Jump to content

ప్రజ్ఞా ప్రభాకరము/టైఫాయిడ్

వికీసోర్స్ నుండి

౧౫

టైఫాయిడ్

మైలాపూరునుండి ఎగ్మూరు మ్యూజియం బిల్డింగ్సులో నున్న ప్రాచ్యలిఖిత పుస్తకశా లకు రాకపోకలు సేయుట, యెడ తెఱపి నక్కడి సంస్కృతాంధ్రములను జసువుట, చదివి గ్రంధములలోని ముఖ్యవిషయములకు నోట్సు వ్రాసికొనుట, కొన్నింటి పత్రికలకు వ్రాయుచుండు ట చేయుచుంటిని. రేయుంబవళ్లు విశ్రాంతి యెఱుఁగ కుండ శ్రీ రామేశముగారు గ్రంధములు చదువు చుండుటను జూచు చుంటిని గాన నట్లు సాగింపఁ గోరిన పూర్వసుకృతము చేత వారికి సుకరముగా నుండెను గాని నాకది యసాధ్యము గానే ఉండెను. పగలు చదవిన గ్రంధముల యర్ధములు రాత్రులందు గోచరించుండెడివి. నిద్ర తగ్గెను నిద్ర పట్టనప్పుడెల్ల లేచి మరల జదువుచుండెడివాఁ డను. దౌర్బల్యము నిరుత్సాహము పెరుగఁ జొచ్చెను. ఇంటికి పోఁ దలచి ఒక నెల సెలవు తీసికొంటిని.

సెలవు తీసికొన్న మర్నాడే నాకు తీవ్ర జ్వరము వచ్చెను. డాక్టరుమందిచ్చుచుండె ను గాని జ్వరము హెచ్చుచునే యుండెను. నాల్గయిదు నాళ్ల యినతర్వాత నాతఁ డు స్వగ్రామమున కీతని పంపి వేయుఁడని మా బావగారితో చెప్పెను. నేను కదల లేని స్థితిలో నుంటిని. మిత్రు లయినపండిత గోపాలాచార్యులుగారికి కబురంపితిని. వారు వచ్చి చూచి ' నేను సుదూరమున నుంటిని. ఇక్కడి వైద్యుల దగ్గఱనే మండు గొనుట మంచి దేమో! అనిరి. అందాఁ క ఇంగ్లీషు వైద్యము నే నెఱుఁగను. మా నాయనగా వచ్చిన మందు లిచ్చువారు. నా కందాక నంత తీవ్రానారోగ్యము లెప్పుడును రాలేదు.' ఆయుర్వదవైద్యము పరిచితము గాన, మిరు మిత్రులు గాన మిరే మందియ్యండి' అంటిని. వాటట్లే సమ్మతించి వైద్యము చేయబూనిరి. ప్రతిదినము ఆచారప్పన్ వీధినుండి మైలాపూరు శాలైలీవీధికి కొన్ని మైళ్ళు కోచి మిద వచ్చి పోవుచుండిరి.

విరేచనముల కానీ యొకనాఁ డావగింజంత మాత్రయిచ్చిరి వారు. పది రోజులనుండి నా కాహరంమే సరిగా లేదయ్యేను. ఆ మాత్రతో నానాఁ డా నాకు నాల్గయిదు విరేచనము లయ్యెను. దొడ్డిలోనుండి యింటిలోనికి వచ్చుట యెఱుఁగుదును. స్మృతి తప్పి పడిపోతిని. కొంతకు స్మృతి వచ్చినట్లయ్యెను. నాడి చూచుకొంటిని. నిమిషమునకు రెండు వందల దాపుగా కొట్టుకొనుసమాఖ్య యుండెను . గుండె యెగసి పోవుచుండెను. దగ్గఱగా నున్న రామేశంగారిని పిలుచుకొని వచ్చిరి. వారు నాడి చూచి అపాయస్థితిలో నున్నట్లు గుర్తించి వెంకనే డాక్టరు నంజుండ రావుగారికి చీటీ వ్రాసి మనిషిని బంపిరి. నాస్థితి గందరగోళముగా నుండెను. అప్పుడే కాచిన పాలు రెండళాకులు గబగబ త్రాగివేసితిని. పది నిమిషములకు ప్రాణ మందు కొనుచున్నట్టు తోఁచెను. అంతలో నంజుండ రావుగారు వచ్చి పరీక్షంచిరి.' తీవ్ర మయిన టైఫాయిడ్ జ్వరము. వెంటనే యీ క్రింది మందులు తెచ్చి యియ్యండి' అని చీటీ వ్రాసి యిచ్చిరి. గిడ్విన్ కంపెనీ వారు మందు లిచ్చిరి. అ మందులు త్రాగిన పదినిమిషములకే ప్రాణము ససిగా చేరుకొనేను. జ్వరము 22 దినములకు తగ్గినది. ఈ నడుమ కొన్ని యొడుదుడుకు స్థితులను గలిగినవి. ఏమి కలిగినను వా రిచ్చిన మందులు వెంట వెంటనే నాకు గుండె నిబ్బరము కలిగించుచు వచ్చెను.

ఒకనాఁడు విరేచనము లగుట కేదో కొంచెము మందిచ్చి మామూలుమందులు పుచ్చుకొనవల దనిరి. ఆనాఁ డు నాకు నిస్త్రాణ హెచ్చును. డాక్టరు రాగానే ' దినము త్రాగే మందు నేడు త్రాగవద్దంటి రట! అవి త్రాగగానే నాకు పుష్టి కలిగెడిది. నే డట్లు లేదు' అంటిని. ఆయన నావీపు చఱచి, నవ్వి ' మరల వానిని తిసుకొనుడు' అనిరి, జ్వరము తీసిన తర్వాత అవి చికిన్ బాతు బ్రాందిలో కలిపిన దొకటి, ద్రాక్షాసవమువంటి దింకొకటి యగుట తెలియ వచ్చెను. ఆ తర్వాత రోఁత గొంటిని. కాని యప్పటిదాఁ క నా కవి యమృతకల్పములుగా దోఁ చెను.

ఆ జ్వరతీవ్రతలో నా జీవితమును గూర్చి సంశయ మేర్పడి మా బావగారు జాబు వ్రాయఁగానా మిత్రులు శ్రీకాకర్ల కుమార స్వామి శాస్త్రిగారు, మామామగారు, మాతలిదండ్రులు, అన్నగారు మద్రాసు వచ్చరి, ఆ తీవ్రానా రోగ్యపు నాళ్ళలో తమకుమారై రజస్వల యయ్యె నని మామామగారు జాబు వ్రాసిరి. ఆస్థితి మా వారికీ మఱింత వ్యాకులత గొల్పెను. ఎట్లో జ్వరము తగ్గినది. ఆరోగ్య వంతుఁడ నయితిని. నాస్థితి విని నంజుండ రావుగా రార్నేల్లు లీవుపెట్టి యింటికి పోవలసి దనియు, ఇతర వ్యాధు లేవి లేవు గాన వడివడిగా ఆరోగ్యము కోల్కోగల దనియు, ఆ టైఫాయిడ్ జ్వరం తగ్గిన తర్వాత నూట తొంబదిమందికి సహజముతో సంపూర్ణారోగ్యము పెంపొంది జ్వరము నకు పూర్వ ముండిన యనారోగ్య వాసనలు కూడ తొలఁగి విజ్రింభణముతో నుండ గల్గుదు రనియు, సంపూర్ణారోగ్యము బలము పడసి మూన్నెల్ల తర్వాత గార్హస్థ్యసుఖ స్థితిని బడయుదు వుగా కనియు, ఆ ర్నెల్ల తర్వాత మద్రాసుకు సకుటుంబముగా వచ్చి వేయుదువుగా కనియు ననిరి.

--- ---