Jump to content

బసవరాజు అప్పారావు గీతములు/చిట్టినిద్ర

వికీసోర్స్ నుండి

చీమలూ దూరనీ
చిట్టడవి లోపలా
చిక్కుకున్నానోయి దేవా!
    యేదైన
దిక్కొకటి చూపించుతావా? చీమలూ ||

ఆదిఅంతూ లేని
ఆకాశమధ్యాన
అల్లాడుతున్నాను దేవా!
           దయ వుంచి
చల్లగా యిల్లుజేర్చేవా? ఆదిఅంతూ ||

చిట్టినిద్ర

నే మేలుకొనియుండ లేమ నిద్రించు
నావకడుపులోని నావికుబోలి
రాజుపాలన క్రింద రాజ్యమ్మువోలె
తల్లి పక్కలోని పిల్లలా గొదిగి.