ఫ్రెంచి స్వాతంత్ర్యవిజయము/పదియవ అధ్యాయము

వికీసోర్స్ నుండి

ప్రెంచిస్వాతంత్ర్యవిజయము

పదియవ అధ్యాయము


ఫ్రెంచి విప్లవకారణములు


1

పదనారవ
లూయి రాజు

పదునారవ లూయీ రాజు నిష్కళంక చారిత్రుడు. కాని పిరికివాడు. సదుద్దేశ్యములు గలవాడుగాని తన యు దేశ్యములను తన చుట్టునున్న వారికి వ్యతిరేకముగా నమలు జరుపులకు ధైర్యము లేనివాడు. ఈయన భార్యయగు మేరి ఆంటనెటు ఆస్ట్రియారాజు యొక్కకూతురు, ఈ మె మిగుల సౌందర్యవతి. విలాసములయందను రాగము గలది. ఈమెకు భర్తమీద చాల పలుకుబడి గలిగి యుండెను. ఆమె దుర్వ్యయము చేయుచుండెను. దుర్గుణ ములు కలదని చెప్పుటకన్న, దూరాలోచన లేనిదని చెప్పు

నొప్పును.

125

పదియవ అధ్యాయము

పదునాఱవలూయీ రాజు కాలమున ప్రపంచ చరిత్రము నందు మిగుల గొప్పదగు రాజకీయ సాంఘిక విప్లవము జరిగి, ఆయన శిరచ్ఛేదము. గావింపబడెను. ఆయన పూర్వుల పరి పాలనాలోపమువలన దేశమునం దేర్పడిన దుష్టమగు పరిస్థితు లును, ఆకాలమునందు - పరాసు దేశ ప్రజలలో వ్యాపించిన స్వతంత్రభావములుసు ఇందుకు కారణములు.

దుష్టమగు
పాలనము

పదునాలుగవ లూయీ రాజు మిగుల సమర్థుడై తన రాజరికమును సంపూర్ణముగ నిరంకుశముగా జేయుట చూచి యున్నాము. పదునేనవ లూయి కాలమున గూడ రాజరికము పూర్తిగా నిరంకుశముగనే యున్నది. ప్రభు పులు, షతగురువులు కూడ తమ మొఖాసాలలో నివసించు ప్రజలపై విచారణాధి కారమును కలిగియుండిరి. రోజు అవస రము లేకుండ విశేష సంఖ్యాకులగు ఉద్యోగస్థులను పెట్టుకొనె ను. వీరి కందఱకును చేయదగిన పని లేక వంతుల ప్రకారం పనిచేయు చుండిరి. పదమూడు పార్ల మెంటులుసు, నాలుగు రాష్ట్రీయ సంఘములును సివిలు, క్రిమినల్ విచారణ చేయు చుండెను. క్రిమినల్ కేసులలో ముద్దాయి యగువాడు తప్పించు కొనుట కష్టము. నేరము చేసిన ట్లోప్పుకొను వరకును మిగుల ఘోరమగు హింసలకు లోబడ జేసిరి. వకీలుసు "పెట్టుకొని యె దుటిసాక్ష్యము క్రాసుపరీక్ష చేయు హక్కు లేదు. మరణ శిక్షలే గాక అంగ వైకల్యముచేయు శిక్షలును, శరీరములో కొంత భాగము కోసి వేయు శిక్షులును కూడ ఇచ్చుచుండిరి. న్యాయాధి

పతి తీర్పులలో కారణముల వ్రాయ నవసరము లేదు. విచా
126

ఫ్రెంచిస్వాతంత్ర్య విజయము


రణ రహస్యముగా జరుగవచ్చును. బహిరంగ విచారణ జరుప నక్కర లేదు. చెఱసాలలోనికి 'మేజిస్ట్రేటులు వచ్చి విచారించు చుండిరి. చెరపాలలో పెట్టినవారి నేదోవిధముగా శిక్షిం చుటయే న్యాయాధిపతుల ముఖ్యకర్తవ్యము. యధార్థము కనుగొనుట కాదు. న్యాయాధిపతులకు స్వతంత్రత లేదు. పై ప్రభుత్వోద్యోగులు చెప్పిన ప్రకారము శిక్షలు వేయుచుం డిరి. ఒక క్రైస్తవ దేవాలయమున కపచార మొస్చర్చినం దున కొక పంతొమ్మిది సంవత్సరముల కుర్రవాని నాలుకను, చేతిని,కోసివేసి బ్రతికి యుండగా మంటలలో బడి వేసి చంపిరి. తఱుచుగా ఎట్టి విచారణ లేకుండగనే రాజు అనిర్ది ష్టమగుకాలము వరకును ఖైదుశిక్ష గాని, దేశాంతర వాసశిక్ష, సుగాని, చుండెను. మేజిస్ట్రేటులకు జీతములు లేవు, ఇచ్చిన చోటుల తక్కువ జీతము లిచ్చుచుండిరి.. వారు ఇష్టము వచ్చిన విధమున కక్షి దార్ల యొద్ద డబ్బును వసూలు చేసిరి. రాజు ఉద్యోగముల దవ్యమిచ్చినవారి కమ్ము చుండెను. ప్రభుత్వమున కాదాయవ్యయ పట్టికలు లేవు. ప్రభుత్వబొక్క సములో నుంచి రాజు తన యిచ్చవచ్చినంత తీసికొను చుంచెను. రశీదు మాత్ర మిచ్చుచుండెను. రాజు యొక్క యుంపుడుకత్తె లకు సౌలునకు నలుబదిలక్షలు ఖర్చగుచుండెను. ప్రభుత్వపు ఆదాయముకన్న వ్యయ మత్యధికముగ నుండెను. ప్రభుత్వపు ఋణము ఎంతయున్నదో చెప్పుటకు మంత్రులకు కూడ కష్టముగ నుండెను. పరియైన లెక్కలు లేవు. రాజు ఇంద్రియ లోలుడై

అత్యధికముగ దుర్వ్యయము చేయుచుండెను. ఆయన చుట్టును

128

పదియవ అధ్యాయము

దుర్వ్యసనములలో చిక్కి దుర్వ్యయము చేయుచు విలాసము లలో కాలము గడువు స్త్రీ పురుషు లుండిరి. రాజమందిరము అవినీతి లోను కుట్రలోను మగ్నమై యుండెను. ప్రభుత్వమునకు ఋణములిచ్చువారు దొరకక నూటికి సంవత్సరమునకు ఇరువది చొప్పున వడ్డికి తాకట్టుల విూద రుణములు తెచ్చు' చుండిరి. ప్రభుత్వము వారు ప్రజలకు చేయు వాగ్దత్తముల నెప్పు డును చెల్లించకుండుట వలన ప్రజలకు ప్రభుత్వమందెట్టి విశ్వా సము లేకుండనుండెను. పదునేనవ లూయి ఒక్క సంవత్సరము లోపల తన యింద్రియ సౌఖ్యములకొకుకు పదునెనిమిటికోట్ల ద్రవ్యమును తీసికొనెను. కొన్ని పన్నులను పది సంవత్సరము లకు ముందుగానే తాకట్టు పెట్టెను. కొన్ని పన్నులు ప్రభుత్వ మువారు వసూలు చేయక ఇజారాకిచ్చుచుండిరి, ఇజాదార్లు ప్రజల యొద్ద ఎక్కువ వసూలు చేసికొని కొంత మాత్రమే ప్రభు త్వమున కిచ్చుచుండిరి. ఇజా రాదాన్లు గొప్ప యద్యోగస్థులకు లంచమిచ్చి తక్కువ ఇజారాకు పుచ్చుకొనుచుండిరి. పన్నులు బాకీ యున్న వారిని ఖయిదులలో సుంచు చుండిరి. ప్రభుత్వఆదా యములో చాలభాగము వృథాగా పటాలముల క్రింద ఖర్చు అగుచుండెను. అనవసరముగ పటాలములను రాజు పెట్టుకొని యుండెను. రాజు చిత్తము వచ్చినటుల పన్నులను వృద్ధి చేసెను. ఏమనుష్యు నియొక్కయు ప్రాణమునకును, ఆస్తికిని, స్వేచ్ఛకును ప్రభుత్వము యొక్క నిరంకుశత్వము నుండి సురక్షితము లేదు. ఎవరి నెట్టి నిర్బంధములకు లోను జేసినను అడుగువారు లేరు.

చట్టములు , సమానముగ లేవు. ఒక్కొక్క ప్రదేశములో

128

ఫ్రెంచి స్వాతంత్ర్య విజయము

ఒక్కొక్క విధమగు శాసనములుండెను. మనుష్యులను బట్టియు . జూతులను బట్టియు శిక్షలు వేయుచుండిరి .

ప్రజల దుస్థితి.

ప్రభువులలో గొప్ప వారు తమ 'మొఖాసాలను వదలి అందలి అయివజును తీసికొనిపోయి రాజమందిరము చుట్టు చేరి కేళీవిలాసములలో కాలముగడుపువారు రెండవరకమువారు తమ మొఖాసాలలోనే కొద్ది ఆదాయములతో కాలము గడుపువారు. మతగురువులలో మొదటి తరగతివారు మిగుల భాగ్యవంతులుగను, రెండవతరకము వారు బీదవారును నుండిరి. సామాన్యజను లలో రాజునకు ద్రవ్యమిచ్చి, వంశ పారంపర్యమగు మేజ స్ట్రీటు పదవులను కొనుక్కొనిన ఏబది వేలకుటుంబములు గలవు, వీరికి సంఘములో నెక్కువ గౌరవముగలదు. మధ్యమతరగతి ప్రజలు కాయకష్టము చేసి జీవించువారిని హేయముగజూచి . అందరికి అడుగున చెమట కార్చి కష్టించుచు, పై సంఘము యావత్తు యొక్క బరువు క్రిందబడి నలుగుచున్న వారి దారిద్ర్యములోసు అజ్ఞానములోను ముగియుండిరి. వీరందరి క్రిందను అడుగుస వ్యవసాయ బానిసలును, వారికన్న తక్కువగా ఎట్టి పౌరహక్కులును లేకుండ ప్రొటెస్టంటు మతస్థులును,, యూదులును ఉండిరి.

పన్నుల బాథలు.

ప్రభువులు "పెద్దయుద్యోగము లన్నిటిని వశ పరచుకొని యుండిరి. సైనికోద్యోగములన్నియు ప్రభువులకు మాత్రమే యియ్యబడెను. ప్రభువులే న్యాయాధిపతులుగ నుండిరి.

ప్రభువులలో ఆస్తి పెద్ద కుమారునికి

129

పదియవ అధ్యాయము

మాత్రమే సంక్రమించు చున్నందున చిన్న కుమారులును కుమా ర్తెలుసు తరుచుగా మత పీఠములలో మతగురువులుగను సన్యా సినులుగను చేరిరి.ఈవిధముగా గొప్ప మత పీఠములును మత ఉద్యోగములును ప్రభువులకే చెందెను. చిన్న మతగురువులు గనే సామాన్య జనులు ప్రవేశించిరి. మతగురువులకు దేశము లోని ప్రతి భూమి మీదను పదవవంతు అయివజు యియ్యవలెను. ఇదిగాక మతగురువులకును మతపీఠములకును విశేషమగు ఆస్తు లుగలవు. ఈ ఆస్తులన్నియు పన్నుల నుండి మినహాయింపు కాబ డినవి. ప్రభువుల యొక్క భూముల మిద పన్ను ఇయ్యవలసి నపని లేదు. దేశములోని రెండువంతుల భూమి పన్నులు లేకుండ ప్రభువుల చేతిలోసు మత గురువుల చేతిలోను ఉండును. మూడు వంతు భూమి మాత్రమే సామాన్య ప్రజల చేతిలో నుండెను. దీని మీదనే భూమిపన్ను (టాలీ) తొమ్మిదికోట్లు, పైగా పండిన పంటలో కొంత భాగము చెల్లించుట వలన పదుమూకోట్లు; ఇతర పన్నులు అయిదు కోట్లన్నర వ్యవసాయకుల చేత చెల్లించ బడుచుండెను. ఒకే నేరమునకు ప్రభువునకు మిగుల దేలిక యగు శిక్షయు, సామాన్యునకు మిగుల కఠినమగు శిక్షయు, ఇయ్య బడుచుండెను. ప్రభువుకు రెండు సంవత్సరముల శిక్ష వేయగ, సామాన్యుని కానేరమునకే మరణదండన విధించబడు చుండెను. కొన్ని రాష్ట్రములకు కొంత స్వతంత్ర ముండెను. మరికొన్ని రాష్ట్రములు రాజు యొక్క నిరంకుశత్వమునకు లోబడెను. కొందఱు వర్తకులును వర్తక సంఘములును రాజునకు ద్రవ్య

మిచ్చి కొన్ని ప్రత్యేక వర్తక హక్కులను కొనుక్కొనిరి. కొన్ని
130

ఫ్రెంచిస్వాతంత్ర్య విజయము


రాష్ట్రములు స్వేచ్ఛగా సరుకులను ఎగుమతి దిగుమతులు చేసి కొనవచ్చును. మరికొన్ని రాష్ట్రముల చుట్టును సుంకపు శాల లేర్పఱచి సరకులు పన్ను లిచ్చన గాని రాక పోకలు చేయుటకు వీలు లేకుండ చేసిరి. కొల పాత్రలు తూనిక రాళ్ళను అన్ని రాష్ట్రములలో సమానముగ లేపు. ధాన్యము దేశములోని ఒక చోటునుండి మరియొకచోటుకి ధారాళముగ పోవుటకు వీలు లేదు - నిర్పందములకు లోనయ్యెను. పరిశ్రమలు కొన్ని సం ఘములకే యిచ్చియుండుట వలన అందరికి అందుబాటులో లేక చాల ప్రజలకు నష్టముగనుండెను, వ్యాపార స్వేచ్ఛ, పరిశ్రమల స్వేచ్చ అందరికినీ లేకుండెను,

ఉప్పు
పన్నులు

వ్యవసాయము .క్షీణించెను. రయితులు విశేషమగు పన్నుల బాదచే కృశించు చుండిరి. రాజు యొక్క నిరంకుశత్వము కన్నను ప్రభువుల యొక్కయు మతగురువుల యొక్కయు నొత్తిడి ఎక్కువగ నుండెను. భూమిపన్నులను ఇతర పన్నలను చెల్లించుచు, ధాన్యము ధారాళముగ రాకపోకలు చేయుటకు వీలు లేక , ప్రభువుల విలాసార్థము పావురములను, వేటలును ఉంచవలసి యుండి, ప్రభువుల దాక్షపండ్లను గాను గలలో తిప్పుట, ప్రభువుల ధాన్యమును విసరుట, ప్రభువుల రోడ్లను మరమ్మతు చేయుట, ప్రభువుల పొలములలో పని చేయుట మొదలగు పనులను చేయవలసి యుండియు, రైతులు గొప్ప భారమును బాధలను అనుభవించుచు పైగా మిగుల తక్కువవారుగ చూడబడు చుండిరి. వీరి కిందనుండిన వ్యవసాయ

బానిసల సంగతి చెప్పనక్కఱ లేదు. వీరు పశువులకన్న హీన

131


పదియవ అధ్యాయము

హలములలో ముగ చూడబడిరి. భూమివిడిచి వెళ్ళుటకు వీలు లేక ఎల్లప్పు డను స్త్రీలుసు పురుషులును అధిక శ్రమతో పనిచేయుచున్నను, మిగుల ఘోరమగు దారిద్రమునే యనుభవించుచుండిరి. ప్రమభవు లెప్పుడు తలచిన నప్పుడు రయితుల పొలములో గూడ వేటాడుచు పోవచ్చును. పయిర్ల నష్ట పరిహార మియ్యనక్కర లేదు. ప్రభువులు తమ న్యాయస్థానములలో రయితులను కూలీలను : సామాన్యజనులను విచారించి శిక్షలు సేయవచ్చును. భూమి పన్నులుమాత్రమేగాక బీదలను పీడిం చుటకు ఉప్పపన్ను కూడకలదు ప్రభుత్వమువారె ఉప్పును తచూరు చేసి అమ్మవలెను: . ఇతరరులు తయారు చేసిన ఖైదులో నుంచుచుండిరి... మత స్వేచ్ఛ బొత్తిగ లేదు.

ప్రభుత్వమునందు
ద్వేషము

ప్రభుత్వము. ప్రజలను రక్షించుట లేదు. దుష్టమగు పరి పాలన పద్దతుల వలనను పన్నుల భారము వలనను ప్రజల దౌర్భాగ్యమినుమడించు చుండెను. క్షామము, దేశములో స్థాపనమేర్పరచుకొనెను. రోగములు విశేషమయ్యును, పాణములకును ఆస్తులకు స్వేచ్ఛకును సు రక్షితము లేదు. ప్రజల మరణము లెక్కు వయ్యెను. ఆయుష్య ము క్షీణించు చుండెను. ఎక్కడ చూచినను భోజనము లేనట్టియు గృహములు లేనట్టియు బిచ్చగాడ్ర గుంపులు కన్పించుచుండెను. తమయొక్క దుఃఖముల కన్నిటికీ ప్రభుత్వమే కారణమనియు, దీనిని తలకిందు చేసి మరియొక ప్రజాహితకరమగు ప్రభుత్వ మును స్థాపించుకొనినగాని తమ కష్టములు తొలగవనియు

ప్రజలు తలచిరి. మరియు ప్రజలు తమ్ము నొత్తిడి చేయుచు
132

ఫ్రెంచిస్వాతంత్ర్య విజయము

పుట్టుక వల్ల తమకన్న నధికులమనీ యెంచుచు తమ్మునీచముగ చూచుచున్న ప్రభువులయందును ద్వేషమును గలియుండి రి'. ప్రభువులలో కూడ కొందఱు నూతన స్వాతంత్య భావములను పొంది యుండిరి. చిన్న మతగురువులను చాలవరకు సామాన్య ప్రజలభావములనే కలిగియుండిరి. పట్టణములలో మారిన భావములు తీవ్రముగా వ్యాపించినవి. పదు నేసవలూయి రాజు సుమారు అరువది సంవత్సరములు రాజ్యము చేసెను. అంత దీర్ఘ పాలనమున ప్రాజానుకూలముగు ఎట్టి సంస్కరణములును జరుగక పోగా, రోజురోజుకు ప్రభుత్వము ప్రజలు విశ్వాసమును కోల్పోయి దేశములో తివ్రమగు అసంతృప్తి, ఆందోళనము వ్యాపించి యుండెసు.

(2)

స్వాతంత్ర్యభా
వములవ్యా పనము

ఈ దీర్ఘ కాలసమున ప్రభుత్వపద్దతులను సాంఘిక అస మానత్వమును విమర్సించుచు వ్రాసినగ్రంథకర్తలు పెక్కడ్రు బయలు దేరిరి. పదునేడవ లూయి రాజు యొక్క పసితనము నందున్న సంరక్షకులును తరువాత నా లూ యీ రాజును దుర్వ్యసనములలో జక్కుకొని మొత్తము మీద నితర విషయములలో సుపేక్షా భావము వహించి యుం డినందున, అకాలమున మానవ స్వాతంత్యమునుగూర్చియు, మత, సాంపిక, ఆర్థిక, రాజకీయ విషయములమీదను అనేక గ్రంథములును, ప్రకృతిశాస్త్రములును బయలు విడలి దేశము నందంతటను స్వతంత్రోభిలాషను వ్యాపింపజేసెను. కావున

అప్పుడు నిలిచియున్న ప్రతిష్ఠాపనలకును, ఆచారములకును

133

పదియవ అధ్యాయము

ప్రజలలో వ్యాపించిన భావములకును సంబంధము లేకుండెను." దేశ్ ములో పదుమూడవశ తాబ్దపు ప్రతిష్టాపనలు, ఆచార ములు: నిలిచి యుండెను. ప్రజలలో పదు నెనిమిదవ శతాబ్దపు కోరికలు, భావములు వ్యాపంచియుండెను. కావున గొప్పవిప్ల వము రాక తప్పదని తలచుచుండిరి. పదు నేనవలూయి రాజు 'మా తరువాత ప్రళయము వచ్చు 'నని చెప్పుచుండెను.

గ్రంథకర్తలు

ఆ కాలమున ఫ్రెంచివాగ్మయము కవిత్వము తోడను భాషావిషయిక గ్రంధముల తోడను తృప్తిచెందక, సమస్తవిధము లగు గ్జ్నానవ్యాపకమునకు తోడ్పడిన, ప్రజాక్షే మముకొఱకు మిగులసమర్తులగు వారు గ్రంథ ములను వ్రాసి. సంఘములోని లోపములను వెక్కిరించుటకు మా రుగ సంస్కరించు పద్ధతులను సూచించిరి. వాగ్మయమును సా ధనముగ గొని విద్వాంసులు తమయభిప్రాయములను వ్యాపింప జేయ యత్నంచిరి, చుట్టును వ్యాపించియున్న ఘోరమగు అక్ర మములు, అవినీతికరమగు ప్రవర్తనలు, అమాసుషమగు అసమా సత్వము', విశేషమగు దౌర్భాగ్యము వీనిం గూర్చి విమర్శించుట కు బూనుకొనిరి. రాజు యొక్క మంత్రులలో గూడ కొందరు ప్రభుత్వమున గొప్ప సంస్కరణములు కోరుచు గ్రంథములను వ్రాసిరి. 1789వ సంవత్సరముననే అర్గెన్ సన్ ప్రభువు. రాచ కీయసంస్కరణములను కోరుచు నొక గ్రంధమును వ్రాసి "ఈ గ్రంథములోని సిద్ధాంతములు ప్రజాపాలసమున కను కూలముగా

నున్నవిషయు, ప్రభు పరం పర యొక్క నాశనమునకు తోడ్పడునని
134

ఫ్రెంచి స్వాతంత్య్ర విజయము


యు తలపవచ్చును. ఎట్టి సందేహమును పొందనక్కఱలేదు. ప్రభ్వుక్షేమమున కావశ్యకమగు రెండువిషయములు స్థాపించుట." , కు అడ్డము వచ్చు బుద్ధి హీనమగు విశ్వాసములను తొలగద్రోయ వలెనని యే నేను కోరునది.. ఆరెండు విషయము లేవన - ఒకటి: అందరు పౌరులును తమలో తాము సమానులుగ నుండుట; రెండవది: మనుష్యులు తాము కష్టపడి సంపాదించిన దానిని అను భవించుట, ప్రభువులు సోమరిపోతులు,” అనివాసెను. మరి మంత్రి యగు మషాల్టు అను నాయన టాలి, అను భూమిపన్నును తీసివేసి పభువులు, మతగురువులు, సొమాన్య జనా లు మున్నగునందరును తమ తమ భూముల మీద సమానముగా చెల్లించునముల నొక శిస్తును ఏర్పాటు చేయవలెనని వ్రాసెను. ఛాయిలు సెలు అను మంత్రికూడ సంస్కరణము కావలెనని వ్రాసెను. మత పీఠములు చాల ఎక్కుడుగ నున్నదనియు వీనియ న్ని టి మీదను సరిగా పన్నులు వేసినచో ప్రభుత్వము యొక్క ఆర్థిక స్థితి బాగుపడుననియు గూడ ఈయన వ్రాసెను. పరాసు దేశములో స్వతంత్ర విప్లవమునకు కారకులగు గ్రంథకర్తలలో మిగుల ముఖ్యులు వాల్టేను, రూసో అను వారు ఇద్దరు.

వాల్టేరు 1694 వ సంవత్సరమున పారిసునగరమున జన్మించెను. ఆయన తండ్రి యొక న్యాయాధిపతిగ నుండెను. పదునాలుగవ లూయి రాజు ప్రొటెస్టెటులను

వాల్టేరు,

బాధించుటను గూర్చి వాల్టేరు ఆక్షేపించెను. ప్రహసనములు వ్రాయుటలో వాల్టేరు అసమానపు ప్రగ్న గల

ఎటులను

135

పదయవ ఆధ్యాయము


వాడు. ఇరువది యొక్క సంవత్సరముల వయస్సున పదునాలు గవలూయి రాజును వెక్కిరించుచు ప్రహసనము వ్రాసినాడని ఈయనను బాప్టిల్ కోటలో కొంత కాలము ఖైదు చేసిరి. ఈ యన తన కెప్పుడు ఆ పాయము కలుగు నని తోచిన నప్పుడు జర్మనీ లోనికి లేచి పోవుటకు వీలుగ నుండుటకై ఫ్రాన్సు యొక్క సరి హద్దున నున్న సిడ్నీ పట్టణమున నివసించెను.


ఈయన కవిత్వము, నాటకములు నవలలు, ప్రహ సనములు, వ్యాసములు, చరిత్రలు, తత్వ శాస్త్రము, రాజ కీయశాస్త్రము, ప్రకృతిశాస్త్రములు మొదలగు నన్ని విషయము లను గూర్చియు ససంఖ్యాక ములగు గ్రంథములు వ్రాసెను. ఏబది సంవత్సరముల కాలము ఎడతెగకుండ గ్రంధములు వ్రాయుట చే యూరపు ఖండమునందంతటను ప్రభువుల చేతను, ప్రజల చేతను, గౌరవాశ్చర్యములతో నీయన గ్రంథములు చదువబడు చుండెను. ఈయన వ్రాసినగ్రంధములు ఎనుబది .తొమ్మిది సంపుటములయ్యెను. సామాన్య జనులు చమవగలుగుటకై గంధములు చౌకగ నమ్మించెను. గ్రంధ విక్రయమువలన విశేష ధనమును సంపాదించెను. యూరపు లోని 'సెక్కు మంది రాజులును, ప్రభుపులుసు, రాజకీయ వేత్త లు నీయనకు స్నేహితులుగ నుండి. పరిపాలనలోను, శాసముల లోను, రాజ్యాంగవిధానములోను గల లోపములసు మిగుల కఠినముగ విమర్శించెను. సాంఘిక దోషములను, అసమానత్వ మును తీవ్రముగ ఖండించెను. నీతియు న్యాయను వర్థిల్ల

వలె సనియు, మానవులకు సమానత్వమును స్వాతంత్రమును
136

"ఫ్రెంచి స్వాతంత్ర్య విజయము

కావలెననియు తన ప్రతిగ్రంధమునందును వ్రాసెను. అన్ని తర గతుల ప్రజలును చదువుకొనుటకు వీలుగా ననేక విధములు, వ్రాసెను. ఆకాలమున మానవులు ఆస్తి యందు మాన ప్రాణము లయందు ప్రభుత్వములకు గాని, మతగురువులకుగాని ఎట్టిలక్ష్య మును లేకుండెను. ప్రభుత్వము చేసెడి అక్రమములను నిర్భయ ముగ చూపనందునకును, రాజకీయాభిప్రాయములు వెల్లడించి సందునకును శిక్షించుట మిగుల దుర్మార్గమగు అనాగరిక పద్ధత యని వాల్టేరు వ్రాసెను. మత స్వేచ్ఛ లేకుండ జేయుట గోప్పపాపకృత్యమనియు ఆయన వ్రాసెను. మానవజన్మము మిగుల. ఘనమయిదనియు, అభిప్రాయములను నెల్లడించినం దులకు మానవుని కష్ట పెట్టుట కన్న అమానుషకృత్యము మరి యొక యుండనేర దనియు ఆయన చూపెను, వాక్స్వాతంత్రం, పత్రికా స్వాతంత్యము, మత స్వేచ్ఛ- ఈ మూడును సంపూర్ణముగ నుండవలెనని. ఆయన తీవ్రముగ వ్రాసెను . ప్రభుత్వములును, మతగురువులుసు ప్రజల స్వేచ్ఛను, నీతిని వృద్ధి చేయుటకై ఫుట్టినవారుగాని, ప్రజల స్వాతంత్యము నణ చుటకును, ప్రజలను భయ పెట్టి మనసులోని యభిప్రాయము లకు వ్యతి రేకముగ మాటలాడు. కపట వేషధారులను గావిం చుటకు పుట్టినవారు కారని ఆయన విమర్శించెను. ఏబది సంవత్స రములు ఆయన ఫ్రాన్సు దేశమున గొప్ప జ్ఞానజ్యోతియై --ప్రకా శించెను. మానవులు పోగొట్టుకొనిన స్వాతంత్యమును తిరుగ సంపాదించుటకు సంతతము కృషి సలిపెను. తన దేశములో రెండుతరములవారి అభిప్రాయములను భావములను ఉద్రేక

137

పదియవఆధ్యాయము

ములను పూర్తిగా మార్చివేసెను. " మేము విప్లవమునకు విత్తులు వెదజల్లుచున్నాము. విప్లవము రాకతప్పదు" అని వాల్టేరు పండితుడు 1762 వ సంవత్సరమున వ్రాసెను. 1778 వ సంవత్సరము. ఫిబ్రవరి నెలలో ఎనుబదియారు సంవత్సరముల వయస్సు నీ మానవ స్వాతంత్య వాది పారీసు నగర మును దర్శించెను. అప్పుడు ప్రజలు గొప్ప యుత్సవము చేసిరి ప్రజలు గుంపులు గుంపులుగ నాయన దర్శనమునకై వచ్చి, యా యన యింటిముందర నాదిన మంతయు వేచియుండిరి. వాల్టేరు చిరం జీవి: యగు గాక" అను ద్వనులే ఏమూల జూచిసను చెలరేగెను. దీనితో. రాజులు కూలిపోయెదరుగాక ! తత్వజులు ప్రబలుదురు గాక!” అను కేక లుకూడ మిళితములయ్యెను. ఆమెరికా స్వాతం త్ర్యై నాదియగు బెంజమిన్" ఫ్రాన్కులను తనమసుముని వాల్టేరు యొక్క యాశీర్వచనముకొరకు గొనిపోయెను. పిల్లవాని శిర మున తన హస్తముంచి " భగవంతుని యనుగ్రహమును, స్వాతం త్వమును పొందుదువుగాక" యని యా జగద్విఖ్యాతపురుషు డాశీర్వదించెను. మార్చి 30 తేదిని ప్యారిసుసందలి యొక సుప్ర సిద్ధ నాటక శాలలో నాయన రచించిన "బరిన్ అను నాటకము ను ప్రదర్శించిరి. ఆయన శిరమున పుష్పకిరీటము సుంచిరి. స్త్రీలు తమ రెక్కలమీదనే యాయనను నాటక శాలనుండి బండిలో నికి గొనిపోయిరి. వురుష, లాబండిని ఆయనయంటి కీడ్చుకొని పోయిరి. ఆయన మీదపడిన పుష్పగుచ్ఛములకును, విరిదండల కును మేర లేదు. "నాబిడ్డలారా! నన్న గులాబీ పుష్పముల కింద

అణచి వేయదలచుకొన్నారా!" అని యూముదుసలి ప్రశ్నించెను

138 .

ఫ్రెంచి స్వాతంత్ర్యవిజయము

తరువాత రెండు నెలలకే యూ పండితోత్తముడు ప్యారిసు సగర మున చనిపోయను. ఆయన శవమును సమాధి చేయుటకు రోమ, నుకాథలిక్కు మతగురువులు రాలేదు. ఆయన మేనల్లుడగు నొక మతగురువు రహస్యముగా నాయన కళేబరమును, గొనిపోయి తమయాజమాన్యము క్రిందవున్న దేవాలయపు దొడ్డిలో పాతి పెట్టెను.ఇందునకై యామతగురువు తన యుద్యోగమును గోల్ఫోయెను. మతస్వేచ్ఛను. బోధించినందులకై ఆయనశవ ము మీద మతగురుపులు తీర్చుకొనిన కసి ఇది:


పెంచి విప్లవమునకందరికన్న నధిక కారకుడగు రూసో 1712 వ సంవత్సరమున జన్మించెను. అతడు స్విడ్జర్లాండు లోని

రూసో

జినీవాపట్టణమందలి గడి యారములు తయారు చేయునొక కార్మిరుని కుమారుడు . చిన్న తనమున దిన్నగ చదువుకొనక , ఏపనీయు నేర్చుకొనక కాలము చెడు సాంగత్యములతో దేశద్రిమ్మరిగా నుండెను ఆయన జీవిత మంతయు కడు పే రికమున గడిచెను..ఆరోగ్యము కూడ సరుగ లేక అనేక కష్టములకు లోనగుచు, సంతోషమనునది యెరుంగక మనోవ్యాకులము : కలిగియుండెను. అప్పుడప్పుడాత్మహత్య గావించుకొన దలచుచు వచ్చెను. కాని, యెవరిని కూడ లక్ష్య పెట్టక అత్యధిక మగు ఆత్మగౌరవము కలిగియును. ప్రభు వైసను, మరి యే యితరులైనసు సహాయము చేయ యత్నించినచో దానిని తిరస్కరించు చుండెను. అవసరములను తగ్గించుకొని తాను కష్టపడి సంపాదించుకొనిన దానితో మాత్రమే ఆయన జీవించెను. తన పిల్లల నయిదుగురిని అనాధశర

139

పదియవ అధ్యాయము


ణాలయమున నప్పగించెను. బీదలతోనే నీతిమంతమైన మనుషత్వము గలదనియు, నందులకు వలన బీదలుగనే తనపిల్లలు పెరుగ వలయుననియు, అట్లు పెరిగి స్వయముగ కష్టపడి సంపా దించుకొను దానితో డనే........ కదలనియు ఆయన తలంపు , ఆయన మిగుల స్వతంత్రుడును, స్వభావ ప్రతిసాధకుడు నగు గ్రంథకర్త . పదునిమిదవశతాబ్దములోని ఫ్రాన్సు దేశ ప్రజలను రూసో గ్రంథము నుద్రేక పరిచినంతగ మరి యేరి గ్రంథములు నుద్రేక పణుపలేదు. ఈయనగ్రంథములు మిగుల తీవ్రభావములుగలిగి, యుద్రేక పూరితములై ప్రజా సమూ హముల హృదయములను పూర్తిగ నాకర్షించెను. ఎల్లప్పు డును రాజులును, ప్రభువులును మనయంర్య ద్వేషమును ప్రజా సమూహము లీయన యందత్యంత గౌరవమును, గలిగి యుండిరి. ఈయన విశేషముగా తోటలలోను కొండలలోను అడవుల లోను: శలయేళ్ళ వద్దను పచ్చిని బయళ్ళమీదను ” కాలము గడుపుచు సృష్టి సౌందర్య ముల సత్యధిక ముగ ప్రేమిం చును. మనుష్యుల సొంగత్యము నుండి దూరముగ నుండుటను ఒంటరి తనమును కోరుచుండెను. మానవులను నాగరికత యనునది వైజధర్మములనుండి దూరముగ జేసి మాలిన్యమును కలుగ జేసినదనియు, నాగరికత యను విషవృక్షమును సరకి వైచి మానవులు స్వచ్చమగు సహజస్వభావమును తిరిగి పొంది, సృష్టికర్త యొక్క యుదేశ్యములను నెరవేర్చవలెవ్బ్ననియు నా యనముఖ్య సిద్ధాంతము. “సృష్టిలో అందరు సమానులు, ఎక్కువ

తక్కువలు లేవు. స్వభావముగ, నీతిగలవారు, శరీర
140

ఫ్రెంచి స్వాతంత్ర్య విజయము

దార్థ్యము, 'స్వేచ్ఛ గలవారు. నాగరికత యనునది అసమా నత్వమును అవినినీతిని తెచ్చినది. శరీరదాఢ్యమునుకూడ పాడు చేసినది. కొద్దిమంది స్వార్థపరులు విశేష మందిని దాసులుగ జేసికొనినారు. కావున నాగరికతను నిర్మూలము చేసి మసు ష్యూలలో స్వభావసహజమగు నీతి, స్వతంత్రము, సమానత్వము లను తిరిగి స్థాపించవలెను.. విద్యగలవారి కన్న విద్య లేనివారును, నాగరికులకన్న అనాగరికులును , భాగ్యవంతులకన్న బీదవారును ఎక్కువ నీతిమంతు" లని ఈయన వ్రాసెను. ఈయనయు, వాల్టేరును క్రైస్తవములోని మూఢ నమ్మిక లను తీవ్రముగ ఖండించిరి. మత సహనము కొరకు వాదించిరి. వాల్టేరు దేవుని నమ్మని నాస్తికుడు . రూసో దయాస్వరూపుడగు సృష్టికర్త గల డని నమ్ము ఆస్తీకుడు. - దాదాపుగ ఆయన కేబది సంవత్సర ములవయస్సు వచ్చువరకును మంచిగ్రంథములు వ్రాయ లేదు. అప్పుడాయనకు తీవ్రమగు సంకల్పముగలిగి 'న్యూ హె లాయిసా' యన సపలను ప్రధమమున వ్రాసెను. దానిని ఫ్రాన్సు దేశములోని స్త్రీలును పురుషులును అత్యుత్సాహము తో చదివిరి. రూసో నాగరికత లేనపుడున్న స్వభావస్థితిని వర్ణించుటలో అసమానుడు. దానిని చదివినవారు రూసో యె క్క యభిప్రాయములలో పరవశులై పోయి... ఎన్ని గ్రంథము లైనను కొద్దిగంటలలో ఖర్చగుచుండెను. ఫ్రాన్సు దేశములోనే గాక జర్మనీలోకూడ నీయస కీ ర్తి యత్యంతముగ వ్యాపించెను . ఈయన స్వదస్తూరి గలకాగితమును ముద్దు పెట్టుకొననిచ్చినం దునకును, ఈయన నీరు త్రాగిన పాత్రలో త్రాగనిచ్చినందునకును

141

పదియవ అధ్యాయము


స్త్రీలు దుకాణదార్ల కెంత సొమ్మయిన నిచ్చిరి. ఆయన వ్రా సిన మాటలు ఒక గొప్ప ప్రవక్త యొక్క సందేశములని ప్రజలు నమ్మిరి. సంఘములో గొప్పవారమని అనుకొను వారి యొక్క యు, పుట్టుక వలన అధికులమని అనుకొనువారి యొక్కయు, ధనికుల యొక్కయు, బిరుదములు గలవారియొక్కయు దురాశ, మోసములు, దేశ ద్రోహములు హృదయాకర్షణముగ వర్ణించి సామాన్య ప్రజలలో వారియంద గౌరవమును కలుగ చేసెను. గ్రామములను విడువవద్దు. బస్తీలలో చేర వద్దు. బస్తీలలో చెడిపోవుటకు మార్గముల నేకములు గలవు." పల్లెటూళ్లే స్వచ్ఛమయినవి, నీతిమంత మయినవి,” అని అయన, వ్రా సెను. పల్లెటూళ్ళలో కాయకష్టము వలన జీవించు పేదల యొక్క ఆడంబరము లేక నీతిమంత మైనట్టియు, దురాశా ప్రేరిత ములు కానట్టియు, మితవ్యయము గలిగి నట్టియు, చవితముగా సౌఖ్యవంతమయినవనియు ఈశ్వరునికి మిక్కిలి ప్రీతికరమని యు చూపెను.. 1752 వ సువత్సరమున ఆయన 'సోషల్ కంట్రాక్టు' అను గ్రంథమును వాసెను. . ఇది ఆయన వ్రాసిన గంధములలో కెల్ల ముఖ్యమైనది. రాజులు దైవాంశ సంభూతు లను సిద్ధాంతము స్వార్థ పరులచే కల్పింపబడినదని వ్రాసెను. " దేశము ప్రజలది. ప్రజలు మొదట ప్రభుత్వములు లేక ఎవరి యిష్టమువచ్చిన, విధమున వారు ప్రవర్తింపుచు సం పూర్ణ స్వేచ్ఛను గలిగియుండిరి. కాని కలహములు కలుగు చుండెను. శాంతి కలిగియుండుటకై ప్రజలందఱును కలిసి

ప్రభుత్వము నేర్పఱచుకొసిరి. రాజులుగాని మరి యే ప్రభు
142

ఫ్రెంచి స్వాతంత్య విజయము

త్వమువారుగాని ప్రజ లేర్పఱచుకొనగ వచ్చినవారు. ప్రజలలాభ మునకై ఏర్పడిన వారు. ప్రజలకు నేనౌకరలు. తమ్మును తాము పాలించుకొన హక్కు ప్రజలది. ప్రజల చిత్తమే. చట్టము. ఏప్రభుత్వమునందు ఎప్పుడు ప్రజల కష్టము లేక పోయి నను; ఆప్రభుత్వమును కూలదోసి తమ యిచ్చవచ్చిన ప్రభుత్వమును. ప్రజలు స్థాపించు కొనవచ్చును." అను నది ఆయన వ్రాసిన 'రాజకీయతత్వము ప్రభుత్వమును ప్రజల యిష్టము నకు వ్యతి రేకముగ ప్రవర్తించుటకు హక్కు లేదు. ప్రజల'స్వాతంత్యమును పాడు చేయుటకు అర్హత లేదు. స్వాతం త్యము ప్రజల సహజధర్మము, ప్రజల స్వతంత్రతను కాపా డుకోనుటకును: ప్రజల చిత్తముసకు లోబడి నడుచుకొనుటకును ప్రథమమున యొడంబడిక జరిగి ప్రజలు ప్రభుత్వముల నేర్పర చుకొన్నారు. కాల క్రమమున రాజులును ప్రభువులును ఇతర ప్రభుత్వము లును: మొదటి యొడంబడికకు భిన్నముగ ప్రజల స్వతంత్రతను హరించి ప్రజలను దాసులను చేసికొని, నిరంకు శత్వమును స్థాపించి యున్నారు. ప్రజలు తమహక్కులనుగూర్చి మరిచిపోయి 'బాధలకు లోనయి నారు.తిరిగి స్వతంత్రతను సంపాదించుకొనుట ప్రజలవిధియై యున్నది. దేశములోని ప్రజలందరును ఒకేజాతి. ఎక్కువ తక్కువలు లేవు. అందరికిని దేశాభిమానమును తిరిగి బోధించవలెను. దేశాభిమానము స్వభావసిద్ధమయినది. దానిని ప్రజలు ప్రభుత్వముల యెత్తడి క్రిందను, ప్రభుత్వములు చూపించు తప్పుడుత్రోవలలో ప డియు మరచిపోయినారు. దేశములోని ఎక్కువ సంఖ్యాకుల

పదియవ అధ్యాయము


యభిప్రాయ ప్రకారము దేశ ప్రభుత్వము సాగవలెను. ఎక్కు వమందియభిప్రాయుము ప్రకారము భిన్నాభిప్రాయమిచ్చిన తక్కు- వ మంది నడుచు కొనవలెను. ప్రభుత్వమునకును, ఏమతమున కుసు సంబందముండ గూడదు. ప్రజలు తమయిచ్చవచ్చిన ఏమ తమునయినను.ఆవలంబిం చుటకు సంపూర్ణ మగు స్వతంత్రత గలదు." అని ఆయన వ్రాసెను.


1762 వ సంవత్సరము మేనెలలో ఎమిలియను అనుగ్రం థము నాయన రచించెను. ఈమూడు గ్రంథ ములును పరాసుప్ర జలలో విశేషమగు దేశాభిమానమును పురిగొల్పి తీవ్రమకు స్వత ంత్రతభావములను కలుగజేసెను. అందరును ఈగ్రంథముల ను చదువుచుండిరి.. 1762 వ సంవత్సరము జూన్ నెలలో నీయన గ్రంథములను తగులబెట్టుటకును". ఈయనను ఖైదుచే యుటకును ఫ్రెంచి రాజుత్తరవు చేసెను. ఈయన పరాసు దేశ మువిడిచి భార్య తోకూడ పారి పోయెసు. యూరోపులో నే దేశమునకు పోయినను ఈయన ఖైదుచేయుమని ఆ ప్రభుత్వము నారుత్త రువిచ్చుచుం డిరి. నిలుచుటకు నీడ లేక ఎనిమిది సం వత్సరము లీయన ఒక దేశ మునుండి మరియొక దేశమునకు తిరిగెను. హాలెండు దేశములో నీ యన గ్రంథము లచ్చు పడి పరాసు దేశము లోనికి వేల కొలది దిగు మతియగుచుండెను, సమస్త జాతుల వారును ఆత్రుతతో చదువు చుండిరి. గ్రంథము లచ్చొత్తించువారు ధనమును సంపాదించు కొనిరి.దీనిని పరాసు ప్రభుత్వ ము వారాపజాలక పోయిరి. కొంత కాలమున కీయనకు ప్రష్యా రాజగు ఫెడరిక్" ది గ్రేటు

తన రాజ్యములో నివసించుటకు అనుజ్ఞయిచ్చెను.ఫ్రెడరిక్ రాజు
144

ఫ్రెంచి స్వాతంత్ర్య విజయము

ఉదార స్వభావుడు. విద్యా పోషకుడు. ఈ గొప్ప గంథకర్త కవసర మైన గృహనిర్మాణము గావించి యిచ్చేదననియు, ఈ యన పోషణ కగుఖర్చు తానే భరించెదననియు ఫెడరిక్కు రాజు రూసో పండితునికి కబురు చేసెను. కాని రూసో ఎట్టి ధన సహాయము పొందుటకుమ నిరాకరించెను. "ఆకలియయినచో గడ్డినిగాని చెట్ల వేళ్లనుగాని తిని బ్రతి కెను. కాని ఎవరిని పనిచేయకుండ దవ్యమును పుచ్చుకొనను. రాజులకు వ్యతిరే కుడను; వ్యతిరేక ముగా వ్రాసినాను, ఇంకను వ్రాయ దలచు కొన్నాను. 'రాజులనుండి బొత్తుగా ధనసహాయమును పుచ్చు కొనను” అని రూసో ప్రత్యుత్తరము వ్రాసెను. ఇక్కడ ఫ్రెడ రిక్కు ది గ్రేటు యొక్క యౌదార్యమును రూ సోపండితుని యొక్క . ఆత్మగౌరవమును విశదమగుచున్నవి. ఆత్మగౌరవమును కాపాడుకొనుటకొరకు 'పేదరికి మును స్వీకరించిన ఆంధ్ర దేశపు మహాకవి బమ్మెర పోతనామాత్యుడు వ్రాసిన

“ బాలరసాలసాల నవపల్లవ కోమల కావ్యకన్యక
గూళలకిచ్చి యప్పడుపుకూడు భుజించుటకన్న సత్క ఫుల్
హాలికులైననేమి గహనాంతరసీమల గందమూలకౌ
ద్దాలికు లైన నేమి నిజదారసుతోదరపోషణార్థమై.”

"ఇమ్మను జేశ్వరాధములకిచ్చి పురంబులు వాహనంబులు
సొమ్ములు కొన్ని పుచ్చుకొని సొక్కి శరీరము బాసి కాలుచే
సమ్మెట వ్రేటులంబడక సమ్మతి శ్రీహరికిచ్చి చెప్పినీ
బమ్మెర పోత రాజొకడు భాగవతంబు జగద్ధితంబుగఁన్.”

145

పదయవ అధ్యాయము

అను పద్యములలోని భావములనే ఫ్రాన్సు దేశవు మహా గ్రంథ కర్తయగు రూసో కూడ తెలిపియున్నాడు. సుప్రసిద్ధుడగు గంధ కర్తను అతని యభిప్రాయములతో నేకభవించ నంతమాత్ర ముచేత కష్టములపాలు సేయుట అవి నీతీయని ఫ్రెడరిక్కు రాజు తలంచి తన రాజ్యములో రూసో కు నిలువనీడ నిచ్చెను. ప్రష్యాలోని యొక సరస్సుయొడ్డనున్న 'మోటియర్సు అను నొక చిన్న గ్రామములో రూసో యొక చిన్న కుటీ మును నిర్మించుకొని తన భార్యతోగూడ కాపురముండెను. అచటి సృష్టి సౌందర్యములకు మిగుల సంతసించు చుండెను. అచటి అడవులలోను కొండలలోను సంచరించుచుండెను, తనకు ఆత్మశాంతి కలిగినదని ఆయన ఎంచెను. తన పుస్తకములు కొనిన వర్తకుడు తనకు పంపుచున్న నెలకు పదునారు రూప్యముల రాబడితో ఆయన తృప్తి నొందెను. మరియు ఆయసము ఆయని భార్యయుచేతితో జగీని తయారుచేసి విక్రయించి నెలకు అయిదారు రూప్యములను సంపాదించు చుచుండిరి. యూరపు యొక్క అన్ని జాతులకు చెందిన ప్రజ లేమి, విద్వాంసు లేమి, ఇన్ని ప్రభుత్యముల వారి చే బహిష్క రింపబడిన ఈ ప్రఖ్యాతపురుషుని దర్శించుటకు పచ్చుచుం డిరి. అనేక విషయములలో ఆయన యభిప్రాయముల నరయు చుండిరి. తన నాలుగు నెలల కుమార్తెను ఎటుల పెంచవలె నని వర్టెంబర్గు ప్రభువు రూసోపండితుని యభిప్రాయము కను గొనెను. నేమ ప్రభుత్వము పై తిరుగబడి ప్రజాస్వామ్యము

నేర్పచు కొనిన కార్సికను ప్రజలు తమకొక రాజ్యంగవిధా
146

ఫ్రెంచి స్వాతం త్య విజయము

నమును తయూరుచేసి యియ్యవ లెనసి రూసోను కోరిరి. కాని కొలది కాలములో మోట యర్సునుండి కూడ రూసో పారిపో వలసివచ్చెను. అచటి జనులు రోమసు కాథలిక్కు క్రైస్తవులు. మతగురువుల పలుకుబడిలో నుండి, రూసో 'ఎమిలియసు' అను గ్రంథములో క్రైస్తవమతములోని కొన్ని మూఢ విశ్వాసములను ఖండించి, క్రైస్తవ మతగురువులు మతము పేర చేయుచున్న అక్రమములను, తీవ్రముగా విమర్శించి, సర్వమతములకును సమాన గౌరవ స్వాతంత్యములు కావలెనని వ్రాసెను. ఈగ్రంధమును తగుల బెట్టవలెనని ప్యారిసులోని ప్రధాన క్రైస్తవాచార్యు డాజ్ఞాపించెను. రూసో నాస్తికుడని, యు క్రైస్తవమతము నుండి వెలి వేసితి మనియు ప్రకటించెను. స్విట్జర్లాండులోని క్రైస్త ఎమతగురువులు రూ సోపండితుని దూషించుచు వ్రాసిన కరపత్రములు మోటియర్సు గ్రామము చేరెను. మోటియర్సులోని రోమను కాథలిక్కు మతగురువు "నా' స్తికుడగు” రూసో పై ప్రజలలో నాగ్రహము కలిగించెను. రూసో నిజముగా నాస్తికుడు గాడు. త్రత్వమును సమ్మక ఒక్కడగు భగవంతుని సమ్మువాడు. అయినను క్రైస్త వగురువు, లీయనను నాస్తికుడనిరి. మోటియర్సుప్రజలు రూసోను చం పుటకు యత్నించిరి. రూసో తన భార్యతోగూడ అచటినుండి పారిపోయి, స్విట్జర్లండు దేశములోని జర్ని పట్టణపు పాలనలో చేరిన చాల కొద్దియిండ్లుగల యొక చిన్న ద్వీపములో నివసించుటకు వెళ్లెను. కాని కొద్దిరోజులలో బర్ని ప్రభుత్వము వారు అచటినుండి.

పదునైదుదినములలో, లేచిపోవలసినదని రూసోకు ఉత్తర్వు

147

పదియవ అధ్యాయము

చేసిరి. “నన్ను వెళ్ళిపొమ్మను ఉత్తరువును దయచేసి రద్దుపరు వుడు. నాయావజ్జీవమును మీ చెరసాలలో నస్నంచుడు. ఒక చో టనుండి మరియొక చోటకు, అచటినుండి మరియొక చోటకు పారి పోజాలను. నాస్వంత ఖర్చుమీద నాస్వంత భోజనము చేసి కొనుటకు అను జనిచ్చి నన్ను యావజ్జీవమును ఖైదులోనుంచిన అచట ఆత్మశాంతి గలిగియుండెదను” అని ఈమహాపురుషుడు' వ్రాసిన యుత్తరము బెర్ని ప్రభుత్వము యొక్క హృదయమును కరిగించలేక పోయెను. అందుమీద రూసో యాప్రదేశము' విడిచి భార్యతో కూడ నెచటకో పోను ద్దేశించి తోవలో ప్యారి సులో దిగెను. అచటి ప్రజలలో గలిగిన ఉత్సాహము వర్ణనా" తీతము. ఫ్రెంచి మంత్రులును ఈయన యందు విశేష గౌరవము గలిగియుండిరి. రహస్యముగా నీయవదర్శనము చేసిరి. దేశ మంతయు నీయనను పూజించుచున్నందున ప్రభుత్వమువారు కూడ చూచి చూడనట్లూరకొనిరి. ఇరువది దినములలోనే యీయన ఆంగ్లేయుపండితుల ఆహ్వాసము మీద నొక రాత్రి వేళ బయలు దేరి ఇంగ్లాండుకు వెళ్లెను. లండనులో దిగగానే ఆంగ్లే యప్రజలుసు ఆంగ్లేయ పండితులును ఈయనకు అసమాన మగు గౌరవముజూపిరి. ఇంగ్లాండులోని కొండలప్ర దేశ మున నొక గ్రామమున ఈయన స్థాపర మేర్పఱచుకొని శాంత ముగా కాలము గడవు చుండెను. ఇంతలో ఇంగ్లాండులోని కొందఱు పండితులకును రూసో కును కలహములు కలిగెను. అయిదు నెలలలో ఇంగ్లాంకును వదలి పెట్టి తిరిగి ఫ్రాన్సును చేరెను. ప్రజలకును ప్రజానాయకులకును ఈయనయందు

,
148

ఫ్రెంచి స్వాతంత్ర్య విజయము

గల గౌరవముచేత ఫ్రెంచి రాజు లీయన జోలికి రాలేదు. ఫ్రాన్సు లో అనేక చోటుల తిరిగి తుదకు ప్యారిసును చేరెను. ఇచట పనిమిది సంవత్సరములు నివసించెను. అనారోగ్యమువల నను 'పేదిరిక మువలనను విశేషముగ బాదపడి 1778 సంవత్స రము జులై నెల 2 వ తేదీన ప్యారిసుకు సమీపముననున్న ఎర్మి నూ వెల్లి యను గ్రాయమున మరణించెను. ఈయన శవమును పాతి పెట్టుటకు మతగురువులు రాలేదు. దాని నొక చిన్న సరసులోని ద్వీపమున మిత్రులు పాతి పెట్టిరి, తరువాత పదునారు సంవత్సరములకు, ఈయన సిద్ధాంతముల ననుంచి ఫ్రాన్సు లో విప్లవముకలిగి రాజులుపోయి ప్రజా సామ్య మేర్పడిన కాలమున, ప్రజా ప్రభుత్వము వారు పిరంగుల మోతలతోను వాద్యములతోను, గొప్పయుత్సవముతోను నీయన అస్తుల నీద్వీ పమునుండి తెచ్చిఫ్రాంసులోని "గొప్పవారి సమాదు లుంచబడిన ప్రదేశములో ప్రజల జయజయధ్వనుల మధ్య పాతి పెట్టిరి.


వాల్ల్టేరు. రూసో పండితులు మాత్రమేమేగాక మాంటే స్క్యూ మొదలగు పెక్కు గ్రంథ కర్తలు సుప్రసిద్ధ గ్రంథము లను వ్రాసిరి. ఆకాలమున డిడోరో మొదలగు గ్రంధకర్తలు ఫ్రెంచి: జ్ఞానసర్వస్వమును బయలు దేర దీసి అందులో సమస్త విషయములను గూర్చియు జనులకు జ్ఞానమును కలుగ జేసిరి. తత్వజ్ఞులని కొందరును, ఆర్థిక శాస్త్రజ్ఞులని కొందరు, గంధ కర్తలు అనేక గ్రంథములను వ్రాసిరి. మొత్తము మీద ఆకా లపు అందరు గ్రందకర్తలును ప్రజలనుభ వించుచున్న సమస్త

కష్టములకును స్వతంత్రతను పొందుటకన్న వేరుతరుణో పాయము

149

అధ్యాయము

లేదని వ్రాసిరి. సమానత్వము', సోదరత్వము, స్వతంత్రతను అనునవి సర్వదుఃఖనాశనకరమగు మంత్రములుగ ప్రజలచే జపించబడెను.


నవీనయుగ
ధర్మములు


యూరపుఖండములోని విషధ దేశములు వివిధ రాజుల క్రింద నుండి వేరు వేరు పరిపాలనలను గలిగి రాజకీ యైక్యత లేక పోయినను యూరపుఖండమున కంతకును రెండు ప్రతిష్టాపనలు మతవిషయిక సాంఘిక ఐక్యతను కలుగ చేసినవి. ఒకటి రోములోనున్న క్రైస్తవ ప్రధాన మతాచార్యుడగు పోపు యొక్క పీఠము. రెండవరి మొఖాసాప్రభ పరంపర. మధ్యమయుగ మున ఈ రెండు ప్రతిస్థాపనలకును యూరపుఖండమంతయు సం పూర్ణముగ లోబడినది. యూరపునందుతటను క్రైస్తవమత ము అవలంబించబడినది. మహమ్మదీయ మతముతో పోరాడి యూరపులో వ్యాపించకుండ చేసిరి. క్రైస్తవుల కందరకును పోపు ప్రథానగురువయ్యెను. యూరపు ఖండాములోని , సందరు ప్రజలును పోపు యొక్క యధికారములకు ఆజ్ఞలకు లోబడియుండిరి. ప్రతి దేశములోను పోవు యొక్క ప్రతినిధులు ప్రబలిరి. పోపు యొక్క నిరంకుశ రాజ్యము యూరపులో స్థాపించబడెను. పోపును ధిక్కరించువాడు ఘోరశిక్షలకు పాలయ్యేను. ఇటు లనే రాజులును ప్రభువులును యూరపులోని అన్ని దేశముల

లోను ప్రజల పైన రాజ్యము చేసిరి. అన్ని దేశములలోని రాజు 150

ఫ్రెంచస్వాతంత్య విజయము

లును ప్రభువులును కలిసి 'యొ కే కులము. ఒకరి కొకరికి బంధు త్వము లుండెను. అన్ని దేశములలోని మతగురువులును కలిసి మరి యొక కులము. దేశాభిమానము కంటే కులాభిమానము ప్రా ముఖ్యముగ నుండెను. కాలక్రమమున పోపును, ఆయన అనుచరు లును ప్రజలకు నైతికాభివృద్ధిని కలుగ జేయు ఆధ్యాత్మిక గురువు లుగ నుండుట మాని ప్రజలను అజ్ఞానములోను మూఢవిశ్వాస ములలోను దాస్యములోను ముంచి ప్రజలనుండి సొమ్మును కాజే యుచుండిన దురాశా ప్రేరితు లైరి. దైవాజ్ఞలంటే పోపులయా జ్ఞలు ప్రథానములయ్యెను, అటులనే రాజులును ప్రభువులును ప్రజలను సంరక్షించి చక్కగా పాలించి వారికి సౌఖ్యమును కలుగ జేయుటకు మారుగా, ప్రజల స్వాతంత్ర్య ములను ఆస్తులను హరించి వారిని నొత్తడి చేయుచుండిరి. 1453 వ సంవత్సరమునుం డియు యూరపుఖండములో ప్రాచీన గ్రీకు భాషలోని స్వతంత్ర భావములు వ్యాపించు చుండుటయు అచ్చు కని పెట్టబడి గ్రంథ ములు విరివిగా వ్యాపించుటయు చూచియున్నాము. మానవాత్మ ఎప్పుడుసు బంధములను తెంచుకొని స్వతంత్రమును పొంద య త్నించును. యూరపులో మానసిక వికాసము కలుగగనే హేతు వాదము, విమర్శన, సత్యాన్వేషణము, విచక్షణాశక్తి ప్రబ లెను. మతసంస్కరణము ప్రారంభ మయ్యెను. పోవు యొక్క యు మతగురువుల యొక్కయు నిరంకుశత్వము పై తిరుగుబాటు కలిగెను. ప్రతివారును స్వయముగా క్రైస్తవ వేదముసు చదు వుకొని మతగురువుల మధ్యవర్తిత్వము లేక ఈశ్వరుని ఆరాధిం

చుట కై బైబిలును దేశ భాషలలోనికి తర్జుమా చేసిరి.

151

పదియవ అధ్యాయము


విగ్రహారాధన ఖండించబడెను. పోపుకు లోబడి యుండనక్కర లేదు. బైబిలులోనున్న సంగతులే ప్రమాణములుగాని, పోపు యొక్క ఆజ్ఞలు ప్రమాణములుగావు, ఆత్మస్వాతంత్ర్యము ప్రకటింపబడెను. ఇట్లు ఆత్మ స్వాతంత్యమును స్థాపించిన " వారిలో ముఖ్యుడు మార్టిను లూధకుమహామహుడు. ఆయన స్థాపించిన ప్రొటెస్టెంటు మతమును జర్మనీ దేశీయులు ప్రధ మమున అవలంబించిరి. జర్మనీ మత స్వాతంత్యోద్యమమునకు ప్రథమస్థానము వహించినది. పోఫులును, వారి యనుచరులును, వారి స్నేహితులగు రాజులును, ప్రభువులుసు ప్రొటెస్తేంటులను ఘోరముగ శిక్షించి మరణములపాలు చేసినకొలదియు వీరు ధర్మసంస్థాపనకొరకు చేయుచున్న త్యాగములును, పొందుచున్న కష్టములును ప్రజల హృదయముల నాకర్షించి ప్రొటెస్టేంటు మత ము త్వరితముగ వ్యాపించెను. నిరంకుశ త్వమునకును స్వతంత్ర తకును కలిగిన పోరాటములో స్వతంత్రతయే తనయొక్క ఆత్మశక్తి వలనను స్వార్త త్యాగమువలనను జయముందినది, నిరం కుశత్వము యొక్క చెరసాలలు, మరణశిక్షలు స్వతంత్రత సణపజాలక పోగ, స్వతంత్రతకు జయింప నలవి గాని శక్తిని కలుగ జేసినవి. ఈ మత స్వతంత్రంలోను, యూరపులో రాజకీయ స్వతంత్రత బయలు దేరినది. రాజులయొక్కయు ప్రభువుల యొక్కయు నిరంకుశత్వమును నిర్మూలము చేసి రాజు కీయ స్వతంత్రమును సంపాదించుటకు ఫ్రాంన్సు దేశము ముందుగ దారితీసినది. రాజకీయస్వతంత్ర సంవాదనకు ముఖ్యులగు

వారు వాల్టేరు, రూసోపండితులు. వికసించిన ఆత్మ ఎట్టి దాస్య
142

-

ఫ్రెంచి స్వాతంత్య విజయము


ముసకుసు సహించనేరదు. ఒక విషయమున స్వతంత్రము, మరి యొక విషయమున దాస్య మనునది అస్వాభావికము. కావున. మత స్వతంత్ర పోరాటమున కలవాటు పడిన యూరపుఖండము రాజకీయ స్వతంత్ర పోరాటమును నారంభించినది. నిరంకుశ త్వమును కూలదోసి స్వతంత్రమును పొందుట సవీన యుగము యొక్క ప్రథమ లక్షణము. మరియు మతాభిమానమును కులా భి మానమును అణచి వైచి దేశాభిమానమును ప్రజ్వరిల్ల జేయుట రెండవ ధర్మము. యూరపు ఖండమున నవీన యుగము 1453 వ సంవత్సరములో ప్రారంభమయినదని కొందరు చరిత్రకారు లును, ఫెంచివిప్లవముతో ప్రారంభమయినదని మణి కొందరు చరిత్ర కారులును, వ్రాసియున్నారు.