Jump to content

బసవరాజు అప్పారావు గీతములు/డాబులు

వికీసోర్స్ నుండి

డాబులు

         కావ్యమల్లే నంచు
              గంతులేసేవు,
         కావ్యమే జీవముగ
              గడుపుతున్నామె?

         రాసిపెట్టిందంత
         రసవంత మంటావు!
         రసరహస్య మ్మొక్క
         రవ్వైన తెలుసునా? ||కావ్య||

         చిట్టి నా చెవిలోన
         జెప్పు రాశ్శెపువలపు
         పలుకులో అచ్చరము
         విలువున్నె నీకైత?

         కావ్య మల్లేనంచు
         గంతులేసేవు
         కావ్యమే జీవముగ
         గడుపుతున్నామె?