బసవరాజు అప్పారావు గీతములు/దాంపత్యము

వికీసోర్స్ నుండి
  • [1]

    దాంపత్యము

పరుషము నాథా యన, నా
దరము ప్రియా యనగ, నింక దాసా యనగా
వరము కాదేని పశువా
పురుషుండానాతి పలుపు (రజ్జు) బోల్పంగదగున్‌.

పండితులు మెచ్చి ముదమందు పరమ నాప్ర
యోగవిజ్ఞాన మెంచను యోగ్య మంచు
బాగుగా శిక్షనొందినవారికేని
ఆత్మవిషయాల నప్రత్యయమ్మె కాదె.

పలవరింతలు

చల్లన్ని చిట్టియొడిలోన తల వుంచీ
ఆకసమ్మున బాఱుమబ్బులను గాంచీ
గలగలని కదలేటి ఆకులను జూచీ
అన్నమూ నీళ్ళెందు కనుచు అడిగేను!

  1. * కాళిదాసు నుండి