Jump to content

ఫ్రెంచి స్వాతంత్ర్యవిజయము/పదునొకండవ అధ్యాయము

వికీసోర్స్ నుండి

( పెంచి స్వాతంత్ర్య విజయము

పదునొకండవ అధ్యాయము

పదునారవ లూయిరాజు

1

తుర్గో మంత్రి,

పదునారవ యిరాజు రాజ్యభారమును వహించుట తోడనే తుర్గోగను ప్రధానమంత్రిగను , మాలె షెర్బీని రెండవ మంత్రిగను ఏర్పజుచుకొనెను, వీరుభయులును దేశాభిమానులు. దేశములో వ్యాపించిన నూతన స్వతంత్ర భావములు గలవారు. ర్యాంగ ములో మంచి సంస్కరణము గావించి ప్రముత్వమును ప్రభాను రంజకముగ జేయ నుద్దేశించినవారు. పన్నులు వృద్ధి చేయకుండ గసు కొత్తఋణములు చేయకుండగను. మితవ్యయమువలన పరిపాలనము సాగించవలెనని వీరు రాజునకు సలహానిచ్చిరి. వీరు మంత్రులుగ నేర్పడిన ఒక టిన్నర సంవత్సరములలో పది

కోట్లఋణమును తీర్చి... దేశములో వ్యాపించిన ఆ సంతృత్తిని
154

ఫ్రెంచి స్వాతంత్ర్య విజయము

తగ్గించుటకు తుర్గో మంత్రి శేఖరుడు కొన్ని సంస్కరణములను ప్రారంభించెను. రిచ్లూమంత్రిని పదుమూడవ లూయి రాజును, కొల్బర్టుకు పదునాలుగవలూయిరాజును చేయూతనిచ్చి ప్రోత్సహించినట్లు తుర్గోమంత్రికి పదునారవలూయి రాజు సహాయపడిన చో బహుశః "ఫ్రెంచి విప్లవము కలుగకనే యుం డెడిది. కాని రాజు చుట్టును చెడు సలహాదారు లుండిరి. తుర్గో మంత్రి చేయు చుండిన మిత వ్యయమునకు రాణి కసమ్మతిగలి గెను. రాణి యొక్క విలాసములకు కోరిన ధనమియ్యనందున తుర్గో యం దామె కయిష్టము కలిగెను. బీదలను 'బాధించు చుండిన క ర్వి' అను పన్నును తీసి చేసి ప్రభువుల భూముల మీదకూడ పన్ను విధించపలెననియు రాజ్యములోని అందరి భూములను గొలిచి అన్ని భూముల నరి సమానముగ భూమి పన్ను విధించవ లెసనియు, తుర్లో మంత్రి యత్నించెను. మరియు రయితుల చేత బలవంతముగా ప్రభువులు పని చేయించ కూడదని ఉత్తర్వు చేసెను. కావున ఆయనకు వ్యతిరేక ముగ ప్రభువులు గొప్ప యాందోళనముచేసిరి. "ఈరోజున సామాన్య జనులతో పాటు మాభూములమీద పన్నులువేయు చున్నారు. రేపటి రోజున సామాన్య జనులతో పాటు రోడ్ల మీద కూలిపని చేయిం చెదరు" అని ప్రభువులు చెప్పిరి. కొన్ని వర్తక సంఘములకును కొందరు వర్తకులకునుగల ప్రత్యేక వర్తక పుహక్కులను తీసి వేసి తుర్గో మంత్రి దేశములో వర్తక స్వేచ్ఛను పరిశ్రమల స్వేచ్ఛను నెలకొలుప యత్నించెను. ఇది కూడదని ధనికు లగునట్టియు ప్రత్యేక హక్కుల ననుభవించుచున్నట్టియు వర్త

155

పదునొకండవ అధ్యాయము

కులు రాజుతో చెప్పుకొనిరి. మత స్వేచ్ఛను పూర్తిగ నెల లిపి 'దేశ భ్రష్టులైన ప్రొటస్టెంటులను తిరిగి దేశములోనికి రానియ్యవలెననితుర్ఘో సలహానిచ్చెను. ఇందుకు రోమసు కాథ లిక్కు మతగురువులు తుగ్లోను ద్వేషించిరి. యావత్తు దేశము లోను ఒకేచట్టము, ఓ కేవిధమగు కొలపాత్రలు, తూనిక రాళ్ళు అమలులో పెట్టుటకు తుర్గో యుద్దేశించెను. ప్యారిసుపార్ల మేంటులోని న్యాయాధిపతులుసు, ప్రభువులుసు, ధనికులును, రోమను కాథలిక్కు మగురువులును తుగ్లోమంత్రికి వ్యతి రేకు లైరి. రాజు యొక్క సలహాదాగులు తుర్గోమంత్రికి వ్యతిరేక ముగ కుట్ర సలిపిరి. రాజు బలహీనుడై కుట్రకు లొంగెను. ముందుగ మాలె షె.ర్బీని మంత్రిత్వమునుండి తీసి వేసెను. 1776 సంవత్సరము మే నెల 12 ఏ తేదీన తుర్గో మంత్రిని కూడ తీసివేసెను. అవసరమయిన సంస్కరణములను ధైర్యముగా జేసి రాజ్యమునుకాపాడ దలచిన తుర్గో వంటి పేరెన్నికగన్న రాజకీయ దురంధరుని రాజు తీసి వేసిన తరువాత ప్రజు విప్లవము తప్ప ఫ్రాన్సు దేశమునకు 'వేరుశరణ్యము లేదయ్యెను. దూరదృష్టి గల బుద్ధి రాలులందఱును విప్లవము రాక తప్పదని అనుకొనిరి.


నెక్కరు మంత్రి,

తుర్గో మంత్రిని తీసి వైచిన తరువాత నాయన మూసీ వేయించిన ఏబది వర్తక సంఘములును తిరిగి తెర పించిరి. దెబ్బలు కొట్టి నిర్బంధముగా రాజు బాటలలో రయితులచేత కూలిపని చేయించిరి. ఆయన స్థానమున 1776 సంవత్సరము అక్టోబరు నెల

లూయీ రాజు. నెక్కరును ప్రధానమంత్రిగా నియ
156

ఫ్రెంచి స్వాతంత్ర్య విజయము

రాజు మించెను. ఈయన తుర్గోకు సాటియగు రాజ్యాంగ వేత్త కాడు. ఈయనకు దృఢాభిప్రాయములు లేవుగాని యోగ్యుడు. దయ గలవాడు. ప్రజలకు మేలు చేయవ లెనను కోరిక గలవాడు. ఆర్థిక విషయములలో సమర్థుడు. 1778 వ సంవత్సరములో ఫ్రాన్సునకు ఇంగ్లాండులో యుద్ధము సంభవించెను. ఇంగ్లాం డు పై తిరుగుబాటు చేసి తమస్వాతంత్యము కొరకు యుద్ధము గావించుచున్న అమెరికా ప్రజలకు సహాయము చేయవలెనని ఫ్రెంచి మజలు కోరిరి. అందుమీద గత్యంతరము లేక లూయి ఇంగ్లాండుతో యుద్ధమున కొప్పుకొనెను. యుద్ధపు వ్యయ ముసు భరించుటకు మార్గములు మూడే గలవు. కొత్తపన్ను లను వైచుట, లేదా పరిపాలనా ఖర్చులను తగ్గించుట, లేదా ఋణము తెచ్చుట. మొదటి మార్గ మప్పటి స్థితిలో ససంభవము. రెండవది. కొంతవరకే సాధ్యము. కావున మూడవ మార్గమునే నెక్క రవలంబించెను. ఆయనకు కావలసిన ఋణము త్వర లోనే దొరకెసు. మధ్య మతరగతివ్రజ లుత్సాహముతో ఋణముల నిచ్చిరి. కాని ఇందువలన ప్రభుత్వమువారీ ఋణము విశేషముగా హెచ్చెను. నెక్కరు మంతిచే యత్నించిన కొన్ని సంస్కరణములను ప్యారిసులోను ఇతర చోట్లనుగల న్యాయాధి ఇతు "లెదిరించగా రాజు తనకు సంపూర్ణమగు చేయూత నియ్య సందున 'నెక్కరు 1.781 వ సంవత్సరములో మంత్రి పదవికి రాజీనామా నిచ్చెను. నెక్కరు యొక్క సామర్థ్యమును సమ్మి ప్రభుత్వమునకు ఋణమునిచ్చినవారి కందరకునుసు ఆశాభం

గము కలిగెను..

పదునొకండవ అధ్యాయము

2

స్వతంత్రము:
సమానత్వము,

యూర వుఖండమునం దంతటను కొంతవరకీ నూతనాభి ప్రాయములు వ్యాపించియే యున్నవి. వాల్టేరుగారి వ్రాత లకు ఫలితముగ రుప్యాలోని కాథరీసు రాణి యుసు, ప్రష్యా రాజు "రెండన ఫ్రెడరిక్కును, స్పెయిను, పోర్చుగలు, టస్కనీ, సావాయి, ఫొ ర్మారా ష్ట్రాథిపతులను ప్రజాభివృద్ధికరమగు కొన్ని సంస్కరణములు కావించిరి.కాని ఇతర దేశములలో కొంతమంది రాజ్యాంగ చేత్తలు, విద్వాంసులు, ఆర్థిక శాస్త్ర వేత్తలు, మొదలగు వారిలో మాత్రమే నీనవీనభావములు ప్రబ లెను. సామాన్య జను అజ్ఞానములో మునిగి యుండిరి. ఒక్క ఫ్రాన్సు దేశ ములో మాత్రము నాసూస్యపూజలలో నసాధా ణమగు చంచలనము గలిగినది. యూరపు డములో కెల్ల ఫ్రాన్సు విద్యావ్యాపక మునందును, నాగరిక తయందును నగ్ర స్థానము వహించి యుండెను. నూతన భావములు, నూ తనాదర్శ ములు, నూతనా శలు ఫ్రాన్సు దేశములోని ఏప్రతిపట్టణము నందు ను ప్రతిపల్లెయందును వ్యాపించినవి. రాజకీయసంస్కరణపక్ష మువారు పత్రికలను, పుస్తకములను, కర పత్రములను దేశ మునందంతటను వెదజల్లిరి. “స్వాతంత్ర్యము, సమానత్వము” ససు పదము " ప్రతిపతాసు పౌరుని.నోటను ఉత్సాహముతో సుచ్చరించబడుచుండెను. ఇవే' ఫ్రెంప్రజ లారా దించు దేవత లయ్యెను. దేశము యొక్క పరిపాలనా హక్కు ప్రజల దేయని

రూసో పండితుడు వ్రాసియుండెసు. యోగ్యులగు మంత్రులను
158

ఫ్రెంచి స్వాతంత్ర్యవిజయము


లూయిరాజు పదభ్రష్టులను జేసిన కొలదియు ప్రజాభిప్రాయ ముననుసరించి పాలించుటకు లూయి అసమర్థుడని ప్రజలకు భోధపడుచుండెను. రాజునం దయిష్టము దినదినమునకు ప్రబల" మగుచుండెను,

అమెరికా
స్వాతంత్ర
యుద్ధము.

ఇంగ్లాండున కప్పటివరకు లోబడియుండిన అమెరికా పలసరాష్ట్రముల ప్రజలపై నింగ్లీష్ పార్ల మెంటు వారు నూతన పన్నలను విధించిరి. అమెరికావారు తమ ప్రతినిధులు లేని స్వాతంత్య ఇంగ్లీషు పార్లమెంటు వారికి తమ మీద పన్నులు వేయుటకు హక్కు లేడదని చెప్పిరి. పన్ను లిచ్చుటకు నిరాకరించిరి. ఏప్రజలమీద నై నను వారిచే నెన్ను కొనబడిన ప్రతినిధులే పన్నలు విధించు టకు హక్కుగలదు. గాని ప్రపంచములో మరియెవ్వరికిని హక్కు లేదని ఖండితముగా తెలిపిరి. ఇంగ్లీష- వారు. బలవంత ముగా పన్నులను వసూలు చేయుటకు యత్నించిరి. అమెరికా వారికిని ఇంగ్లీషు వారికిని యుద్ధము ప్రారంభ మయ్యెను. 1776వ సంవత్సరము జులై 4 వ తేదీన అమెరికా ప్రజలు స్వాతంత్య ప్రకటనటనముగావించిరి."అమెరికా సంయుక్త రాష్ట్రముల ప్రజలమైన మైన 'మేము భగవ దుద్దేశ్యమైనట్టియు, ప్రతిజాతికిని జన్మ హక్కయినట్టియు, స్వాతంత్యమును మా ప్రతినిధిసభ ద్వారా లోకమునకు ప్రకటించుచున్నారము, మాపక్షమున ధర్మము గలదని నమ్మి, ధర్మస్వరూపుడగు భగవంతునిసహాయము న పేక్షించుచున్నాము” అని ప్రచురించిరి. రాజుగానీ ప్రభువు

లుగాని లేని సంపూర్ణ ప్రజాస్వామ్యము (రిపబ్లిక) ను స్థాపిం

159

పదునొకండవ అధ్యాయము


చుకొనిరి. మనుష్యులందఱును సమానముగానే సృష్టింసబడి నారనియు, దుర్మార్గమైన ప్రభుత్వమును నిర్మూలనము గావిం చుటకు స్వభావమగు హక్కు ప్రజలకు గలదనియు, ఈహక్కు అన్ని కాలములలోను అన్ని జాతులకును గలదనియు రూసో "సోషల్ కంటాక్టు" అను గ్రంధములో వాసిన ధర్మము నే, అమెరివావా రసుష్ఠించినందున అమెరికా స్వాతంత్య ప్రకటనము ఫ్రెంచిప్రజలలో మితి లేని యుత్సాహము కలిగించెను. ప్రధమమున అమెరికావా రపజయముల నొందిరి.. బ్రక్లిన్ వద్ద ఇంగ్లీషు సేనాధిపతి, హెూ, అమెరిక సులను నోడిం చెను. అమెరికను సేనానీ వాషింగ్ట నోడిపోయి న్యూయార్కు పట్టణము నింగ్లీషువారీవశము చేయవలసివచ్చెను. 1777 సం వత్సగము వేసంగిలో వాషింగ్టను సేనాని ఫిలడల్ ఫియాను వద లవలసివచ్చెను. ఇంగ్లీషు సైన్యములు స్కుల్ కలువరకు అమెరి కను సేనలను నెట్టి వేసెను. ప్రతిచోటను అమెరికా వా రోడిపో యి అమెరికా ప్రజలలో నిరాశగలిగెను. ఇంగ్లీషు వారితో నెటు లయిన సంధి చేసికొనుట యుక్తమని కొందఱు చెప్పసాగిరి. కాని ఇంతలో 18 అక్టోబుకు తేదీన సరటోగా మిట్టస్థలములలో ఇంగ్లీషు సైన్యములను అమెరికా వారు సంపూర్ణముగ నోడించి బర్ గాయిన్" సేనాధిపతిని సైన్యములతోకూడ ఖయిదుచేసిరి. 1778 సంవత్సరము ఫిబ్రవరి నెలలో ఫ్రెంచిపోరు. అమెరికా వారి సహాయమునకు వచ్చిరి. ఇప్పటి నుంచియు అమెరికను పక్షము విజృంభించినది. ఇంగ్లీషు వారు ఆగ్రహపరవశులై సమ

ర్థులగు సేనాసుల కింద సైన్యములను వంపిరిగాని లాభము
160

ఫ్రెంచ్వాతంత్ర్య విజయము


. లేకపోయెను. 1781 సంవత్సరం ఇంగ్లీషు సేనాధిపతి కారన్ వాలీసు ప్రభుపు నార్తుకరోలినాను పట్టుకొన యత్నించి విఫలతనొంది యార్కు టౌను మీదికి వచ్చెను. అమెరిక నుల సేనాని జార్జి వాషింగ్టన్ ముట్టడించెను. సముద్ర ముమీద ఫ్రెంచివారి యోడ సైన్యము క్రొత్త సైన్యము లింగ్లాండు నుండి రాకుండా కాపాడెను. ఇంగ్లీషు సైన్యములు పూర్తిగ నోడిం పబడినివి. కారన్ వాలీసు ప్రభువు అమెరిక నుల చేతిలో చిక్కె ను. ఫ్రెంచినావికాసేనాధిపతి డిగ్రాసి ఇంగ్లీషు వారియో డసైన్యము నోడించెను. ఇంగ్లాండులోని ప్రధానమంత్రి నార్తు ప్రభువు "అంతా అయిపోయినది” అని చెప్పి రాజీ నామా నిచ్చెను. 1782 సంవత్సరము నవంబరు నెలలో ఇంగ్లీ షువారు సంధి చేసికొనిరి. ప్యారిసు సంధి వలన అమెరికాసం యుక్త రాష్ట్రముల స్వాతంత్యము సంపూర్ణముగ సంగీక రించ బడెను.

3

స్టేటు జనరలు
సమావేశ పరుచుట

నెక్కరు రాజీనామానిచ్చిన తరువాత ఫ్రెంచి రాజు, కలోనును ప్రధానమంత్రిగా నియమించుకొనెను. ఈయన కూడ ప్రభుత్వముస కై ఋణములు చేయసాగెను. ప్రత్యేక హక్కుల ససుభవించు చుండిన ప్రభువులు మొదలగు వారితో కలహించక నెటులనో కాలము గడపుచుండెను, 'రాణీగారు గోరిన ధనమును మంత్రి యా మెకిచ్చుచు ఆ మెయనుగ్రహ

ముసకు పాత్రుడయ్యెను. కాని కలోను మంత్రి కి కొద్ది కాలము

పదునొకండవ అధ్యాయము

లోనే ఋణములు దొరకుట లేదు. ఆదాయముకన్న వ్యయ మెక్కువయయ్యెను. యావత్తు పరిపాలనా పద్ధతిని, పన్నులను, ఆదాయవ్యయములను సంపూర్ణముగా సంస్కరించినగాని ప్రయోజనము లేదని యాయన గ్రహించెను. కాని సంస్కరణ మునకు యత్నించగానే ప్రభువులు మొదలగు వారియాటంక ములు గలిగెను. 1787 వ సంవత్సరములో కలోనుమంత్రి రాజీనామా నిచ్చెను. తరువాత రాణీగారి సిఫారుసు మీద నేర్పజచ బడిన మంత్రి బ్రయన్ కూడ ఏమియు చేయజాలకపోయెసు. ఇట్టి తరుణములో (స్టేట్సుజనరల్) దేశ ప్రతినిథి సభను పిలువ వలసినదని అన్ని పక్షములవారినుండియు గొప్ప యాందోళనము ప్రబలెను. రాజు అసమర్థుడనియు మంత్రులు నిస్సహాయులనియు అందరికిని తెలిసెను. " ప్రతిసంవత్సరము ప్రభుత్వముపో యాదాయముకంటే వ్యయము 20 లక్షల సుచిరను లెక్కువగు చుండెను. ఇదిగాక ప్రభుత్వము వారు తెచ్చిన ఋణములకు వడ్డీ యియ్యవలసి యున్న చి. దేశములో ధర లెక్కువయినవి. కర వు వ్యాపించినది. వ్యవసాయము, పరిశ్రమలు క్షీణించినవి. ఏ ప్రజా భివృద్ధికరమగు పనిచేయుటకును ప్రభుత్వములో దవ్యము లేదు. రాజకుటుంబము యొక్కయు వారిచుట్టు చేరు బృందము యొక్కయు పరిజనుల యొక్కయు విలాసములు, వైభవములు, దుర్వ్యసనములు 'ముదలగువానికి కావలసిన ఖర్చుమాత్ర మావంతయైన తగ్గ లేదు. సైన్యములలో అసంతృప్తి ప్రబలెను. బీదరయితులు, పనివాండ్రు, కూలీలు, అక్కడక్కడ తిరుగు

బాటులు ప్రారంభించిరి. ప్రతినిధి సభను 1664 సంవత్సరము
162

ఫ్రెంచి స్వాతంత్ర్యవిజయము


నుంచియు పెంచిరాజులు కూర్చలేదు. ఇప్పుడు పదునారవ లూయిరాజు దేశములోని యాందోళ నముబట్టి ప్రతినిధిసభ ను ప్రజలవిశ్వాసమును బడయుట కై ప్రజానురంజకుడుగ నుండిన నెక్కరును తిరిగి ప్రధానమంత్రి నియమించెను. 1778వ సంవత్సరం ఆగష్టులో బ్రయన్ రాజీనా' మా నిచ్చెను. కాని యొక గొప్పసమస్య బయలు దేరెను. తమ ప్రతినిధుల సంఖ్యతో నమానముగ నే మతగురువుల ప్రతినిధులు సంఖ్యయు నామాన్య ప్రజల ప్రతినిధుల సంఖ్య యుసుండ వలేసని ప్రభువులుకోరిరి.. దేశములో ప్రభువులుసు మతగురువులుసు స్వల్పసంఖ్యాకులనియు, సామాన్య ప్రజ. లు రెండున్నరకోట్లు గలరనియు, సొమాన్య ప్రజాప్రజ ప్రతినిధుల సంఖ్య, ప్రభువుల ప్రతినిధులు, గురువుల ప్రతినిధులు కలి. సిన మొత్తముకంటె, తక్కువగా నుండుటకు వీలు లేదనియు, ప్రజ లాందోళసము జరిపిరి. చిన్న మతగురువులు సామాన్య ప్రజలలోనే చేరిరి. మరియొకతగాదా గలిగెను. ప్రభువుల సభ వేరుగాను మతగురువుల సభ 'వేరుగాను ప్రజాప్రతినిధి సభ వేరుగాను నుండవలయుననియు నిర్ధారణ చేయు విషయములో ఒక్కొక్క సభ కొక్కొక్క వోటుచొప్పున నుండవలెననియు ప్రభువులుసు గురువులును చెప్పిరి. ప్రభువులు, గురువులు, ప్రజలు అందరు కలసి ఒ కేసభలో చేరి చర్చించి విషయముల సన్నిటిని పరిష్కారము చేయవలెననియు, ఎక్కువ సంఖ్యాకులు యభిప్రాయమును బట్టి తీర్మానములు కావలెననియు, ప్రజలు

చెప్పిరి. ఈ రెండు విషయముల మీదను చర్చలు విశేషముగా

163

పదునొకండవ అధ్యాయము


జరిగెను. వాదప్రతివాదములు ప్రబలెను. అక్కడక్కడ దెబ్బలాటలకు దిగెను. ప్రభువులను, వారిపక్ష ము వారిని ప ప్రజలు గేలి సేయసాగిరి. అప్పటివరకు, ప్రభువులయొక్కయు గురువులయొక్కయు ప్రత్యేక హక్కులన్నియు నాశనము చేసి, ప్రజలందరికిని సమానహక్కులు సమాన భాధ్యతలుగల ప్రభు త్వముగా చేయవ లెనని మాత్రమే ప్రజలు కాంక్షించిరి. రాజునందు ప్రజలకు ద్వేషము లేదు. రాజును తీసివేయవలె సని ప్రజలు తలచలేదు. కాని లూయి రాజునకు, ప్రజలకు నా యకుడగుటకు తగిన వివేచనగాని నైపుణ్యముగాని లేదు. ఆకా లవు నూతనాభిప్రాయముల తీవ్రతను గుర్తించ లేక పోయెసు. ప్రభువులయిష్టమును కోల్పోవుటకు భయపడి తుదకు ఆ రాజు సింహాసనమును గోల్పోయెను. ఆబీ సైసు అను నాయన వ్రాసిన కరపత్రములో ప్రజాపక్ష మువారి యభిప్రాయములు స్పస్టీక రించబడెను. "ప్రజా ప్రతినిధి సభ (మూడవ శాఖ) అనగ నేమి?" అని ఆయన ప్రశ్నించి, "అదే ఫ్రెంచిజాతి" యని జవాబు వ్రాసెను. “ప్రభువులు, మఠాధిపతులు కలిసి 15 లక్షలు లేరు. తక్కి నప్రజలు 2 కోట్లు గలరు, ప్రభువులు, మఠాధిపతులు సోమరి పోతులు. ఇతరులు కష్టము చేయగా దాని ననుభవించు తిండి పోతులు. జాతియొక్క యభివృద్ధి కాటంకము గలుగ జేయు వారు. సామాన్య ప్రజలను దాస్యములోను కష్టపరంపరలోను- ముంచెడివారు. వీరు లేకపోవుటవలన పెంచిజాతి కేమియు నష్టముగలదా? లేదు. లేక పోగా ఫ్రెంచిజాతి స్వేచ్ఛను సౌఖ్య,

మును పొందును. సామాన్య ప్రజలే నమస్త ఉపయోగకర
164

ప్రెంచిస్వాతంత్ర్య విజయము

మైన పనులను చేయువారు” అని ఆయన వ్రాసెను. మత గురువులలో మఠాధిపతులు ప్రభువుల పక్షమునను, చిన్న గురు వులు సామాన్య ప్రజల పక్షమునను చేరిరి. ఈవాద ప్రతివాద ముల మధ్య నెక్కరు మంత్రి సలహా పైన మొదటిశాఖయగు ప్రభువుల ప్రతినిధుల సంఖ్య యును, రెండవ శాఖయగు మత గురువుల ప్రతినిధుల సంఖ్యయును కలిసిన దానికంటే కొంచె మెక్కువగా మూడవ శాఖయగు ప్రజల ప్రతినిధుల సంఖ్య యుండునట్లు రాజు తీర్మానించెను. 25 సంవత్సరముల వయస్సు పైగలవా రెల్లరు మూడవశాఖ యొక్క సభ్యులను ఎన్ను కొనుట కర్హులని తీర్మానించబడెను. మూడు శాఖలును క లిసి కూర్చోసవ లేనా లేక విడివిడిగా కూర్చొనవలెనా యను విష చుము నిర్ధారణ చేయక విడిచి పెట్టెను. .