ప్రజ్ఞా ప్రభాకరము/సాహిత్యజీవనము - అరకుడుపు

వికీసోర్స్ నుండి

౧౪

సాహిత్యజీవనము - అరకుడుపు

నేను మద్రాసు వచ్చిన తర్వాత మైలాపూరులో మా బావగారితో కలసి యే యుంటిని గాని భోజనాదికము పూట కూటియింటి చేయుచుంటిని. ఆనాళ్ళలో మైలాపూరు కపాలీ శ్వరుని గుడిదగ్గఱ రంగమ్మ యను పుణ్యంగన హొటలు పెట్టుకొని యుండెను. ఆమె కొక్కడే కొడుకు. అతడు వ్యర్దుఁడు. ఆయమ్మ భోజనముకు వచ్చు వారికి వారియిండ్లలోకంటె హాయిగా ననుకూలముగా నుండునట్లు వంట చేసి మంచి భోజనము పెట్టెడిది. ఆమె శ్రీ రెంటాల వెంకటసుబ్బారావు గారి దూరపు బంధువు. ఆమె భర్త చాలా శ్రోత్రి యుఁడు, పుణ్యాత్ముఁడు న్నియా సుబ్బారావు గారు చెప్పుచుండెడివారు. ఆమెను శ్రీ సుబ్బారావు గారు కొంతకాల మింట నుంచుకొని పోషించి రఁ ట! కాని వృద్ధురాలు. స్వతంత్ర జీవనార్ధిని యామె యట నుండ నొల్లక వేర్వాసి వచ్చి హొటలు పెట్టినది. ఆమె పుణ్యస్మరణ మిప్పుడు నాకు ముదము గొల్పు చున్నది. నామిఁద నా మెను మాతృ శ్రీనిగా గారవించుచుండెడివారు.కొందఱు హొటలు పెట్టుట నీచవృత్తి యందురు గాని యే వృత్తి యయినను నిర్వంచనముగా ద్రోహము లేకుండ సాగించుచో నది పుణ్యాపాదకమే కాఁగలదు. ప్రాచ్యలిఖిత పుస్తశాలకు పదే పదే సందు దొరకినప్పు డెల్ల వెళ్ళుచు అక్కడి గ్రంధములు, అముద్రితములు పరిశీలించుచు, లోకల్ రికార్డు నెల్ల చదువుచు, అపూర్వాంశముల గుర్తించుచు, గుర్తించిన వానిని మిత్రుల కుత్తరముల ద్వారా తెలుపుచు తన్మయుఁ డనై విద్యావ్యా సంగము చేయుచుంటిని. ప్రాచ్యలిఖిత పుస్తక శాలాధ్యక్షు లొకతూరి లైబ్రేరియ౯ ద్వారా నా విషయములు తెలిసికొనిరి. తెలుఁ గుపుస్తకములకు కేటలాగు వ్రాయుచున్న గుమస్తా శెలవు పెట్టగాతోడ్తో నా స్తానమున నన్నున్నియోగించిరి. అది టెంపరరీ పోస్టు. అందుచే ఆ గుమాస్తా తొలఁ గెను. అతని పై ఆఫీసు వారి కతృప్తి. ఆతడు తొలఁ గినపిదప ఆ పోస్టును స్థిరముగావించి యందు నన్ను నియోగించిరి.

ఆనాళ్ళలో పావులూరు మల్లనకవిని గూర్చి నా మూలమున చర్చ రేగెను. శ్రీ వీరేశలింగముపంతులుగారు కవుల చరిత్రలో వ్రాసిన తీరు సరిగాదని, పావులూరి మల్లన నన్నయ నాఁటి మల్లన మనుమఁ డని నేను లైబ్రరీలోని వ్రాఁ తపుస్తకములఁ బరిశీలించి పత్రికల ద్వారా నిరూపింప యత్నించితిని. అప్పటి మద్రాసు తెలుఁ గు పత్రిక శశి లేఖ వీరేశలింగముపంతులుగారి తరపున నిలిచి అనేకులు నా పై చెలరేగిరి. వీరావేశముతో చిలుకూరి వీరభద్ర రావుగారు లైబ్రరీ పుస్తకములను నేను పసికుంకను జేరి దుర్బుద్ధితో మార్చివేయుచుంటినని, నేను వ్రాసినట్లు వ్రాఁ త ప్రత్రులలో లేదని, గవర్న మెంటువారు నన్నక్కడ నుంచరా దని బాహాటముగా వ్యాసములు వ్రాయసాగిరి. ఇంకెంద రెందఱో అటు తిరిగి నన్ను కటువుగా మందలింప సాగిరి. శ్రీ వీరేశలింగము పంతులుగారి పేరుప్రతిష్ట లట్టివి గనుక, వారి యాం ధ్రసాహిత్యసేవ యంత మహనీయమయినది గనుక వా రెల్లరు నట్లు ద్రిక్తులయిరి. ఏవో కొన్ని పొరపాట్లుండిన నుండ వచ్చును గాక అని సరిదిద్ద నొల్లకపోయిరి. వారందఱు సత్య మేది యని పరిశీలింపక వ్రాసినవారే. ఒక్క వీరభద్ర రావుగారే సత్యము స్పష్టముగా గుర్తింపఁ దగియున్నను స్పర్దా బుద్ధితో సత్యదూరముగా వ్రాఁత సాగించిరి.

ఆనాళ్ళలో ప్రాచ్యలిఖిత పుస్తక శాలలో మహావీరాచార్యుని గణిత సార సంగ్రహమును ప్రొఫెసరు రంగాచార్యులు గారు ముద్రించుచుండిరి. మల్లన గణితము దానికిఁ దెలుఁ గగుట నేను గుర్తించి రంగాచార్యులుగారి కెఱిఁగించితిని. అప్పుడు వీరభద్రరావుగారి వ్రాఁ తలను గూడ వారికి దెలిపితిని. అప్పుడు మా వివాదము నెల్ల హైకోర్టు కేసురికార్డులను పరిశీలించునట్టు పరిశీలించుచు శ్రీ వేపా రామేశముగారు నావాదము సత్యమయినదని, ప్రతివాదము శ్రుతిమించి యసంబద్ధముగా, సత్య దూరముగా నున్నదని గుర్తించి, నా నౌకరికి కీడు దేఁజూచుచున్న వారి దురుద్రేకమునకు రోసి శ్రీ బయ్యా నరసింహేశ్వర శర్మగారితో నొకనాఁ డు ముచ్చటించిరి. రంగాచార్యులుగారు నా కభయము చెప్పిరి. ట్రాన్ల్సేటరు ఆఫీసువారు నా మీది నిందును దొరతనము వారికీ తెలుపునంతటి స్థితికి వచ్చెను. ఇంతజరిగిన తర్వాత డొక్కచెదిరి యందాక నాకు ప్రతికూలముగా నున్నవారొకరు లైబ్రరి వ్రాతప్రతులపాఠముల నెల్ల శసిరేఖ పత్రికలొ ప్రకటించిరి. అవి నాప్రకటించిన తీరునే నిరూపించెను. మఱియు కాకినాడలో కార్చెర్ల శ్రీనివాసరావు గా రనువారు పావులూరి గణితపు తాలూకు ప్రతుల సంపాదించి యందలి పాఠములను శ్రీ పోలవరం జమిం దారుగారు, దురిసేటి శేషగిరి రావుగారు వగైరాల సంతకములతో ప్రకటించిరి. అవి యెల్ల నేఁ జెప్పినట్లే యుండెను. అంతతో నా వివాద మడఁ గారెను.

ఒకనాఁడు-" నార్తరన్ సర్కార్సు అసోసియేష౯" మిటింగు (యునివర్సిటీ కాన్వ కేష ౯ తర్వాత )జరుగుచుండఁ గా నే నక్కడి కేగితిని. అచ్చటికి వచ్చియుండిన వీరభద్రరావుగారు నాయెడ వర్తించిన తీరునకు పశ్చాత్తాపము వెల్లడించిరి. మిత్రుల మయితిమి. ఆనాఁ టి సభలో మా పద్యములు పదింటిదాఁ క జదువుటయ్యెను. ఆ యేడే శ్రీ శొంఠి రామమూర్తిగారు గొప్పగా పరీక్షలో కడతేరి యింగ్లండుకు వెళ్ళు యత్నములో నుండిరి. నా పద్య మొకటి-

ఆంధ్రు లత్యంత దేహబలాడ్యు ల నెడు
కీర్తి హెచ్చెను మన రామమూర్తి వలన
ఆంధ్రు లత్యంత బుద్ధిబలాడ్యు ల నెడు
కీర్తి హెచ్చెను మన రామమూర్తి వలన.

వీరభద్రరావుగారు నాఁ డట్లు పశ్చాత్తాపము వెల్లడించిరే కాని కొన్నేళ్ళ తర్వాత మరల నాయెడ వికటము గానే వర్తిల్ల సాగిరి. శ్రీ నాధుని గూర్చి, ఇంకే వేవో విషయముల గూర్చి సత్యదూరము లయినవే కాక దూర్తములు నయిన రచనముల నాయెడ జరపిరి. వాని కెన్నఁ డు గాని వారికి నేను బదులు వ్రాయఁ దలఁ పలేదు. శ్రీవీరేశలింగముపంతులుగారు పరమపూజ్యులు, మహనీయులు నయ్యు నహమిక, మమకారము నధికముగాఁ గలవా రని తర్వాత తలఁపనయ్యెను.

నిరుపమాన మహామహిమోపేతులు పురుషోత్తములు గంధిగారు పెర్వెలసినపిదప మానవమర్యాదయే యసాదారణ యోగ్యత నందుకొనఁ గల్గెను. వారి శీలజ్యోతిముం దంతకు ముందు పెర్వెలసిన పెద్దల ప్రకాస్తు లెన్నో వెలవెల లాడ వలసిన వయ్యేను.

శ్రీ లక్ష్మణరావుగారు వీరేశలింగము పంతులుగారి నొక నాఁడు ప్రాచ్యలిఖిత పుస్తక శాలకు గొనివచ్చి - వారప్పుడు కవుల చరిత్రను సంస్కరించి ప్రకటింపఁ బూనియున్నారు గాన- వారి కస్మదాదుల సహాయము లభింపఁ జేయుటకై జతనము సాగించుటలో న న్నెఱుక పఱచిరి. పావులూరి మల్లన చరిత్ర విషయములు వీరేశలింగము గారి దగ్గఱ, నా దగ్గఱ చర్చించి తత్త్వము నిర్ణయింప నభిలషించిరి. అన్ని వ్రాఁత ప్రతులను జూపినా వాద మెఱిఁగించితిని. వీరేశలింగము గారికి వేఱువిధముగా, పూర్వ ముతాము వ్రాసిన తీరుగా సమర్ధింపనయితిగాదయ్యెను. లక్ష్మణరావుగారు జాగ్రత్తగా నెల్ల విషయము మరల ననువదించి ' మి రిఁ క నిట్లు మార్చుకోవలసినదే. తొలుత వ్రాసినదియు సరికా దని స్పష్టపడినది' అనిరి. పంతులుగారు ' నా దగ్గఱ వ్రాఁ త ప్రతి యేదో ఉండు టఁ బట్టియే యట్లు వ్రాయటయ్యెను. రాజమహేంద్రము వెళ్ళి నా దగ్గఱి గ్రంధములఁ బట్టి మరల పర్యలోచించి నిర్ణయింతును' అనిరి. లక్ష్మణ రావుగారు' ఇన్ని పత్రులలో నున్న దానికి విరుద్ధముగా మి వ్రాఁ త ప్రతి యుండదు. ఉండినచో ససిగా సమర్ధముగా మి వాదము నిర్వహించు కోవలసి యుండును 'అనిరి.' పంతులు గారి పట్టుదల పరిభావించుచు వీరేశలింగము గారికి మన మందఱము సహాయము చేయుదము. వారిచేతనే కవుల చరిత్ర సంస్కరణము జరపింతము' అని లక్ష్మణరావుగారు చెప్పిరి.నా చేతనయినంత తోడ్పాటు జరపుదు నంటిని. వా రిర్వురు నింటికి వెళ్ళిరి.

అటనుండి వీరేశలింగము పంతులుగారు బెంగుళూరు కొలఁది దినములకే వెళ్ళిరి. కవుల చరిత్ర ప్రధమ భాగమున మాత్రము చేయవలసిన సంస్కరణములు నే నెఱిఁగినంత బెంగుళూరికి వ్రాసి పంపితిని. అది యొక పెద్దకట్ట పంతులు గారు వాని నుపయోగించుకొనిరి. కాని వాని నా యాపట్టులందు పెర్కొననే లేదు సరికదా! గ్రంధ పీఠికలో- 'శాస్త్రి గారును . . . తమ గ్రంధాలయములో నున్న పుస్తకభాగములను పద్యములను నేను కోరినవానిని వ్రాసి నా కెంతో తోడుపడిరి' అని వ్రాసిరి. వారి కేయే విషయములు కావలసి యుండునో వానిని నేనే తెలిసి, లిస్టు వ్రాసి, సంస్కరింప వలసిన చేర్చ వలసిన విధానములు, పద్యములు వ్రాసి పంపఁ గా ఆ విషయము నిట్లా స్మరించుట? సంస్మరణమున ఫలాని ఫలాని పద్యములను, గ్రంధములను వ్రాసి పంపవలసినది గా వారుకోరగా నస్మదాదులము వ్రాసి పంపినట్టు లర్ధమగును. నే నన్న వాస్త వార్ధమును దేవచ్చును. ఇంతే కాక తమకు చిరమిత్రు లయిన శ్రీ మానవల్లి రామకృష్ణ కవిగారిని గూడఁ జెనకిరి ప్రబంధ రత్నావాళిని గూర్చి యకారణముగా వారి కవుల చరిత్ర పీఠిక లోనే మరల నన్నును జెనకిరి. వాని నెల్ల వివరించుట రోఁత నేను జాబుల నిటీవల నేను చింపివేయబోగా తాము జాగ్రత్తగా నంచుకొందుమని నా మిత్రులు గయికొనిరి.

ఇంత యెందుకు వ్రాసితి ననఁగా నాకు వాజ్మయ రంగమున క్రీడా వినోద మనుభవింపవలెనని కొండంతకోరిక చెలరేగుచున్నను, ఆదినుండి కూడ దాని కభ్యంతరములు,ప్రతి షేధములు తఱచుగా నడ్డు దగులుచు నిరుత్సాహము గొల్పుచున్న వని తెల్పుటకు. ఆ నాళ్ళలో ప్రతివాదో త్సాహము నాలో కొంత దూకులాడుచునే యుండెడిది. అయిన నేమి? స్వర్ణ కారుఁడు సువర్ణ జతములను గరఁగించుటకై తనముందు నిప్పులకుంపటిని నడుమ నంగారములు చేర్చి, దాని పై కుండమూకుటిని నెలకొల్పి, కుంపటినిండ నుముక నించి యుంచుకొనును. వలసినప్పు డంగారముల గొట్టముతో నూఁ ది యగ్ని ప్రజ్వలనము కలిగించుకొనును. ఆ యగ్ని కుండమూకుటి మూఁ తకు లోబడి యే మండ నిచ్చును గాని పైకి ఉముకలోని కెగఁ బ్రాకనియ్యడు. అదినలువైపుల నుముకలోనికి వ్యాపింపజోచ్చినప్పుడు చుట్టును నీరు వోసి చల్లార్చును. ఆదినుండి నా స్థితి యించు మించుగా నట్లే సాగినది. బ్రదుకు సాగిం చుకొనుటకు వాజ్మయసేవ సాధనముగా నా కేర్పడినది గాన, అందులో అరకుడుపు సాగునట్లు పని చేయుటకే నా యంతర్యామి నన్ను మెసల నిచ్చినది గాని యంత కెక్కువగా సాధించుటకు గాని నాకు చోటియ్యకే పోయెను.


--- ---