ప్రజ్ఞా ప్రభాకరము/అనుభూతి

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

౨౪

అనుభూతి

తోడ్తో నాలో నేదో గొప్పప్రజ్ఞ ప్రవేశించి యూగించి వైచుచున్నట్లు గోచరింపఁ దొడగెను ఉత్సాహవినోదము లతో దానినే పరిశీలింపఁ దొడగితిని.' ప్రజ్ఞ' యనియో ' శక్తి' యనియో ఇంకేమనియో నిర్దేశింపఁదగిన యపూర్వానుభూతి ప్రవేశము నాలో విజ్రుంభింపఁ దొడఁగెను. అది యెక్కడ నారంభించినది, ఏమి జరపుచున్నది యని వెదకఁ దొడగితిని. అది శరీరచర్మము లోతట్టు దాఁక వ్యాపించు చున్నట్టు తొలుత నెక్కడ నుపక్రమించినదో గుర్తుపట్ట సాధ్యము కానట్టుండెను. శరీరములో నేదో గొప్ప క్రొత్త ఇంజెన్ పనిచేయుచున్నట్లయ్యెను. నా మన స్సానందో త్సాహములతో నలలు వాఱుచుండెను.

కొంతసేపటికి నెడమ చేయి నావశము తప్పి నా సమ్మతి లేకయే పైకి లేచుచుండు ట, కుడిచేయి కదలుచు బహుమూలమున చాల బాధగొల్పుచుండుట తెలియనయ్యెను. అంతకంత కు బాహుమూలపు బాధ యధికము కాఁ జొచ్చెను. సంకటపడ సాగితిని. అప్పటి కించుమించుగా పదునైదు నిమిషముల కాలము గడచియుండును. స్వాముల వారు నన్ను సంకటపడుచున్నా వేమని ప్రశ్నించిరి. కనులు తెఱవ వీలుపడక పోవుటచే మూసికొనియే బాహుమూలముణ చాల బాధగా నుండుట తెల్పితిని. మఱికొన్ని నిమిషములకు కనులు తెఱపి యయ్యెను. శరీరముణ సచలనముతగ్గెను. అంతట మరల నమస్కరించి లేవవలసినదిగా దగ్గఱనే ఉన్న స్వాములవారు తెల్పిరి. లేచితిని. నా చేతికి (డిస్లో కేషన్) బండి నుండి పడుటవల్ల బాహు మూలాస్దిస్దానము తప్పి చాల సంకటపడుట తెల్పితిని.

వారది యా బాహు స్ధితి సరియయిన స్దానమునఁ జేర్చుటకై జరుగుచున్న ప్రయత్నమనియు, బాహుమూల మున కాయ స్వాస్ధ్యము లేకున్నచో కుడిచేయి కూడ పైకి లేచి నమస్కారము చేసెడి దనియు, ధ్యానావసానమున వాని యంతట నవిగా రెండు చేతులు లేచి నమస్కరించుట యీ యోగ విధానమున నపూర్వాద్భుతానుభూతి యనియు, నట్లు కూడుట యోగ శక్తి చేకూడుట కొక చిహ్న మనియు తెల్పిరి. జరగిన విషయమును శ్రీ గురుదేవులకు ని వేదింప వలసిన దనిరి. నేను శ్రీ వారి సన్నిధి కరిగి జరగిన దంతయుఁ దెల్పికొంటిని. వారు చిఱునవ్వు మోమున వెలార్చి తనివితో నుండు మని యా దేశించిరి.

అట్లు ధ్యానము జరిగిన తర్వాత నొక్క గంటసేపటికే నా దక్షిణ హస్తమూలము చాల వాచి బాధ గొల్పెను. టక్కు టక్కు టక్కు మనుచు ఱెక్క గూటిలో నేదో కదలిక శబ్దము వినవచ్చు చుండెను. వాపు, బాధ ఎంత యెక్కువగా నున్నను నా కది యాహ్లాదము నేకొల్పసాగెను. మూఁడు నాల్గేండ్లనుండి యా చేతితో ససిగా పనులు చేయఁ జాలక బాధపడుచుంటిని. ఆ నాఁడు చేతి యెముకను క్లోరోఫార మిచ్చి సరిదిద్దిన డాక్టరు తర్వాత కొన్నాళ్ళ దాఁక నా చేతిని మెలి వెట్టి నలిపి చెఱపి ధనాశతో నన్నుఁ జాల పీడించి నాఁడు గాన యది చక్కబడకే యుండెను. ఆ జబ్బు గూటి కండలు గజిబిజి యయిపోయెను. అవి యెల్ల నిప్పుడు చక్క బడు చున్నవి గాఁబోలు నన్న సంతోషము నా కా చావు బాధను చేతి వాపును జూచి యక్కడి వా 'రది యేదో రెక్టిఫి కేషన్‌ జరగు చున్నది. వెఱవకు' మని తోడు పలుక సాగిరి. ఎన్నేండ్లనుండి యో నిద్రలేక కొట్టు కాడుచుండు వాఁ డను. నే నా నాఁటి రాత్రి కొంత హాయిగా నిద్ర పోయితిని.

మర్నా డుదయమున లేచి కాలకృత్యములు దీర్చు కొని యోగానుభూతికి సిద్దముగా నుంటిని. పూర్వదినపు సాయంకాలమున నా యూరిలోనివారనేకులు యోగసాధన మునకు వచ్చిరి. వా రెల్ల నా యుదయమునను వచ్చి యుండిరి. పూర్వదినము సాయంకాలము జరిగినట్లు నాకు నాఁ డుదయమున జరగెను. అప్పు డక్కడ నున్నవారిలో రాధాకృష్ణపిళ్ళ యని, మహాదేవయ్యారు అని యిద్దఱు ప్రధాన శిష్యు లుండిరి. వారు నా విషయమును శ్రీ వారికి విన్న వించిరి. అప్పుడు నా విషయము ' టెస్టు' తీయవలసి నదిగా వారు వారి కాజ్ఞాపించిరి.

ఆ విచిత్రవిషయ మెట్టిదో యానాఁడే నేను దొలుత తెలిసికొంటిని. నన్ను దగ్గఱ కూర్చుండు మనిరి. రాధాకృష్ణ పిళ్ళగారు గురుదేవులకు నమస్కరించి కనులు మూసికొని యొక నిమిష మాగి ఇంగ్లీషుతో గ్రంధము పఠించుచున్న ట్టేదో చెప్పసాగిరి. మహా దేవయ్యగారు దానిని వడివడిగా వ్రాయసాగిరి. ఇద్దఱును యఫ్. యే చదివిన వారు, ప్రజ్ఞా శాలులు. పిళ్ళ గారు వడిగానే చెప్పసాగిరి. అయ్యరు గారు వడిగా వ్రాయ సాగిరి. ఉదయము సరిగా తొమ్మిది గంటల పదునేడు నిమిషముల వేళకది వ్రాయ నారంభించిరి. పిళ్ళ గారు కనులు మూసికొన్నప్పుడు అంతర దృష్టికి కనుపడి నవి, ఆంతరశ్రుతికి వినబడినవి చెప్పఁ దొడఁ గిరి. అప్పుడు నా శరీరాం త ర్భాగమునఁ గల స్వస్ధ్యాస్వాస్ధ్యములు, న మనో భావములు , నా యనరోగ్యము కారణములు, తన్ని వారణో పాయములు, అప్పటికి జరిగిన పూర్వ జన్మములు మొదలగు నవి కలవు. అది యెల్ల ముగిసిన పిదప దానిని శ్రీ వారి చెంతకుఁ గొనిపోయి వినిపించిరి. వారి సమ్మతి మిఁద దానిని రికార్డు చేసిరి. ఆ కాలమున యోగాభ్యాసమునకు వచ్చి శిష్యతను బొందువారి కందఱకు నట్టి టెస్టు తీయుట జరగు చుండెడిది. నన్నుఁ గూర్చి వచ్చిన రికార్డును కాపి కోరితిని. శ్రీ వారి సమ్మతితో దానిని నాకిచ్చిరి. అది నా దగ్గఱ నున్నది.

--- ---