్నుల కింపౌనోయ్ బావా!
వెన్నెలలో నా కన్నెవలపనే
వెన్న గలిపినానోయ్ బావా!
వేగముగా రావోయ్ బావా!
పువ్వుల సెజ్జిదిగో మల్లే
పువ్వుల బరిచిందోయ్ బావా!
పువ్వులలో నా యవ్వనమంతా
పొదిపిపెట్టినానోయ్ బావా!
పదవోయ్ పవళింతాం బావా!