Jump to content

బసవరాజు అప్పారావు గీతములు/గొంతెమ కోరికలు

వికీసోర్స్ నుండి

గొంతెమ కోరికలు

కడవలతో ముంచి పారబోయం
గలవె కడలి నీళ్ళన్నియు మాలీ?
చేతుల దేకుచు హిమాలయాగ్రము
జేరంగలవే కుంటిముదుసలీ?
పైపై వలపుననే, ప్రియా, ప్రణయ
పారావారము దాటంగలవే?
కర్మలచేతనె యీశ్వరరూపము
గాంచంగలవే ఛాందసోత్తమా?

కనుమూత

కోడెత్రాచు కనుల కూసమ్ము మూసె
మృగరాజుకన్నుల మూయించె నెండ
ముద్దియ నెమ్మోము మూసె ముసుంగు
కవిచంద్రు మోహాంధకారమ్ము మూసె.