బసవరాజు అప్పారావు గీతములు/ఊరేగింపు
స్వరూపం
ఊరేగింపు
(దాసు మరణమును గూర్చినది)
ఊరేగు [1]మన్మథా ఊరేగవోయ్
పెండ్లి కొడుకూలాగు పల్లకీలో యెక్కి ||ఊరేగు||
వాసంతికాదేవి వన్నె తరిగున్నాది
కీర్తికాంతల్లదిగొ కీగన్ను గీటేని ||ఊరేగు||
కిన్నరులు ఖేచరులు కింపురుషు లంతాను
బాజాలు వాయిస్తు పల్లకితొ వచ్చేరు ||ఊరేగు||
వేదాంతివీ నీకు లేదూ రేపటిచింత
నేడే శుభలగ్నమ్ము వేడుక చూడొచ్చినాము
ఊరేగు మన్మథా ఊరేగవోయ్
పెళ్ళికొడుకూలాగు పల్లకీలో యెక్కి ||ఊరేగు||
- ↑ (చిత్తరంజనుడన్నను, మన్మథుడన్నను ఇంచుమిం చొకటే)