Jump to content

ప్రజ్ఞా ప్రభాకరము/వెలుఁగునీడలు

వికీసోర్స్ నుండి

౨౧

వెలుఁగునీడలు

భవభూతిపునరుక్త మయిన యీశావస్యోపనిషద్వాక్యము " అసుర్యానామ తేలోకా అంధేన తమసావృతాః, తాం స్తే ప్రేత్యాభిగచ్చన్తి యేకే చాత్మహనో జనాః" అన్నది యాత్మహత్య సంకల్పజ్వాలలను జలార్చి వేయు చుండెడిది. కడుపసిప్రాయమున కనులు మూసికొని బోరగిల పడుకొని చూచుచుండినపుడు నేను "నే నని" నాలో గోచరించిన మినుకు గ్రుడ్డి వెలుఁ గే దూరమున గోచరించి జీవితాశోచ్చ్వాస మాడించుచుండెడిది.

మందులు మానితిని గనుక మావారు మంత్రముల కేసి దృష్టి సారించిరి. వారిని వీరిని పిలిపించి మంత్రజపము చేయింప నుద్దేశింపఁగా నేను వారింపఁ జొచ్చితిని. యా మంత్ర ప్రయో క్తల యోగ్యతలు నే నేఱిఁగినవే. కనుక వారిని బిలిపింప నొల్లనయితిని. నా యనారోగ్యమును నన్నడిగి విద్వాంసుఁడు గదా యని నేను చెప్పఁగా విని వేద శ్రౌత విద్వావిశారదుఁ డొకఁ డు ' ఏఁ బది రూపాయలు తెచ్చుకొని నా కిచ్చితి వేని నీకు మోహిని పట్టినది. దానిని తొలఁగింప గలను ' ఇత్యాదిగా నేదో చెప్పెను. ధిక్కని తెగడితిని. అనుదినము సహస్రగాయత్రి మంత్ర జపము చేయుచు నమాయ కుఁడుగా నందు వృద్ధ బ్రాహ్మణు నొకని- ఆయన కుమారుఁడు మాయూర స్కూలు మేష్టరుగా కొన్నాళ్ళుండెను - బిలి పింప నుద్దేశింపఁ గా నేను వెళ్ళే యంటిని. వానిని గ్రామాంతర మున నుండి పిలిపించిరి. నలువది దినములు మంత్రజపమాయన జరపెను. ఆయన వల్ల నా కేమాత్రము మేలు జరుగ బోదని నేను బిగ్గ పలుకుచుండెడి వాఁడను. వీనికిఁ పట్టిన గ్రహ చారమో, గ్రహమో ఉపకారకము లయిన పద్ధతుల పై వీనికి విశ్వాసము కుదురు నీయ కున్నదని మా వారు తెగడఁ జొచ్చిరి." నిజమే! నా కిట్టివారి ప్రజ్ఞ మిఁ ద విస్వాసను లేదు. అదే నా జబ్బు అనుచున్న వారు మిరో వారో కొల్పుఁడు' అనువాఁ డను. నలువది నాళ్ళయిన తర్వాత జల ఫలము నాకు ధారాద త్తము చేయుటకు గొప్ప బ్రాహ్మణ సంతర్పణము జరపిరివృధా ధనవ్యయ మని నేను వగవఁ జొచ్చితిని. ఇట్టి చీకాకు లెన్నో పడితిని. వేనివల్ల గాని నాకు మేలు జరగా లేదు. తొట్టె స్నానము, ఉప్పుకారములు లేని భుక్తి ఒక మాదిరిగా చేయుచునే యుంటిని.

మద్రాసులో నా స్థానమున నియుక్తులైన విద్వాంసులు హఠాత్తుగా అంతరించిరి. చలి జ్వరము నూట యాఱుడిగ్రీల పై చిలుకు వచ్చి ఆ తర్వాత ఔషధము నిరుప యోగము కాఁగా పుణ్యలోకముల కరిగిరఁ ట! మా ఆఫీసు క్యురేటరు శ్రీ కుప్పు స్వామి శాస్త్రిగారు నాకు డి. ఓ. వ్రాసిరి .' నీవు వచ్చి డ్యూటిలో చేరుట మంచిది. నీకు తొందర కలుగకుండ దేశాటనము చేయ నేర్పాటు చేయుదును. రావలసినది' అని. ఆవత్సరమున ఆంధ్ర సాహిత్య పరిషత్తు సంవత్సరోత్సవము గుంటూర జరగెను. నేను చాల గౌరవించు వేదము వెంకటరాయ శాస్త్రిగారి యాద్యక్షము మిత్రులు శ్రీ రామకృష్టకవిగారు నన్ను మద్రాసు రాఁ గోరి జాబు వ్రాసిరి. గుంటూరఁ గలసికొందు నని బదులు వ్రాసి యట్లె గుంటూరు వెళ్ళితిని. నేను మాటాడినది, చేసినది ఏమియు లేదు. అయినను ఆయుపన్యాసము వినికిడికి, ఎండలకు తాళఁ జాలక పోయితిని. మిత్రులు కనుపర్తి మార్కుండేయశర్మ గారి యింట విడిసి, తొట్టె సాన్నము చేసి కొంత స్వస్ధ్యము కూర్చు కొంటిని.

మిత్రుల ప్రోద్బలమున మద్రాసు వెళ్ళ నిశ్చయించు కొంటిని. ఇంటికి వెళ్ళి తగిన యేర్పాట్లతో నే నొక్కఁడనే బయల దేరితిని. ఆప్తులు, బంధువులు మంగళగిరి నరసింహ స్వామి దర్శనము చేసి పొమ్మని నిర్బధించిరి. భక్తిభరితముగా సంకీర్తనముల పాడఁ గల బ్రాహ్మణుఁ డొకఁడు నాతో వచ్చెను. మంగళ గిరి వెళ్ళితిమి. అక్కడ బాలాంబగా రను మహానియురాలు మా కాతిద్య మిచ్చెను. పానకము మొదలగు నైవేద్యములు చేయించితిమి పానక మారగింపు చేయించు నప్పుడు వెండి కవచములో నున్న మూర్తి తీరును గూర్చి నాకు యోచన. దానిని వెల్లడింపఁ గా దైవ పరిక్ష వలదని యక్కడి వారు నాకు హిత ముప దేశించిరి. స్వామి కేదో చెల్లింపఁ దలఁ చుకొంటిని గాని చెల్లింపలేదు.అది శ్రీ బాలంబ గారికి సమర్పింపఁ గోరిక ఈయబోగా నప్పుడా మెగారు ' మా యింట నాతిధ్యము గొని మి రేదో యిప్పు డిచ్చుట పూట కూళ్ళయింట నిచ్చిన ట్లగును. తర్వాత మీరు మీ గంతవ్యస్ధలము చేరి యే దేని పంపుదురు గా' కనిరి.

మద్రాసు చేరితిని. ఆఫీసు డ్యూటిలో ప్రవేశించితిని. అప్పుడు మిత్రులు కొంద ఱుం డుటచే సముద్ర తీరమున బక్కింగ్ హామ్ లాడ్జిలో నుంటిని. జనార్దన్ అను పుణ్యాత్ముఁడు హొటలు ప్రోపైటరు నాకు మిత్రుఁ డు. ఆతని హొటలులో భోజనము. డ్యూటిలో ప్రవేశించిన పదిరోజులకే అయిదు రోజులు కాషుయాల్ లీవు పెట్టితిని. రాత్రులందు నిద్ర రాదు. కడుపులో మంట. శరీరము తాపము. తీవ్రమయిన యశాంతి. అప్పుడు నా బాల్యమిత్రము శ్రీ రాయప్రోలు సుబ్బారావు గారు కూడ నాతో నుండిరి. వారి తోడ్పాటుతో డాక్టరు లక్ష్మీ పతిగా రింటి కేగితిని. ఆయన సరిగా వ్యాధిని గుర్తించి కాని మందిచ్చు వారు కారు. ఎక్కువగా మందులు వాడక ఆహారవిహరాదుల చేతనే శక్య మయినంతవఱకు వ్యాధి నివారణ చేయఁ జూతురు. ఆయన కూడ నాకు చిర మిత్రము. నా వ్యాధి చరిత్ర మంతయు విని నరముల యుద్రేకము తగ్గుట కేదో మందు (బ్రొమైడు) ఇచ్చిరి. అది పుచ్చుకొనఁ గా ఒక రాత్రి నెమ్మదిగా నున్న దిగాని మర్నాడు శరీర మంతయు పట్లు విడిపోయిన ట్లయి లేవలేని స్ధితికి వచ్చితిని. ఆ మందు మాని వేసితిని.

ఇక నౌకరీ దుష్కర మని నిశ్చయించుకొంటిని. అప్పటికే క్యూరేటరుగా రిఁక నీతఁడు సెలవు కోరినచో డిస్మిస్ చేసి యింటికిఁ బొమ్మన వలసిన దే అని రెణ్ణాళ్ళకు ముందటి సెలవు చీటి మిఁద వ్రాసిరి. వ రందాఁ క నెంతో యోర్మితో నన్ను నెలకొల్పుకొనఁ జూచిరి. లాభము తోఁప దయ్యెను. నాకును దిక్కు దోఁప దయ్యెను. బలవంతమున శరీరమును, నరముల శక్తిని ఎగసన ద్రోసికొని స్నానము చేసి హొటలుకు వెళ్ళితిని. నేఁటితో నౌకరికి నీళ్ళు దోడు కొనకవలసినదే! ఇట్టి స్దితితో ఇంటికి మరల వెళ్లుట బ్రదికియుండియుఁ జచ్చుట యగును. చేత నున్న సొమ్ముతో హరి ద్వారమునకు టిక్కెట్టు తీసికొని (టిక్కెట్టు కే చాలినంత ధన మున్నది కాన) మార్గమున నుపవాస మే చేసి ఏ దేని యాహార మెవ్వరి వలన నేని యాయుచితముగా లభించిన నారగించి మహా ప్రస్ధాన కల్పముగాఁ బోయి గంగానదీ ప్రవాహములోఁ గల యుదును గాకాని నిశ్చయించుకొంటిని. ఆత్మాహత్య యసుర్య నరక ప్రాపక మన్న చింత రేగెఁగాని పండ వాదుల మహా ప్రస్దానము పాపాపాదకముగాఁ గాక పాపాపనోదకముగాఁ జెప్పుబదుట గోచరించి సమాధి గూర్చెను.

క్యూరేటరుగారు డిస్మిస్ చేయునందాఁక నెందుకు? నేనే రిజిగ్నేష౯ చీటి పంపుదునుగా కని నిర్ణయించుకొని అట్టి చీటి వ్రాసి చేత నంచుకొంటిని. తొమ్మిదిన్నర గంటలకు భోజనము చేసి నౌకరి చెల్లు చీటిని నాతో పాటు నౌకరిలో చేరిన వాఁడు, నా యనరోగ్యమునకునాకంటె దుఃఖించుచుండువాఁ డు నగుమాస్తా యింటికి వెళ్ళి యిచ్చి వేయ నిశ్చయించు కొంటిని. హొటలుకు భోజనమునకు బోగాజనార్దనుఁడు జబ్బుగా నంటి నని నాకై ప్రత్యేకముగా కారము లేకుండ చాల రుచ్యముగా కూరలు, పచ్చళ్ళు చేయించెను. ఆతఁడు మామూలుగానే చేయించె నేమో కాని నాకు మాత్రము నాఁటి భోజనము కొన్ని యేండ్లకు పూర్వ మెప్పుడయిన చేసియుందునో లేదో అన్నంత రుచ్యముగా నుండెను. కడుపార నారగించితిని. శరీరమున కుత్సాహము తోఁచెను. నరముల బలము చక్కబడినట్లయ్యెను.' నేఁ డాఫీసుకు పోయి పని చేయగల్గుదునా? జబ్బు కుదురునా? నేఁ డీ యుత్సాహ మేమి? ఏమో! డ్యూటిలో నుండఁజాలను. హరిద్వారము వెళ్ళ వలసినదే! గంగలోఁ గలయుట మాట అక్కడ నిర్ణయించుకొందును గాక!' ఇత్యాది విధముల యోచనలతో అక్బరు సాహెబు వీధిలో వచ్చుచుంటిని.

--- ---