Jump to content

ప్రజ్ఞా ప్రభాకరము/ఔషధసన్యాసము

వికీసోర్స్ నుండి

౨౦

ఔషధసన్యాసము

అప్పడు మరల నంజుండరావుగారిని చూచితిని, ఆయన తిట్టి చివాట్లు పెట్టి నీవు బ్రదుకఁదలచుకొనిన నిక నెవ్వరి యొద్దను మందులు పుచ్చుకోనక స్వాస్ధ్యము కలుగుత కేండ్ల పా టయినను నూరికి వెళ్ళి యింటిదగ్గఱనె ఉంది పొమ్మని నిర్భందించెను. ఏవేవో మందు లిచ్చెను గాని యవి కూడ పని చేయలేదు. తలమీద పాము పొల సూడినట్లు తోలుపోడ లూడసాగెను. స్వగ్రామమునకు వచ్చివేసితిని, చల్లగా ఆహారము గోనుచుండగా నుండగా కొన్ని నెలలు కామంటలు కొంత తగ్గినవి, తొట్టె స్నానములు చేయ నారంభించితిని, కొన్నాళ్ళ కది కొంత యుపకారక ముగా నున్నట్టుండెను.

అప్పడే నానోట 'ఔషధసన్యాస' మన్న పలుకు పదింబదిగా రాసాగెను. ఇక చచ్చినా సరే! ఏమయినా సరే! మందులు పుచ్చుకోరాదు అన్న సంకల్పము ప్రబలముగా తోచసాగెను. తెలియని శరీరంతర తంత్రములను సరిగా నెఱుఁగక, ఔషధీగుణములు, నందు ననేకౌషధులు మిశ్ర మయిన మందుల గుణములు సరిగా నెఱుగక, వ్యాధి నిదానము సరిగా నెఱుగక యరకొఱయెఱుకతో గ్రుడ్డియెద్దు చేన బడ్డట్టు సాగుచున్న భేషజతంత్రముతో నింక చిక్కు లందరా దని నిశ్చయించుకొంటిని, ఇంత వ్యాధి యున్నను దినములు, వారములు, నెలలు, ఏండ్లు నిద్ర లేక బాధ పడుచు సర్వవికారములతో నున్నను నా మనస్సుమాత్రము తార్మారు కాక, ప్రజ్ఞ చెడక, జఞపకశక్తి చెదరకసరిగానే ఉండెను, కాని స్ధిరముగా కూర్చుండి అరగంట సేపయిన చదువుట మొదలయిన మనః పరిశ్రమ చేయజాల కుంటిని, పదిదినముల కొకతూరి తీవ్రముగా చాలగా అదోమార్గమున వెడలుట, నాలుగు మూడు రోజులు కొంత శాంతిగా నుందుట, మఱల కడుపులో మంటలు , తాపము , నిద్రలేమి ఇత్యాదులు చెల రేగుటగా నుండెడిదిచాలని చప్పని యాహారమే, తొట్టె స్నానమేనాకు గొంత శాంతి కరముగా నుండె డిది, ఆ తొట్టె స్నానములు చేయుట మూలమున ఆముదము పుచ్చుకొనుట క్రమముగా మానివేసితిని.

ప్రతిదినము ఆంధ్రపత్రిక చుదువుచునే యుంటిని. యుద్ద వార్తలు తెలిసికోనుచునే యుంటిని, దానిని చదువ కుండ నుండ లేను, నేటికి నంతే చదివియు నుండలేను, చదివినచో యుద్దమారణము లను భూయమనములుగా నుండేడివి, చదువకున్నచో యుద్దమున నేమి జరగుచున్నదో తెలియదాయెగా యన్నవ్యధ కల్గెడిది. పగల పండ్రెండు గంటలే కాక రాత్రి పండ్రెండు గంటలుకూడ నిర్వ్యాపారముగా మెలకువతో, వ్యాకులతతో నింటిలో కొందఱ కేని యతృప్తితో నితరులు గుర్తింపరానంత తీవ్రవ్యాధితో సంక్షోభపడు టాయెను, కొని రాత్రులందు సన్నని తెర గప్పినట్లు నిద్రపోకుండేడి దేమోకానీ చీకటి వేసినను కనులు తెఱచునంత తేలికగా నుండెడిది, దాని జూచి మా వారు కొందఱునిద్ర కొంత ఉన్నదనుచుండిరి.

అప్పటి నా తలపులలో నొక్కటి. ఏ పుణ్యాత్ముడేని ' ని విట్టి పాపకర్మము చేయుటచే ని వ్యాది ఏర్పడినది క్లోరోఫారంఇయ్యకుండ ఖడ్గముతో నీ కుడిచేతిని ఠస్సని నఱెకి వేయుదును. దానికి సమ్మతింతు వేని, ఆబాధకోర్వ గల్గుదు వేని, తర్వాత ని కుడి చేతి లేవడి కిష్టపడుదు వేసి, చేతి నఱెకు మానదగినన్నాళ్ళకు ని వ్యాధి కూడ మాన్పింతును. చేతినిఱకువల్ల నీ కపాయము రాదు, అంతట నీ కర్మతీరును' అన్నచో తక్షణమే అందుకు సిద్దపడగాలను అనుకోనుచుండెడి వాడను. అంత తీవ్ర మయినది నాబాధ. ఇట్లితరులతోను చెప్పచుండువాడను క్షణక్షణము మరణయాతనయే. ' దిన దిన గండము' అనుకొనువాడను. ఆప్తె మాట 'వేయ్యేండ్లా యుస్సు' లోలో నెక్కడో తోచుటే కాని గుండెలలో వాక్యాకృతికి దానిని దెచ్చుటకు నోట నుచ్చరించుటకు దుఃఖించెడివాఁ డను! దినదిన గండముతో వేయేండ్లాయు స్సెందుకు? వేయేండ్లు కాదు. వేయి గంటలలయినను నెందుకు? అని బౌద్ద మతమువారు చెప్పుకోను పలుకులు " సర్వం దుఃఖం దుఃఖమ్ " " సర్వం క్షణికం క్షణికమ్" ' సర్వం స్వలక్షణం స్వల క్షణమ్ అనువాని రేధము సదా అనుభూతి కందు చుండెడిది. ఆ పలుకు నాల్కమిఁద మెదలుచుండెడిది.

చిన్ననాఁట నుండియు భవభూతి యుత్తర రామచరిత్ర మన్న నాకు పరమానందము. అందులో పలుకులు 'జగజ్జిర్ణరణ్యమ్ . . . కూకులానాం రాశౌ తదను హృదయం పచ్యత ఇవ' అన్నవి సదా నా తలఁపులో మెదలుచుండెడివి. ' జగజ్జిర్ణరణ్యమ్' అనుటకు గొప్ప వివరము కాన వచ్చెడిది. అరణ్యమేని, అందు ఛాయా ఫల పుష్ప వృక్షములు, లతా గుల్మములు, జలాశయములు, పక్షికలకలములు, దృశ్యజ్మతు విహారములు, మనుష్య సంచారము నుండును ముండ్ల పొదలు, వ్యాఘ్రు దు ఘుతక జంతువు, సర్ప, వృశ్చిక, వృక్షాదులునున్నాను నుండును గాని పుష్పఫలాదులకై యందు ప్రవేశించువారు- కంట కాద్యపాకరణ సాధనములఁ గొని నిరపాయముగా కార్యము నిర్వర్తించుకొని రాఁ గలరు. జిర్ణారణ్యమున ఛాయా ఫలపుపుష్ప వృక్షము లుండవు. జలా శయము లుండవు. లతాగుల్మము లుండవు. ఎండు టడవి. రక్కెస మట్టలు, చీకి రేను పొదలు, పాములు, తేళ్లు, తోడేళ్లు మొదలగునవి మాత్రమే ఉండును. కర్మవశమున త్రోవ తప్పి యెవఁడే నందుఁ జేరానా వాఁ డక్కడ కడతేర వలసిన వాఁడే యగును. జగ త్తొక జిర్ణారణ్యముగా, దుర్విధిచే నే నందు చేరినట్టుగా భావించెడివాఁ డను.

--- ---