ఫ్రెంచి స్వాతంత్ర్యవిజయము/తొమ్మిదవ అధ్యాయము

వికీసోర్స్ నుండి


ప్రెంచిస్వాతంత్ర్యవిజయము

తొమ్మిదవ అధ్యాయము

ఫ్రాన్సు హైందవసామ్రాజ్యమును కోల్పోవుట

}}

1

ఆర్లియన్సు ప్రభువు
రాజ సంరక్షకుడగుట

పదు నేనవ లూయి చిన్నవాడై నందున రాజబంధువు డగు ఆర్లియన్సు ప్రభువు రాజుయొ క్క సంరక్షకుడుగ రాజ్య మును చేసెను. ఆర్లీయస్సుప్రభువు విషయాస సక్తుఫు, భోగపరాయణుడు. పదునేనవ లూయిరాజు కూడ ఇంద్రియ వ్యసనములలోనే పెరిగెను.. పదు నాల్గవ లూయీ యొక్క సమర్థతగాని విద్యావ్యాసంగము గాని యుద్ధ కౌశలము గాని వీరి కెవరికీని లేదు.


దుర్ వ్యయములోను. చెడుప్రవర్తనములోను నిరంకుశ

త్వములోను వీరాయనను మించిరి. ఆర్లియస్సు ప్రభువు, దుర్గుణ

112


తొమ్మిదవ అధ్యాయము

ముల కెల్ల ఖనియని చెప్పదగిన ఆబిడ్యూ బాయిచేతిలో పూర్తిగనుండెను. ఆ బిడ్యూబాయి విదేశ రాజ్యాంగమంత్రిగ నుండెను. ఇంగ్లాండుతో సఖ్యముగ నుండి ఇంగ్లాండుకు లాభ కరముగ ,బనిచేయుటకు ప్రతి సంవత్సరమును *[1]ఆంగ్లేయ ప్రభు త్వమువారు అబిడ్యూబాయికి ఏబది వేలు మొదలు పదిలక్షల వరకు క్రౌనులను లంచమిచ్చు చుండిరి. తనకు సముహముల మీద పోటీగ నున్న స్పెయినుతో - ఇంగ్లాండు యుద్ధము చేయు టలో ఫ్రాన్సు దేశము స్పెయిస్ తోడ చేరక ఇంగ్లాండు పక్షమున చేరుటకీ లంచము నిశ్చిను. ఫాస్సు ప్రభుత్వము ఇంగ్లాండు పక్షమున -చేరెను. స్పెయిను ఓడిపోయెను. సముద్రముల మీద ఇంగ్లాండునకు మంచి బమేర్పడెను. ఈసముద్రముల మీద బలమువలననే ఇంగ్లాండు ముందుముందు ఫ్రాన్సును అణగగొట్టనున్నది. అర్లియస్సు ప్రభువును అబిడ్యూయ బాయి యు, రోమనుకాదలిక్కు మతగురువులను సంతోషపరచుట ప్రొటెస్టెంటులను వి శేషముగ నిర్బంధములకు లోబడ జేసిరి.

బోస్బోన్
ప్రభువు

పదుమూడవ యేటనే ఫొస్సు రాజులకు మైనార్జి వెళ్లును గావున పదమూడవయేట పదు నేనప లూయి రాజ్యభారమును వహించెను. అర్లియన్సు ప్రభువును ఆబిడ్యూ బాయియు మరణించిరి.మూడు సంవత్సరములకా లము బోర్బోన్ ప్రభువు ప్రధానమంత్రిగా రాజ్యమును పాలిచె సు. ఈయనయు అవినీతిలోను దుర్వ్యియములోను ప్రొసెస్టెంటు లను నొ త్తిడి చేయుటలోను ఆర్లియన్సు ప్రభువును మించెను.

..................................................................................
115

ప్రెంచి స్వాతంత్ర్య విజయము

ఈయసయుంపుడుకత్తెయగు ప్రీయువతికి, ఆంగ్లేయ ప్రభుత్వ మువారు ఆబిడ్యూబాయి కిచ్చుచుండిన *[2]లంచము నే ఇచ్చు చుండిరి. ఫ్రాన్సు ప్రభుత్వము ఇంగ్లాడుతో సఖ్యముగా నుం డెను.

పోలండు.

1726 మొదలు 1743 వరకును ఫ్లూరి యను ముసలి మతగురువు రాజుయొక్క ప్రధానమంత్రి యయ్యెను. ఇతడు విశేషసమర్థుడు గాకపోయినను యోగ్యుడు, రాజు సమస్తమును మంత్రికి వదలి స్త్రీలోలుడై మెలంగుచుండెను. రాజు యొక్క మామగారగు స్టానిస్లాసు పోలండు రాజ్యమునకు హక్కు దారుడయ్యెను. నాక్సనీ ప్రభువు పోలండు రాజ్యము తనకు రావ లెన నెను. ఆస్ట్రియా రుష్యాలు సౌక్సనీ పక్షమునను , ఫ్రాన్సు, స్పెయిన్, సావాయి ప్రభుత్వములు స్ట్రానిస్లాసు పక్షమునను నేరి యుద్ధము సలిపిరి. ఫ్రెంచిపక్షము విజయము గాంచెను. కొంత దేశము స్టానిస్లాసున కిప్పించి సంధి చేసికొనిరి. ఈ యుద్ధము వలన ఫ్రాన్సు ఇంకను యూరోవులో కెల్ల జలవంతమయినదని తేలేను..

ఆస్ట్రియా
యుద్ధము

ఆస్ట్రియాచక్రవర్తి యగు అరవచార్లెసు 1740 వ సం వత్సరమున మరణించెను. తన రాజ్యమంతయు తన కుమార్తె యగు మేరియా థెరీజాకు సంక్రమించవలెనని శాసనముచేసెను. కాని ఆయన మరణించగానే ఆస్ట్రియా సామ్రాజ్యమునకు అయిదుగురు హక్కుదాగులు బయలు దేరిరి. యూరపు రాజుల మధ్య గొప్ప యుద్ధము జరిగెను.

...........................................................................

116

తొమ్మిదవ అధ్యాయము


చనిపోయిన చక్రవర్తి యొక్క కుమార్తె, ఇంగ్లాండు రాజు ఒక పక్షమునను; ప్రర్ష్యారాజగు ఫెడరిక్ డి గ్రేటును, ఫ్రాన్సు ప్రభుత్వమును మరియొక పక్షమునేను చేరి యుద్ధములు సలిపిరి. యుద్ధము కొంతవరకు సాగగ నే ప్లూరీ మంత్రి చనిపోయెను. పదు నేసవలూయీ రాజే స్వయముగ పాజ్య పాలనము చేసెను. ఈయన తన ఉంపుడుకత్తెల చేతిలో కీలుబొమ్మవలె నాడించబడు చుండెను. వారి సలహా ననుసరించి మంత్రులను సేనాధిపతులను నియమించుచు, తిరిగి చపలచిత్తముతో తీసి వేయుచు నుండెను. ఈయన పాలసమున సమర్థులను మంత్రులకు గాని సేనానులకు గాని ప్రోత్సాహము కలుగ లేదు. పదునెనిమిది సంవత్సరము ఇరువదియైదు మంది. మంత్రులు మారిరి. ఈ యుద్ధము 1748 వరకును జరిగి ఏలా షేపిలువద్ద సంధిజరిగెను. సైలీషియా రాజ్యము ప్రష్యాకు దక్కెను. మేరియా థెరీజా ఆస్ట్రియాకు రాణియయ్యెను. ఫ్రాన్సు దేశము తన రాజుయొక్క స్త్రీలోల త్వమున యూరపుఖఁడములో నగ్రస్థానమును, గోల్పోయిన దని ఈ యుద్ధములో బయటపడినది. ఫ్రాస్సు దేశపు సైన్య. ములు వెనుకటి పటుత్వమును చూప లేదు.

2

రాజు యొక్క
అవినీతి,

ఈకాలము ఫొస్సునకు ప్రపంచక పర్తకములోను వల సరాజ్యముల లోను మిగుల ముఖ్యమగు కాలము. పదునాలుగవ లూయి కాలమున ఫ్రెంచి వర్తక సంఘములు పోత్స హించబడి హిందూదేశములోను అమెరికాలోను

స్థాపించబడుట చూచి యు న్నాము. ఉత్తర అమెరికా లోని
120

ఫ్రెంచిస్వాతంత్ర విజయము

కనడా దేశములో ఫ్రెంచివలస రాజ్యము స్థాపించబడి పెరుగుచు న్నది. అచట ఫ్రెంచి వారికి విశేషలాభము కలిగినది. హిందూ “దేశములో ఫ్రెంచి వర్తక స్థానములు బాగుగ వృద్ధి చెందుచు న్నివి. పుదుచ్చేరి గవర్నరగు డూప్లే అనునతడు, అప్పుడు హిందూ దేశములోని స్వదేశ సంస్థానాధీశులలో ప్రబలుచున్న అంతఃక లహములలో ప్రవేశించియు, హిందూ దేశీయులను ఫ్రెంచి సేనాధిపతులక్రింద సిపాయిలుగ శిక్షణమునిచ్చి ఉప యోగించియు, హిందూ దేశములో గొప్ప ఫ్రెంచిసామ్రాజ్యమును స్థాపించవలెననీ యత్నము చేయసాగెను. అమెరికాలోను హిందూ దేశములోను కూడ ఇంగ్లీషువ ర్తక సంఘము లే ఫ్రెంచి వారికి పోటీగనుండెను, హిందూదేశములో ఆంగ్లేయ వర్తకులు గూడ స్వదేశ రాజుల అంత్ఃకలహములలో ప్రవేశించియు, హిందూ దేశీయులను ఆంగ్లేయ సేనాధిపతుల క్రింద సైనికులుగ తరిబీయతు చేసియు ఆంగ్లేయరాజ్యమును ఏర్పరచ వలెనని తలచిరి. ఫ్రెంచివారి స్థితియే ఆధిక్యతను పొంది యుండెసు. ఫ్రెంచి రాజు మాత్రము కొంతకాలము పొంపడారు యువతి యొక్క యు, మిగతకాలము డుబెర్రి యువతి యొక్కయు చేతులలో నుండెను. ఈ యుంపుడు కత్తెల నిమిత్తము సాలుకు నలుబది లక్షలు పరాసు ప్రభుత్వబొక్క సములోనుండి ఖర్చగుచుండెను.

121

తొమ్మిదవ అధ్యాయము

ఇట్టి స్థితిలో 1756 వ సంవత్సరమున ఏడు సంవత్సరము లయుద్ధము ప్రారంభ మయ్యెను. ఆస్ట్రియా రాణి సైలీషియాను హిందూ దేశమును ప్రష్యా రాజునకు వదలి వేయుట కిష్టము లేకయు పోగొట్టుకొనుట, యుద్ధమునకు వెడలెను. ప్రష్యా రాజుపక్షమున ఇంగ్లాండు చే రెసు. ఆస్ట్రియారాణి పక్షమున ఫ్రాన్సుచేరెను. 1763 వరకు ఏడు సంవత్సరములు యుద్ధము జరిగెను. ఇంగ్లాం డు యొక్కయు, ఫ్రాన్సు యొక్కయు చరిత్రలలో నింత ప్రాము ఖ్యమైన యుద్ధము మరి యొకటి లేదు. ఆస్ట్రియాయు, ప్రష్యా యు, యూరోపులో నాధిక్యతకు పోరాడుచు ప్రపంచ రాజ్యము కొరకు ఫ్రాన్సు, ఇంగ్లాండు దేశములు పోరాడుచుండె సు. ఫ్రాన్సునకును ఇంగ్లాండునకును ముఖ్య యుద్ధములు ఉత్తర అమెరికాలోను హిందూ దేశములోను జరిగినవి. ఇంగ్లాండు దేశపు ప్రధానమంత్రి యుగు విలియంపిట్ బహుసమర్థతతో కార్యభారము వహించి సరిగా సైన్యములను' నౌకాదళము లను పంపి యుద్ధమును జాగ్రత్తగా నడిపెను. ఫ్రాస్సురాజుగు " పదు నేనవలూయి చపలచిత్తలగు ,ఉంపుడుకత్తెలచే నడుపబడి సరిగా హిందూ దేశమునకును అమెరికాకును దవ్యమును సేనల ను పంపక యుద్ధమును పాడుచేసెను. యూరపులో ప్రష్యా జయమంది ఆస్ట్రియాకస్న - ముఖ్యమైనది. హిందూ దేశము లో సమర్థుడగు డూప్లేను 'ప్రెంచి ప్రభుత్వ మువారు సహా యము చేయకపోగా ఫ్రాన్సుకు పిలిపింఛుకొని అనమాన

122

ఫ్రెంచి స్వాతంత్ర్య విజయము


పరచిరి. రణకౌశలుడగు ఫ్రెంచి సేనాని లాలీకి తగిన సహాయ'మురాక ఆంగ్లేయ సేనాని యగు క్లైవుకు లొంగవలసివచ్చెను. అమెరికా లోను ఇటుల నే ఫ్రాంస్సునుండి సహాయమురాక సమ ర్థులగు ఫ్రెంచి సేనానులు ఆంగ్లేయుల చేత నోడించబడిరి. 1763 వ సంవత్సరమున పారిసువద్ద సంధిజరిను, అమెరికా ఖండములోని కనదేశమును ఇంక కొన్ని ముఖ్యమగు ద్వీప ములను, హిందూ దేశ సామ్రాజ్యమును " ఫ్రెంచివారు. ఇంగ్లీషు వారికి వదలి వేసిరి. ఫ్రెంచి వారు హిందూ దేశములోని రాజుల కలహములలో జోక్యముకలుగ జేసికొనకుండునట్లును హిందూ దేశములో నెచటను కోటలు కట్టకుండునట్లును షరతులతో వర్తక ము కొరకై మాత్రము పుదుచ్చేరి, చంద్రనగరం, మాహి, కారెకాలు, ఏనాం పట్టణములు ప్రించి వారికి వశము చేయబడినవి. ఇంతటితో హిందూ దేశ సామ్రాజ్యమును, ప్రపంచ రాజ్యమును పాన్సు కోల్పోయి ఆంగ్లేయులకు సంక్ర మించినది.

చెడు పరి
పాలము.

పదు నేనవలూయికీ ఆదాయముకన్న ఖర్చు లెక్కువ యయ్యెను, ప్రభుత్వపు ఋణములు చాల వృద్ధి చెందెను. ఋణములను తీర్చుమా ర్గము కనుపించ లేదు. నిరంకుశముగ పన్నులను రెట్టింపు చేసెను. ఉద్యో గములను లంచమిచ్చువారి కిచ్చెను. ప్రజలు పన్నుల బాధలచే

ఆంగిరి. ఆసంతృప్తి మిగుల వ్యాపించెను, పారిసులోని

123

తొమ్మిదవ అధ్యాయము

పార్లమెంటు అనబడెడి న్యాయాధిపతుల సంఘము వారు రాజు నెదిరించ ప్రారంభించిరి. ఒక రోజున ఆంగ్లేయులచే శిరచ్ఛే. దము గావిం బడిన మొదటి చార్లెసు బొమ్మను చూపి, “అటు లనే మిమ్మను గూడి నీ పారిసుపార్ల మెంటువారు చేయదలచు కొన్నారు. జగత్త,” అని డుబెర్రి యువతి లుయీ రాజుకు చెప్పెను. లూయీ రాజు ఆందుమీద భయపడి న్యాయాధిపతు లను అరెస్టు చేయించి దేశ భ్రష్టులనుగావించెను. న్యాయాధి పతుల సంఘమును రద్దు పరచెను.


పదునేనవలూయీ రాజు 1774 వ సంవత్సరమున మరణించెను ఆయన మనుమడగు ఇరువది సంవత్సరముల ఈడు గల పదునారవలూయీ, సింహాసన మధిష్ఠించెను.

  1. * డ్యూరియోక్క ఫ్రాశ్సు చరిత్ర మాసు జూడుము.
  2. * డ్యూరి యొక్క ఫ్రాన్సు చరిత్రను చూడుడు,