Jump to content

బసవరాజు అప్పారావు గీతములు/జీవయాత్ర

వికీసోర్స్ నుండి

జీవయాత్ర

   ఈ మహాసముద్రమ్ములో నెన్నియెన్ని
      తీరముల జేరవలయునో క్రూరమౌతు
      పాను లెన్నెన్ని గడవగావలెనొ బేల !
      ఇల్లలకగానె పండగా యేమె చెపుమ ?

   నమ్మదగ్గదికాదు సంద్రమ్ముతీరు
      పడవ వోటిది తిన్నగా గడపగల్గు
      నావికుడు వోయె చుక్కాని నీవె చేత
      బూని నెగ్గింపు మీయాత్ర! పన లేడె ?

నా ముక్తి

      బతుకుబరువు మోయలేక
      చితికి చివికి డస్సె వాడి
      పికరుపుట్టి పారిపోయి
      ఒకడనె యేతోటలోనొ

పాటబాడు తుండగ నా ప్రాణి దాటి యేగేనా ?
ప్రాణిదాటి యేగుతుండ పాట నోట మోగేనా ?