బసవరాజు అప్పారావు గీతములు/కయ్యాల విందు
స్వరూపం
కయ్యాల విందు
గయ్యాళి పెళ్లాన్ని
కట్టుకుంటేను
కయ్యాల కెన్నటికి
కరువు లేదండీ!
కయ్యాలతో మేడ కట్టించుతాము,
వియ్యాలవారి కది విడిది కిస్తాము!
కయ్యాలతో వంట
కాలు వండేము,
బంతులలో కవే
వడ్డించుతాము!
కయ్యాలె అల్లుడికి
కట్నమిస్తాము!
చుట్టపాతల కవే
చుట్టపెడతాము!