Jump to content

ప్రజ్ఞా ప్రభాకరము/దివ్యదర్శనము

వికీసోర్స్ నుండి

౨౩

దివ్యదర్శనము

రైలు సాగెను. రైలు వేగమును మీఱి నా మనోవేగాముండెను. మర్నాడుదయము ఎనిమిది గంటలకు కుంభకోణము స్టేషనులో దిగితిని. కాలకృత్యములు తీర్చుకొని మంచి మామిడి పండ్లు కొనుకొని నరసింహముగా రిచ్చిన యడ్రేసుకు బండి మిఁద వెడలితిని. బండి వాఁడా యింటిని బాగుగా నెఱిఁగిన వాఁడు. త్రోవలో నాతఁ డు అక్కడి గురుదేవుల ఘనతను వర్ణింప దొడఁగఁగా తదాకర్ణనోత్సాహముతో నే నంతలోనే చేర వలసినచోటికిఁ జేరితిని.

ఒక సన్న్యాసి కాషాయధారి రోడ్డుమిఁదబండి నిలువు గానే చేరవచ్చి నా తెలుఁగు తీరు గుర్తించి ' యెవరు నాయనా నీవు? ఎక్కడ నుండి రాక? ఎందుకోసము?' అని తిన్నని తెలుఁ గు పలుకు బడితో ప్రశ్నించెను. నా న్నాలింగ నము చేసికొని బండి దించెను. ఆయన యాదుకొని నన్ను బండి దించినప్పటి పరితోషము నే నెన్నటికి మఱువఁ జాలను. నా చేతి పండ్ల బుట్ట పుచ్చుకొని వడిగాలోని కరిగి నా విషయములు శ్రీ వారి కెఱింగించి నన్ను దర్శనమునకుఁ దోడ్కొని పోయెను.

లావు గాక సన్నము గాక, పొట్టి గాక మఱీ పొడుగు గాక నిమ్మపంటిచాయతో అరుణోదయ కాంతులు కడల్కొల్పుచున్న శ్రీ వారిని జూడగానే నాయొడలు పులక


వారలు కట్టుచీర, లశనంబులు కాయగమళ్లు, కొండలుం
గాఅడవుల్ నివాసములు గాఁ దపియించి మహర్షు లెవ్వరిం
జేరుకొనం దలంచి రల చిన్మయతత్త్వము సర్వమానవో
ద్ధారము గోరికొన్నయవతారము మద్గురుమూర్తిఁ గొల్చెదన్!

రించెను. కేలుదోయి మోడ్చి నమస్కరించి జాబు నర్పించు కొంటిని. చదివి, నవ్వి ' స్నానాదికము గావించి విశ్రాంతి గొను' మనిరి.

నాకు శ్రీవారిదర్శనము చేయించిన ఆస్వాముల వారు నన్ను స్వజనముగా నాఁడే కాక వారు జీవించి యున్నంత దాఁక ప్రేమించుచుండిరి. వారి పేరు సచ్చిదానందేంద్ర సరస్వతీ స్వామి. అప్పటికిఁ గోన్నేండ్లకు ముందు వారు బందరులో సన్న్యసించిరి. బ్రాహ్మణ్యులు జంధ్యాల గౌరీ నాదశాస్త్రి గారు వారి కుద్యోగము నుండి పెన్షన్‌ ఇప్పించి యాస్రమ మిప్పించి రఁట! ఆకారణమున వారికీ కృష్ణా మండలము వారన్ననది కాదరము. వారి జన్మ దేశము కాచీ మండలము. తెలుఁగు బ్రాహ్మణులు. సాన్న్యాసానంతరము వారు మహా నీయు లని ప్రఖ్యాతి గన్న స్వాముల వార్లను గొంద ఱను వెన్నడించి విసుగు గొని శాంతి లేక తిరుగాడుచు శ్రీవారి మహానీయతను విని వారికడకు వచ్చి ఆజీవితము అక్కడ నే నెలకొనిపోయిరి. శ్రీకృష్ణునకు సాత్యకివోలె వారు శ్రీ వారికి సదానువర్తనులై యుండిరి.

నే నప్పటికీ తొట్టె స్నానము సరిగా చేయకున్నను కారము లేని, తిరుగబోత లేని కూరలతోనే భోజనము చేయుచుంటిని. శ్రీవారితో నా స్ధితిని విన్నవింపఁగా ' ఇఁక నీ యారోగ్య రక్షణ భారము నేను వహించితిని. వెఱవక నలువురితో పాటుగా మామూలు భోజనము చేయవచ్చును. దానివల్ల నీ కేమి చెఱుపు రాదు' అనిరి. ఆవాల తెట్టె తేలుచున్న చారుతో , నూనె తిరుగబోత కూరలతో నే నానాఁడు భోజనము చేసితిని. అంతకుముం దట్టి భోజనము చేసినచో కడుపులో మంట. నిద్రరాదు. ఆ శాంతి అధిక మయ్యెడిది. స్వాములవారు కంటిని రెప్పవలె నన్నుఁ గాచియుండి నాయనారోగ్యాది విషయములు విచారింపసాగిరి. అన్నియుఁ జెప్పితిని. మర్నాటి రాత్రి వఱకే నే నక్కడ నుండ వీలగుట తెల్పితిని.

ఉపదేశము

  • [1] నాటి సాయంకాలము ఆఱుగంటలకు నాకు శ్రీ వారి శిష్యతాను గ్రహము లభించెను శిష్యతాను గ్రహము పడయుటకు సమకూర్చుకోవలసిన వాని నన్నింటిని స్వాములవారితోడ్పాటుతో సమకూర్చుకొంటిని. ఉపదేశవిధాన మెల్ల స్వాములవారు సూచించిరి. శ్రీ వారి సాష్టాంగముగ నమస్క రించి నాయభ్యర్ధనము నివేదించుకొంటిని. ఉపదేశము చేసిరి. వెంటనే' నీవు హాలులోనికి వెళ్లి ప్రేతాసనమున శయనించి, నమస్కరించి, ఉపదిష్టము నొక్క మారే యుచ్చరించి, కనులు మూసికొని, శరీరము లోతట్టున నే మేని జరుగను గనుక దానిని గుర్తించుచుండుము. మనస్సు బహిర్ముఖమై యెక్కడి కేని పోయినచో పోనిమ్ము. నీవై యరికట్టవలదు. ఆదే తిరిగి రాఁ గలదు. ఏమి జరుగునో సాక్షిమాత్రుఁడవై పరికింపఁ దలపు గొనుము. అంతే నీవు చేయవలసినది. కొన్ని నిమిషముల దాఁక కనులు తెఱవ ప్రయత్నింపకుము. ప్రయత్నించినను దెఱవ యోగములో చేరిన తేది 22-6-1916. మిడియము సంఖ్య 330. వీలుపడదు. మరల మూసికొనియే పోవును. శరీరములో నప్పుడు జరగవలసిన దెల్ల జరగగానే కన్నులు తెఱపి యగును. అటుపై కనులు మూసికొని పండుకొనుట కష్టమని పించును. అందాఁ క కనులు తెఱవను, లేవను కష్ట మని పించును' అని స్వాముల వారు దగ్గఱ నుండి తెలియఁజెప్పిరి. అట్లే ఉపదిష్టము నొక్క మారే సార్ధకముగా స్మరించి యుచ్చరించి కనులు మూసికొని పండుకొంటిని.
  1. * యోగములో చేరిన తేది 22-6-1916. మీడియము సంఖ్య 330.