Jump to content

ప్రజ్ఞా ప్రభాకరము/దివ్యబోధ

వికీసోర్స్ నుండి

౨౫

దివ్యబోధ

ఆ నాఁటిరాత్రి మెయిలులో నేను తిరిగి మద్రాసు వచ్చి వేయవలసి యున్నది. కాన నా విషయమును గూర్చిశ్రీ వారితో సంభాషించుటకు నదను కోరితిని. నా యభ్యర్ధనమును మహా దేవయ్యగారు శ్రీ వారికి నివేదించిరి. భోజనా నంతరము సంభాషింప శ్రీవా రనుమతించిరి. అప్పుడు వారు యోగ విషయములను గూర్చి వారి యర్ధాంగి ద్వారా యేవేవో యపూర్వాంశ ములను సేకరించుచుండిరి. భోజనా నంతరమున నేఁ జేర నరిగి సాష్టాంగనమస్కారము చేసి యిట్లు విన్నవించుకొంటిని.' మూఁడెండ్లనుండి యమ బాధ పడుచున్నాను, నిద్రలేదు, శాంతి లేదు, ఆకలి, జిర్ణించుకొను శక్తి సరిగా లేవు. ఇక్కడికి రాక తలఁపునకు ననఁ గా నా యోఱుకకు దెలియకుండ నే సరిగా భోజనము చేయగల్గితిని. మి యోగమాహాత్మ్యమును శ్రీ నరసింహము గారి ద్వారా విన్నంతనే నాలో నేదో దివ్య సౌఖ్య సౌధమునకు బాట గోచరించు చున్నట్ల యినది. ప్రశాంతము గా రాఁ గలిగితిని. రైలులో కొంత నిద్ర పట్టినది. ఇక్కడికి వచ్చికడచిన రాత్రి సుఖముగానిద్రించితిని. నూనె తిరుగ బోత, ఆవాలు, సాంబారు, రసము, పల్చనిమజ్జిగ యివి నా కింతకు ముందు కడుపులో మంటలు గొల్పెడివి. ఇప్పు డవి వికటింప లేదు. మీరు నిర్భయముగా అందఱతో పాటు భుజింపవచ్చు ననఁ గా నట్లు చేసితిని. పూర్వము తీవ్రమయున మందులు పుచ్చుకొంటిని. తదాది కడుపు ఉడికి పోవుచున్న ట్టుండును. నేఁ డది లేదు.' శరీరమాద్యం ఖలు ధర్మ సాధనం' అని గాన నే నిక్కడ మి సేవకుఁడనుగానే యుండఁ గోరుచు న్నాను. ఇక్కడ నుండి యే జీవిక నేదేని సమకూర్చు కొందును. అనుగ్రహింపు' డంటిని.

   వారు నీ కిప్పుడు ' జీత మెంత?' అని యడిగిరి. ఏఁ బది రూపాయ లంటిని.' దీనితో నీవు నీ కుటుంబమును పోషించు కోవచ్చును. ఉన్న జీవికను మానుకొని యిక్కడ నుండ నేల?
   బండి నడచుచుండఁ గానే రిపేరు సాగవలెను. బండి ఊడఁ దీసి చేయునో బండి వాని జీవిక చెడును. అట్టిది నా యోగ మార్గము. సాగుచున్న ప్రవృతికి భంగము కలుగరాదు. ఇది నివృత్తి మార్గము కాదు. రాజయోగ మార్గము. గార్హస్ధ్యము ఉండ వలెను. సన్న్యాసి కారాదు. సౌఖ్య ముండవలెను. ఆహారాదులు సరిగా ససిగా కయికొను చుండవలెను.
   ఇట్టిచో నీవు యుద్యోగమున నండు టావశ్యకము. నీ యుద్యోగము నీ జీవిక కే కాక లోకమునకుఁ గూడ నుపకారకము. ఆరోగ్యవంతుఁ డవై నీ యుద్యోగమున నుండి తిన్నగా సాగించుకొనుచుండుము. నీ విక్కడ నుండఁ గోరుట నా సన్నిధి లాభము కొఱకే గదా! నేను సదా నీలో నుందును. నీకు వలసిన సహాయము నీలో నుండి జరపుచునే యుందును. ఇక్కడ నీ కే తీరున శరీరము సంస్కారము జరగుట గుర్తుకు వచ్చెనో, ఆ తిరుననే యెక్కడ నున్నను అనుభూతి గుర్తుకు రాగఁ లదు. ఉదయము జరపిన యోగ సాధనము శరీరము సాయంకాలము దాఁ క పని చేయుచునే యుండును. ఎప్పుడెప్పు డెం తెంత జరగవలెనో అంతంత జరుగును.
   నీలోని సంస్కారము జరపునది ప్రజ్ఞా కలిత మయిన చైతన్యము గాని జడశక్తి కాదు. అది యెలక్టిసిటీ వలె పని చేయునది గాదు. ఎలక్టిసిటీ హద్దు దాటి అక్రమముగా నుపయోగించుకోఁ గోరి నను అది యట్లు పని చేయదు. ఎంత చేయ వలెనో అంతే చేయును. కావలె నన్నను నీ వావశ్యకత కెక్కువగా కనులు మూసికొని యుండఁ జాలవు. లోపల నావశ్యకమయిన పని జరగుచుండఁ గా కనులు తెఱవను జాలవు. ఏ దేని యాకస్మికముగాకార్యాంతరముకలుగుటో, ఎవరేని వచ్చి పలుకరించుటో జరిగినను అప్పుడు విక్షేపము జరగు నని వెఱవ నక్కఱ లేదు.' ఇట్లు తొందర కలిగినది. దాని ననుభవింప వలసి యున్నది.' అని ప్రార్ధనాపూర్వకముగా నంత రాత్మకు విన్న వించుకొని యా కార్యము ముగించు కొన వచ్చును. అది ముగిసినంత నే జరగ వలసిన యోగ సాధన జరగఁ గలదు. ప్రయాణములో, రైలులో,బండిలో, నడకలో ఇంకే మేని వ్యవహారములలో వర్తిల్ల వలసి వచ్చినప్పుడు సరియ యిన వేళ తప్పిపోకుండ ఒక క్షణ మాత్రము మనసున స్మరించినఁ జాలును. కార్యంతరములు తీఱి విశ్రాంతి దొరకి నప్పుడు జరగవలసిన సాధన మెల్ల జరగఁ గలదు.

వివేకమును సత్యమును ధర్మమును గుర్తించుకొనుచు నంత రాత్మ నారాధించుచు లోలోఁ జోచ్చుకొలఁదిని నీకు వలసిన యుద్బోధములు లభింపఁ గలవు. అట్టి యుద్బోధము లను నీవు నీలో నెక్కడ నుండి యెట్లు పడయు చుంటివో క్రమక్రమముగా ప్రసరించుచున్నది. అది లేక నీ వేమి గాని పడయఁ జాలవు. ముందు నీ కారోగ్యమే. తర్వాత నే యోగ సాధన ఫలము దొరకఁ గలదు. గాఢముగా విశ్వసించితి వేని, నీకు యోగ ఫలము లభింపఁగల దని నే ననుట లేదు. నీ కా విశ్వాసమును గొల్ప వలసిన వాఁ డను. నేనే. నీవు పరమార్దకుతూహలిగా నుండినఁ జాలును. యోగ సాధనము నాకలి గొన్న రిత్తక డుపుతో నుండి చేయరాదు. ఏదే నాహారము గొన్న పిదపనే చేయ వలెను. మద్రాసులో నీ యోగ మాగ్గమున నడచుచున్న మిత్రులు పలువు రున్నారు. తఱచుగా వారిని గలసికొను చుండుము. వీలు కలిగినప్పు డిక్కడికి వచ్చు చుండుము. ప్రధానముగా డిసెంబరు తుది వారమునను, మే తుది వారమునను, ఇక్కడ గోష్ఠి జరగును. అప్పుడు తప్పక రమ్ము' అనిరి. నా కనుల వెంట ధారలుగా నీరు కారెను. ఈ శ్లోకము రచించితిని.

      ' దుర్వ్యాధిఖి న్నే శరణం ప్రపన్నే 
             మయి ప్రసాదా దయి మాస్మ భైషీః 
             త్రాతా హ మస్మీతి దదా వభీతిం
             య స్తం గురుం మ స్తకతో నమామి'
   ఇట్టి సంభాషణతో నై దాఱు నిమిషములు గడచెను.
              ఆదినములలోవారు ముఖ్యమయిన తత్వార్ధములను సహస్రారము, పిట్యూటరీ, అక్కడి దివ్య శక్తులు, వాని ప్రసారము మొదలగు వానిని గూర్చి  శిష్యులు బోధించుట, దివ్యదృష్టితో వానిని ముఖ్య శిష్యులు పరికించుట ట్లను గ్రహించుట, ఇంక నందలి విషయవి శేషములను మాతృ శ్రీ ద్వారా తా మపూర్వముగా సేకరించుట జరగుచుండెను. కాన నా కంతకంటె నధికముగా, ప్రత్యేకముగా వారితో సంభాషింప ననువుపడ దయ్యెను.
                                            ---