బసవరాజు అప్పారావు గీతములు/నిర్వాణసుఖము

వికీసోర్స్ నుండి

             వెనకజన్మలో యేమి
                  పెట్టి పుట్టితిమొ ?
             బంగారుపండంటి
                  పసిబాల కలిగె !
             పెట్టి యెవరిని యేమి
                 తిట్టుకున్నామొ?
             ఇచ్చిన్న దైవమూ
                 మర్చిపోడాయె !
                      --

నిర్వాణసుఖము

             నామంగళప్రదా ! నా చిన్నతల్లి !
             మరువలేదే నిన్ను మాకన్నతల్లి !
             ఉదయాన సూర్యు డీ సదనకాంతులలో
             బంగారు నీమేనిచాయలే గందు !

             మల మలా మాడ్చేటి మధ్యాహ్న వేళా
             గల గలా గలమని క్రింద్ రలేటి

పండుటాకులుఇ పాట పాడుతుండగ
చిట్టీ ! నీయేడ్పు విని దద్దరిల్లేను !
మడమటా సూర్యుండు కుంకేటి వేళా
సందెకాంతులు కళ్లపండ గౌవేళా
వికసించి నవ్వేటి బీరపువ్వులలో
చిరినవ్వునీమోము చూచి మురిసేను !
వెర్రిలోకము సద్దు మణిగిన్న వనక
మత్తన్ని మబ్బు పొత్తిళ్లలో వొదిగి
బజ్జుని మింట వుయ్యాల లూగేటి
చెంద్రుణ్ణి నీమేని పట్టబొయ్యేను !
మాయదారీ నిద్ర మచ్చుఒడిజల్లీ
మనసు గొని దివ్యలోకాలన్ని దిప్పి
తుదకు దయచేసింది నా చిన్నతల్లి !
నీసన్ని ధనియేటి నిర్వాణసుఖము !

సంవత్సరాది

బాలభాస్కరా! అపుడే
వచ్చిన ఉగాదియంచు
బంగరు కిరణాల దుస్తు
 లంగడు మరఉచు కలుకుచు !

గల గల మని వీచెడు చిఱు
గాలిపాట కలరియాడు
మావియాకులార ! మఱచి
పోవుదురే యింతలోనె
బన్నుండి భవద్ధర్శన
మ్ము;న బ్రహ్మానందమ్మును
గను ముద్దుల నాబిడ్డను ?

తోరణాల దూర నేగు
తొందరలో నున్నమిమ్మి
నాపబోను, లోలోననె
యావేదన నడచికొనెద !