ప్రజ్ఞా ప్రభాకరము/అనారోగ్యము
౧౯
అనారోగ్యము
అప్పటికి ప్రాచ్యలిఖిత పుస్తకశాలలో నాకు మంచి వేతనాభీవృద్ది ఏర్పడేను. మాధరను రాష్ట్రమంతటను ప్రాచీనగ్రంధములను సంపాదించుటకై కొంద ఱుద్యోగులను ప్రభుత్వమువారు నియమించిరి. అందు నన్నొక ముఖ్యునిగా నియోగించిరి, నేనందు ప్రవేశించితిని, కాని యీ యనారోగ్యముచే సెలవు పెట్టవలసినవాడ నయితిని ఆ గ్రందార్జన కార్యము పెక్కేండ్లు సాగునదే యయినను ఆ యుద్యోగముల టెంపోరరిగానే ఏర్పాటు చేసిరి, ఆ టూరింగు పార్టి కార్యకలాపము తోడ్తో ప్రారంభింపవలసినదిగా నుండెను నేను దిర్ఘనారోగ్యగ్రస్తుండ నగుచుంటిని కావున నన్ను తోలగించి యా యుద్యోగము నింకోకరి కిచ్చిరి, నేను పర్మనేంటు పోస్టుకే రివర్టయితిని సెలవు గయికోంటిని గనుక యింటికి వెళ్ళితిని మూడేండ్లు బాధపడితిని.
మదరాసులో నుండగా మార్చిమార్చి నంజుండరావు గారు పెక్కుమందు లిచ్చిరి, ఎన్ని యిచ్చినను గుణము కనుపడద య్యెను. ప్రత్యుత ఔషధము గయికొన్న యా పూటనే అది యనారోగ్యము నదికపఱెచునదిగా నగుచుండెను. 'ఔషధము లట్టెవలదు. శానిటోజన్, మాత్రము ఆహారముగ తిసికోనుచుండు ' మని నంజుండ రావుగారు చెప్పిరి ఇంటికివచ్చిన తోల్తటి దినములలో నది కొన్నాళ్లు తీసికొనసాగితిని. ఒకనాడు రాత్రి భోజనానంతరము శానిటోజన్పాలతో తీసికొన్న కొంతసేపటికే శరీరమున నరము లెల్ల క్రమము తప్పి ఎక్కువగా బిట్టుబిగించి యాడించివిడిచిన ఫిడేలు, విణతంత్రులవలె కదల్సితే కదలితే త్రుటితములయి పోవునట్టదరుపాటుతో సంకట పెట్టసాగెను. మంచము మీద నుండి యదిలించి ఎగగొట్టి క్రింద పడవేయు చున్నట్లు కాజోచ్చెను. ఆ రాత్రి యెల్ల నిద్ర లేక చాల బాధపడితిని, శానిటోజ మానివేసి చల్లని భోజనము చేయుచుంటిని, రాత్రులందు క్రమముగా కొంతసేపు నిద్ర పట్టసాగెను.
అప్పటికే రేన్నేల్లో మూన్నేల్లో కయికొన్న సెలవు ముగిసెను. దినదినము ఆంధ్రపత్రిక చదువుటలో నందు చదివిన యుద్దతివ్రతలు నన్నల్లు కల్లోలపఱచుట చెల రేగుచునే యుండెను. అయినను మా వాళ్ళలో కొందఱుజ్వరమూ తలనొప్పా, ఆకలి లేకపోవుటా, ఏ జబ్బు లేదు పిఱికితస ముతో ఇంట గూర్చున్నాడని నిందించుట నాకు దుస్సహముగా నుండెను, మా తల్లిదండ్రులు, అక్కగారు, భార్య ఏమియు ననజాలక దుఃఖించుచుండిరి, సాహసించి నే నోక్కడనే మద్రాసు వెళ్ళి డ్యూటిలో చేరుదును గాకని బండిమీద బందరు వచ్చితిని, ఒక మిత్రునింట నానాడుంటిని, గురువులగు శ్రీ వెంకటశాస్త్రిగారిణి దర్శించితిని వారితో, వారికి నాకు మిత్రుఁడును, డిగ్రీలు లేకున్నను ఆంగ్లవ్తెద్యము చేయుచు ప్రఖ్యాతుఁడుగా నున్నవాడును నగునొక వ్తేద్యని జూడ నరిగితిమి. అతడు నంజుండ రావుగారి మందుల ప్రిస్క్రిప్షన్ లు చూచి 'ఇవి చాలా తేలిక డోసులో నున్నవి' యని వానిలో ప్రధానౌషద మొకటే నరములకు బలము గొల్పు నని, అది యొక సీసా పుచ్చు కొమ్మని చెప్పెను, అప్పడే దానిని గొని కయికొని మద్రాసు వచ్చితిని.
అది పుచ్చుకొన నారంభించి డ్యూటిలో జాయి అయితిని, రెండుపూటలాకే అది యొడలెల్ల మంట లెత్తించి నిద్ర పట్టనియక నరముల బిఱ్ఱ బిగించి యడరి పదున ట్లేగుర గొట్ట సాగించెను. 'భ్రష్టస్య కావాగతిః,అన్నట్టు అది మాని నంజుండ రావుగారిని మరల జూడజాలక ఇంకెవరేవారి దగ్గఱనో మంచి డాక్టర్ల దగ్గఱనెమందులు గయికోనం నారంభించితిని, అవి మఱి మఱి గగ్గోలు పఱచేను, తిరువాలి క్కేనిలో నాకు పరిచితుడగు నొక డాక్టరు 'ఫాస్పరస్' ప్రధానముగా గల మాత్రలు పది యిచ్చి 'ఈ పడి నిస్సంశయముగా కడముట్ట దినమునకు రెండు వొప్పన పుచ్చు కొని మఱి యగపడు ' మని చెప్పి పంపెను. మాద్రాసులోని మావారు పుచ్చుకొని తీరవలసిన దని నిర్భందించిరి, పుచ్చు కొన నారంభించి నప్పటినుండియు నోరు తాడియారిపోవుట ,రేయుంబవళ్ళసలే నిద్రలేకపోవుట, ఒడలెల్ల మంటలు మఱి యెక్కు వగుటయయ్యెను.
--- ---