బసవరాజు అప్పారావు గీతములు/ప్రళయాగ్ని

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

ప్రళయాగ్ని

       మండుకొని పోతున్న వండోయ్
                      లోకాలు
       మంట లార్పేయంగ రండోయ్!

            జ్వాల లాకసమంట
            నాలుకలు జాపేను
            కాలానల మ్మిదే
            కాబోలు దైవమా!
            మండుకొని పోతున్న వండోయ్ లోకాలు||

       ఎన్ని సంద్రాలైతె
       యీ మంట లారేను?
       ఆరకుంటేను లో
       కాలు భస్మాలౌను!
       మండుకొనిపోతున్న వండోయ్||

            మనుజమాత్రుల కిట్టి
            మంట లార్పగ నౌనె?
            కరుణించి కాసింత
            కనుముయ్యి ప్రళయేశ!

       మండుకొని పోతున్న వండోయ్
                      లోకాలు
       మంట లార్పేయంగ రండోయ్!