బసవరాజు అప్పారావు గీతములు/భక్తిమార్గము
స్వరూపం
భక్తిమార్గము
వొద్దే యీ వేదాంతమూ
వొద్దూ వొద్దంటే వినవే ||వొద్దే||
ఉన్నదేమో వుణ్ణేవున్నది
లేనిదేమో లేనేలేదు
ఉన్నదీ పొమ్మన్నాపోదూ
లేనిదీ రమ్మన్నారాదూ ||వొద్దే||
చూడదగినా క్షేత్రా లున్నవి
ఆడదగినా తీర్థా లున్నవి
పాడదగినా పాటా లున్నవి
వేడదగినా దేవుళ్ళున్నా ||రొద్దే||
జీవితము శాశ్వతము కాదూ
భావరాజ్యము కంతూలేదూ
యేవిధానా తుదనెగ్గేమో
దేవుడూ నిర్మొహమాటంటా
వొద్దే యీ వేదాంతమూ
వొద్దూ వొద్దంటే వినవె!