ప్రజ్ఞా ప్రభాకరము/తొలి కలయిక

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

౧౭

తొలి కలయిక

నాకు టైఫాయిడ్ తగ్గి యారోగ్యము లభించు నాఁటికి జీవిత వాంఛలు రెండు గల వంటిని. తొలిది శ్రీ తిరుపతి వేంకటేశ్వరస్వామి దర్శనము. అది తొలుత నగమ్యగోచరముగా నుండుట, యీనాఁ టికిఁ జాల విషయములు దెలియ నగుట రేఖామాత్రముగాఁ జెప్పితిని గదా! రెండవది వివాహ మాడితిని గనుక అచుంబిత ప్రక్రియయ గుస్త్రీ సుఖము నను భవింపగోరుట. అది యేదో వేంకటేశ్వర దర్శనము వలె నపూర్వాద్భు తాతిలో కానందము గొల్పునదిగా నుండఁ గల దనుకొనుచు నువ్విళ్ళురుచుంటిని. ఈ రెండు నెఱవేరినచో నా జీవిత ప్రయోజనము లభించినట్టే యనుకొంటిని.

తిరుపతినుండి యింటికి వెళ్ళినతో డ్తో నారోగ్యవృద్ధి క్షణక్షణవిజ్రుంభణము గాఁజొచ్చినది. మా తలిదండ్రులు వగైరాలు మద్రాసునుండి వచ్చుదాఁక ఇంచుమించుగా పదునైనాళ్ళు నా మిత్రులు శ్రీ సుసర్ల కుమార స్వామి శాస్త్రి గారి యింటనే యుంటిని. వారును, వారి కుటుంబిని శ్రీమతి రామమ్మ గారును నన్నుబిడ్డను గాఁగాపాడిరి. ఆకలి నాక మితము గారేగుచుండెను. ఎక్కువగా భోజనము చేసెడి వాఁ డను. దృష్టి తగులు నని రామమ్మ గారు నాకు చాటుగా భోజనము చూడ కుండు నట్లు భోజనము పెట్టుచుండెడి వారు. ఆ దంపతులు నేఁడు లేరు. వారి పుణ్య గతికై తలఁపు నాకు వచ్చినపు డెల్ల తపించుచుందును. కుమారస్వామి శాస్త్రిగారిని నేను నా భృక్తరహిత తారకరాజయోగా నుష్టానమున తర్వాత 1917 వ సంవత్సరమున చేర్చితిని. కాని వారు దుర్బలమయిన చిత్త వృత్తి కలవారు గాన యిందు శ్రద్ధాళువులు కారయిరి. దుస్సహ వాసముల మరగి సంపదా రోగ్యములను సంపూర్ణముగాఁ జెడగొట్టుకొనిరి. వారి భార్యగారు ముందుగాను, 1928 ప్రాంతముల గాబోలు వారును చనిపోయిరి.

కుమారస్వామి శాస్త్రి గారు చనిపోయిన పదవ నాఁడు నేను ధ్యానము చేసికొను చుండఁ గా నా కన్నుల యెదుట స్పష్టముగా గోచరమై చిఱునవ్వు నవ్వుచు ' నీ మంచి సహవాసమును దూరస్థుఁ డనుగా నుండుటచే కోల్పోయి నీ మాట వినక దుస్సహావాసము జిక్కి చెడితిని. శారీరక వాంఛలు నన్నట్టుగా నాకట్టుకొని పెడ మార్గమును బట్టించినవి. చక్కబఱుప సాధ్యము కాని తుచ్చ శరీరము తొలఁ గెను . ఇఁక నీ గోష్ఠిలో నేను సుప్రతిష్ఠితుఁ నుగా నుండును' అని లజ్జా గర్భితముగా పలికి నాతో ధ్యానమగ్నఁ డగుట కాన వచ్చెను. శీలము పవిత్రముగాకున్నను, ఉపకార ప్రకృతి యాతనికడ నసాధారణమైనదిగా నుండెడిది. ఆ ర్తతలో నున్నవారి కెందఱకో ఆతఁ డుపకరించెడి వాఁడు. తన కల్మినందుకుఁ గోల్పోయెను. ప్రధానముగా నాయెడ నాతఁడు నెఱపిన సౌహార్దవాత్సల్యములకే, ఆ సుగుణమునకే శాశ్వతముగా నా జీవు డుద్గతి నొందగ కానీ తపించుచుందును.

వారి యింట పదిహేనురోజుల కెక్కువకాలమే అప్పుడుంటిని. అంతలో మా తల్లిదండ్రులు వగైరా లింటికి వచ్చిరి. మూఁడు నాలుగు నెలలకు నే నంతకు ముం దెన్నఁడు నెఱుఁగని యారోగ్యము పొందితిని. నా తలఁ పున గుర్తించినవారగుటచే మా తలిదండ్రులు, నక్కగారు పునస్సంధాన ముహూర్తము నిర్ణయించుటకు మా యత్తవారిని గోరిరి. ఇంకను గొంత కాలము మా మామగారు ముహూర్త నిర్ణయమున కంగీకరించిరి. కొలఁది రోజులు ముందుగా మా సోదరికి గూడ పునస్సంధాన ముహూర్త మేర్పఱచిరి.

అంతదాఁక బులపాటము చెందుచున్న నాకు ముహూర్త నిర్ణయము నాటనుండి చాల మనోదుఃఖము రేగెను. నా వ్యాకులతను గుర్తించి రేకానికారణమేదోయెవ్వరునెఱుఁగరు. తొలుత నేను నెఱుఁగను. కారణ మెఱుఁగ రాకుండ వ్యాకులత పెరుగసాగెను. వివాహము నాఁటి నుండియు నా జీవితము క్లేశముల పాలగుచుండుట, దానికి కారణము పెండ్లాడిన పిల్ల జాతకముపొంతనములు ససిపడినవి కాకపోవుట యని మావారు చీకాకు చెందుట యని వెదకి వెదకి కొంత గుర్తించితిని. నా వివాహము నాఁడు వధువు జాతకము చూపింప గోరఁగా మా మామగారు నేను జాతకము వ్రాయ లేదని చెప్పి వేసిరి. కాన దాని గుణదోషములు గుర్తింప వీలుపడదయ్యెను. అసలు నాకు జాతక పరిశీలనము మీద విశ్వాసము లేదయ్యెను.' యస్యాం మనశ్చక్షుషోర్నిబంధ స్తస్యా మృద్దిః ' అన్న ధర్మసూత్రము నాకు నవ్వ్హి నేను మనసార ప్రేమించి యా పిల్లను బెండ్లాడితిని గాన నా కప్పుడు కొఱఁత తోఁపలేదు. అప్పటివఱకు ఆ వధువు నాకు ధర్మ పత్నిగా నాతో సంసారయాత్ర సాగింప నున్నది సుమా యన్న తలఁపే కాని యంత కెక్కువ యోచనలు లేవు. ఇఁకమిఁద నా వధువు మా యింటికి రానున్న దని, వివాహ ప్రయోజన మిఁక మీదనే అనుభవింప నంటిమని, నాహృదయము నే నెఱుఁ గుదు ననుకొనుచుంటిని గాన ,ఆమె హృదయము నాకర్పించి నా హృదయమున నప్పన గొనుటో, తన హృదయమును నా కర్పింపక నాహృదయమును హరించుటో యేదిచేయునోయనీ, అంత దాఁక నన్నత్యంతము ప్రేమించుచున్న మా తలిదండ్రుల కాపిల్ల ప్రేమ పాత్ర మగునో కాదో అనీ, ఆ పిల్ల వారి నెంత యేడ్పించునో అనీ, నా యన్నదమ్ములకు, అక్క చెల్లెండ్రుకు, నాకుఁగాల సౌమన స్య మిఁక ముందేమి కానున్నదో కదా అనీ వెఱపు. క్షణక్షణమునకు స్పష్టాతి స్పష్టముగా విచారము పెరుగ సాగెను. మఱియు మా తలిదండ్రుల చాటుననే యంతదాఁక నా జీవితము సాగుచుండెను. సర్వభారము వారు మోయుచుండఁగా నిర్భయుఁడనై నే నుంటిని. నా దృష్టిని వారు వ్రాలి య స్తమింపబోవుచున్నట్టును, నే నొక వంశవృక్షమును వెలయించి యుచ్చస్థాన మాక్రమింప బోవు చున్నట్టును దోచ సాగెను. నే నంత నిర్వహింప గల్గుదునా? మా తలిదండ్రులు న్నంత దాఁ క వారి చాటువాఁడ నగుటే శ్రేయము గాదా? నేను వెలయింపఁ బోవు వంశవృక్షముతో మా తలిదండ్రులు వేలయించిన వంశవృక్షముతో పొంది పోసఁగి లోబడి యుండ వలదా? ఏమగునో? నా జీవిత మార్గము మంచికో,చెడుగుకో దారి త్రొక్క నారంభించు సంఘటన దాపురించినది. ఎందఱ కుటుంబములో యిట్టిపట్టుల నప మార్గములఁ బట్టినవి కానవచ్చినవి. ఇంక నెందఱ కుటుంబముతో సన్మర్గముల బట్టినవి కానవచ్చినవి. ఏవంవిధమయిన కొట్టుకాడుచున్న నా ముఖమున న శాంతిలక్షణములు ప్రవ్యక్తముగా గోచరించుచుండెను. వానిని జూచి మా తల్లిదండ్రులు, నక్క గారు త్రొక్కట పడఁజొచ్చిరి.

సంతోషము గాని సంతాపము గాని యంతరంగమును కలవరపఱచుచున్నప్పుడు దాని చేష్టయ కృత్రిమముగా, స్పష్టముగానున్న దున్నట్లు కొందఱ ముఖమున గోచరించుచును. కొందఱు లోని సంతోషము దాఁచి యుంచు కొని ముఖమున, సంతోషమును దోపయకున్న మానెగాని, యేవో ప్రయోజనము లర్ధింప పైగా విచారమునే వెలయించుకొనఁ గల్గుదురు. ఎంత దుఃఖకారణము కల్గినను దాని బలమును వివేకముచే తగ్గించుకొని దానిని లోనగూడ భావింపకుండుట మంచిది గాని లోన కుములుచు బైటికి నవ్వు దెచ్చుకొనుట రోఁతయే. అ నవ్వు వెడన వ్వగునె కాని తియ్యని నవ్వుగా తెరలు వాఱదు. స్మిత ప్రయత్నమే కాని దాని సత్ఫలితము కలుగదు.

తాను ప్రేమించువా రెవ్వరు గాని తప్పు చేసినట్టు తాను భావించునప్పుడు వారిని సరిదిద్దఁ గోరునపు డాయా వ్యక్తుల వివేక పరిపాకము ననుసరించి కోపసూచనలు చేయుట, గర్హించుట, తిట్టుట, కొట్టుట గూడ జరగుచుండును. అందులో నంతరంగము నవ్యక్తముగా, స్థాయిగా అనురాగమే కుదుర్కొని యుండును. అట్టిచో చివ్వన కోపము రేగును. కోపసూచన మొదలుగా కొట్టుట దాఁక వివేకపరిపాకనుసారము నొక చేష్ట జరగుచుండ అంతరంగమున కేసి చూడఁ గా నక్కడ అనురాగ రేఖలు నవ్వుచుండుట, అవి తన్నే కోపించుట, తిట్టుట, కొట్టుట, జరపినట్లయి యిఁక నిట్టి చేష్టలు చేయకుమా యని మంద లించుట అంతరాత్మావేక్షణా నుభూతి కలవారి గోచరించును. రేగిన యా కోపోద్రేక మా మానవుని యంతరంగము తనలో హాయిగా నున్న యనురాగము శరీరాణువులం దంతటను నిండారుటకు చేయు జతనములో తనకు విరుద్ధమయిన, తనతో లోనుండ గూడని కోపపు బండాల మునదను చూచి బైటి వెడల గోట్టునప్పుడు చెలరేగి బయటబడి నది గగుర్తింపనగును. శరీరమును జుట్టియుండి నావృత్తి దాకఁ నది యెఱ్ఱని పొగలతో చెలరేగి దిద్దుబాటు చెంద వలసిన వారిని దాఁకి వారి యనుకూల్య ప్రాతికూల్య, సౌమనస్య, వైమనస్య, ప్రబలు, దౌర్బల్యాద్యనుగుణముగా దను చేయఁ గల మంచిని జేసి యుపరత మగును. ఈ విధముగానప్పు డప్పుడు లో నిల్వయున్న కోపపు సరకులో నెంతో కొంత అసత్పదార్ద మగుటచే నిలువ వీలులేనిది కాన కర్చు పడి పొగా పోగా లో స్థాయిగా నున్న ప్రేమ సత్పదార్ధము గాన శాశ్వతమై పెంపొందుచుండును. దీని నాత్మావేక్షణ పరులు గుర్తింపఁ గల్గుచుందురు. అంతరంగమున స్థాయిగా ననురాగము, ప్రేమ ఉన్న సందర్భములను గూర్చి వ్రాసినదిది.

ఆత్మావేక్షణపరులు లోనికి బోగా పోగా ఇఁక పోవ నెడము లేకుండ హద్దుగా గుర్తింప నగు నెలవు ప్రేమైక మాయముగానే ఉండుగా.ప్రేమ సత్పదార్ధము కాన నిత్యము.ఆ స్థలముణ ప్రేమేతర (ద్వేష )వాసనకూడ నుండదు.అద్దానిని జేరుకొనుట కై లోనికి బోను పోను,ప్రేమే తదార్ధము పలుచబడుచు సన్నసన్నగా దిగనాసిల్లు చుండును. ప్రేమపదార్ధము చుక్కనగుచు దాని విజ్రుంభణము అంతరంగంమునే కాక బహిరంగమునఁ గూడ 'అంత ర్బహిశ్చ'క్రమక్రమముగా నిండా ర్చును.అసలు తత్త్వన్వేషి సముద్రమధనకధగా సత్సంకల్పపు మందర పర్వతమున శరీరసముద్రమున దింపి శరీరము మిధింపగా లోనుండి మంచి చెడ్డలు రేగుచుండును.చేడుగులను దొలఁగఁ ద్రోసి కొనుచు మంచిని గుర్తించి స్వీకరించి మనుభవించుచు బోవఁగాఁ దుదకు అమృత లాభము కలుగును.ఇందు మూలాదారము కూర్మమగును.

అప్పుడే గార్హస్ధ్యము నందిన మా బావగారిని నా దుఃఖ కారణము విచారింపఁ గోరిరఁట! ఒకనాఁడు నిద్రలేచి యూరి నంటి యున్న మా పొలమున కరిగి అక్కడి మా మంచినీటి బావికడ కాలకృత్యముల దీర్చుకొని స్నానోన్ము ఖుఁడ నగుచు తాటిచెట్టు చాటు కరిగి దుఃఖించుచున్న నన్ను వెనుకతట్టున నుండి వచ్చి పట్టుకొని మా బావగారు దుఃఖకారణము ప్రశ్నించిరి.ఏమి లే దంటిని. ఉన్నను,అది చెప్పినను మిరు దాని విలువ గుర్తింప లే రంటిని.ఆతఁడేదో గొప్పదోషము నాలో నున్న దనుకొని తీవ్రముగా చకితుఁ డయి పదింబదిగా ప్రశ్నింపఁ దొడఁ గెను. నా కేదో యోగ్యతాలో పభీతి కలదని యాతఁ డనుమానపడుచున్నట్టు తోఁ చెను. ఇఁ క దాపరాదని యున్న దున్నట్టు చెప్పితిని.మా తలిదండ్రుల పతనము గోచరించుచున్నట్టున్న దన్న మాట మా తలిదండ్రులతో చెప్పరా దని యాన వెట్టితిని.అంతా విని యాతఁ 'డయ్యో యిదా నీ యేడుపు!'అని పగలబడి నవ్వఁ జొచ్చెను.' లోకసాధారణము మయిన భావము లనునీ తలనే విఱిగిపడిణ వానిగా భావించి యఘోరించెద వేల 'యని తెగడెను.తర్వాత మా తలిదండ్రులతో నుచిత మగునంతవఱుకు చెప్పి వారిని తేర్చెను. రాగవిరాగములు రెండుగా నాలో నప్పుడు రేగినవి.

ముహూర్తము జరిగినది.తిరుపతి శ్రీ వేంకటేశ్వర స్వామి దర్శనము వంటిదే యిది కూడ నయ్యెను. వాత్స్యయన కామసూత్రాది గ్రంధము లేవేవో చదివి యుంటినే కాని అది పుస్తక విద్యయే కానీ యనుభూతి లేనిది.నాకు నర్మసచివుఁడు మా బావ మర్నాడు శుష్కేష్టితంత్రముగా నాకు తెలియఁ జెప్పినపై కృతార్ధుఁడనయితిని. ఇంజనీయరింగు, వైద్యముమొదలగుననేక విద్యలలో పుస్తక పఠణ మాత్ర నప్రాజ్ఞాలై మెలమెల్లగా చేతిక్రింది చిన్ని యుద్యోగుల యుద్బోధముతో చతురు లగుట చూచుచున్నాము గదా?