పోతన తెలుగు భాగవతము/ద్వాదశ స్కంధము/మార్కండేయోపాఖ్యానంబు

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

మార్కండేయోపాఖ్యానంబు

తెలుగు భాగవతము (పోతన తెలుగు భాగవతము/ద్వాదశ స్కంధము)
రచయిత: నారయ(తెభా-12-31-క.)[మార్చు]

తొ ల్లిటి యుగమునఁ దపములఁ
' ల్లిదులగు ఋషుల మహిమ భాషింపఁగ రం
జి ల్లెడు మార్కండేయుం
'డు ల్లంబున హరిని నిలిపి యుడుగక బ్రదికెన్.

(తెభా-12-32-వ.)[మార్చు]

లోకంబులు గల్పాంతసమయంబునం గబంధమయంబులయి, యంధ కార బంధురంబులయి యున్నయెడ నేకాకి యయి చరించుచు బాలార్కకోటి తేజుం డయిన బాలుని హృదయంబునం బ్రవేశించి యనేక సహస్ర వత్సరంబులు దిరిగి వటపత్రశాయి యయిన యబ్బాలునిఁ గ్రమ్మఱఁ గనియె” నని చెప్పిన శౌనకాదులు సూతునిం గనుగొని, “యా మునీంద్రునకు నీ ప్రభావం బెట్లుగలిగె?”నని యడిగిన నతం డిట్లనియె.

(తెభా-12-33-క.)[మార్చు]

భూ వినుత! బ్రహ్మచర్యము
'దా దలక నిష్ఠచేతఁ థ్యము గాఁగన్
భా వించి హరిఁదలంచుచుఁ
'గో విదనుతుఁడై మృకండు గుణముల వెలసెన్.

(తెభా-12-34-వ.)[మార్చు]

ఇట్లుదపంబు సేయు నతనికి హరిహరులు ప్రత్యక్షంబయి “వరం బడుగు” మనిన గుణగణాఢ్యుం డయిన కుమారు నడిగిన ”నట్ల కాక” యని యతండు గోరిన వరంబిచ్చి యంతర్ధానంబు నొంది; రనంతరంబ యమ్మునికి మార్కండేయుం డుదయించి నియమ నిష్ఠా గరిష్ఠు డయి యుండ; మృత్యువు వానిం బాశబద్ధుం జేసిన నెదిర్చి మిత్తిని ధిక్కరించి, పదివేల హాయనంబులు తపంబు సలుప, నింద్రుండు భయంపడి యమ్ముని వరుని యుగ్రతపంబు భంగపఱచుటకు దేవతాంగనలం బంప, వారే తెంచునెడఁ బుష్పఫలభరితంబును; మత్తమధుకర శుక పికాది శకుం తలారవ నిరంతర దిగంతరంబును; జాతివైర రహిత మృగ పక్షికుల సంకులంబును, సారస చక్రవాక బక క్రౌంచ కారండవ కోయష్టి కాది జలవిహంగమాకులిత సరోవర సహస్ర సందర్శనీయంబును నగు నా తపోవనంబున జటావల్కలధారి యై హవ్యవాహనుండునుంబోలెఁ దపంబు సేయు మునీంద్రునిం గని యయ్యంగనలు వీణావేణు వినోద గానంబుల నలవరింప మెచ్చక ధీరోదాత్తుం డగు నమ్మునీంద్రుని గెల్వనోపక యింద్రుని కడకుం జని; రంత హరి యతని తపంబునకుఁ బ్రసన్నుండై యావిర్భవించినం గనుగొని ”దేవా! నీ దివ్యనామస్మరణంబునంజేసి యీ శరీరంబుతోడన యనేక యుగంబులు బ్రదుకు నట్లు గాఁజేయవే” యనినం గరుణించి యిచ్చుటయును.

(తెభా-12-35-తే.)[మార్చు]

'గము రక్షింప జీవులఁ జంప మనుపఁ
'ర్తవై సర్వమయుఁడవై కానిపింతు
'వెచట నీ మాయఁ దెలియంగ నెవ్వఁ డోపు?
'విశ్వసన్నుత! విశ్వేశ! వేదరూప!

(తెభా-12-36-మ.)[మార్చు]

' భిన్ముఖ్య దిశాధినాథవరులున్ ఫాలాక్ష బ్రహ్మాదులున్
' జాతాక్ష! పురంద రాది సురులుం ర్చించి నీ మాయలం
'దె లియన్ లేరఁట! నా వశంబె తెలియన్? దీనార్తినిర్మూల! యు
'జ్జ్వ పంకేరుహపత్రలోచన! గదాక్రాంబుజాద్యంకితా!

(తెభా-12-37-వ.)[మార్చు]

అని వినుతించి, “దేవా! నీ మాయం జేసి జగంబు భ్రాంతం బై యున్నయది; యిది దెలియ నానతీవలయు” నని యడిగిన నతండు నెఱింగించి చనియె, మునియును శివపూజ సేయుచు హరిస్మరణంబు సేయ మఱచి శతవర్షంబులు ధారాధరంబులు ధారావర్షంబుచే ధరాతలంబు నింప, జలమయంబై యంధకారబంధురబైన, నంత నా తిమిరంబునం గన్నుగానక భయంపడి యున్నయెడ నా జలమధ్యంబున నొక వటపత్రంబునం బద్మరాగ కిరణపుంజంబుల, రంజిల్లు పాదపద్మంబులుగల బాలునిం గని, మ్రొక్కి యతని శరీరంబు ప్రవేశించి, యనేక కాలం బనంతం బగు జఠరాంతరంబునం దిరిగి; యతని చరణారావింద సంస్మరణంబు సేసి; వెలువడి కౌఁగలింపంబోయిన మాయఁ గైకొని యంతర్ధానంబునొంద; మునియు నెప్పటియట్ల స్వాశ్రమంబు సేరి తపంబు సేయుచున్న సమయంబున.

(తెభా-12-38-చ.)[మార్చు]

'ని లిచిన శంకరుం గనియు నిత్యసుఖంబుల నిచ్చు గౌరి యి
'మ్ము హర! భూతిభూషణసముజ్జ్వలగాత్రునిఁ గంటె, యెంతయున్
' నుగ వానితోడ నొక వాటపుమాటను బల్కఁగాఁ దగున్
' లితమైన యీ తపసి జాడ వినంగడు వేడ్క యయ్యెడిన్.

(తెభా-12-39-వ.)[మార్చు]

అనిన శంకరుండును శాంకరీసమేతుం డయి నభంబుననుండి ధరణీ తలంబునకు నేతెంచి యితరంబు గానక యేకాగ్రచిత్తుండగు నమ్మునిం గని తన దివ్యయోగమాయా ప్రభావంబుచేత నతని హృదయంబునం బ్రవేశించి చతుర్బాహుండును, విభూతి రుద్రాక్షమాలికాధరుండును, ద్రిశూల డమరుకాది దివ్యసాధన సమేతుండును, వృషభవాహ నారూఢుండును, నుమాసమేతుండునై తన స్వరూపంబు గనంబఱచిన విస్మయంబునొంది యమ్ముని యా పరమేశ్వరుని ననేక ప్రకారంబుల స్తుతియించిన, నప్పు డమ్ముని తపఃప్రభావంబునకు మెచ్చి “మహాత్మా! పరమశైవుండ” వని పరమేశ్వరుం డానతిచ్చిన మార్కండేయుండును శంకరు నిరీక్షించి, “దేవా! హరిమాయాప్రభావంబు దుర్లభం; బయ్యది భవత్సందర్శనంబునం గంటి; నింతియచాలు; నైన నొక్కవరంబు గోరెద; నారాయణచరణాంబుజ ధ్యానంబును, మృత్యుంజయంబునుం గలుగు నట్లు గాఁగృప సేయవే” యని ప్రార్థించినఁ గృపాసముద్రుండై “యట్లగాక” యని “జరారోగవికృతులు లేక కల్పకోటి పర్యంతంబు నాయువుం, బురుషోత్తముని యనుగ్రహంబుఁ గలుగు” నని యానతిచ్చి యమ్మహాదేవుం డతర్ధానంబు నొందె” నని చెప్పి యీ మార్కండేయోపాఖ్యానంబు వ్రాసిన వినినం జదివినను మృత్యువు దొలంగు నని మఱియు నిట్లనియె; హరి పరాయణుం డగు భాగవతుండు దేవతాతంర మంత్రాంతర సాధనాంతరంబులు వర్జించి, దుర్జనులం గూడక నిరంతరంబు నారాయణ గోవిందాది నామస్మరణంబు సేయుచునుండె నేని నట్టి పుణ్యపురుషుండు వైకుంఠంబున వసియించు; మఱియు హరి విశ్వరూపంబును జతుర్విధ వ్యూహభేదంబును, జతుర్మూర్తులును, లీలావతారంబులును జెప్ప నగోచరంబు లనిన శౌనకుం డిట్లనియె.

(తెభా-12-40-క.)[మార్చు]

రికథలు, హరిచరిత్రము,
రిలీలావర్తనములు నంచిత రీతిం
రువడి నెఱిఁగితి మంతయుఁ
సు నుత! యనుమాన మొకటి సొప్పడెడి మదిన్.

21-05-2016: :

గణనాధ్యాయి 13:20, 12 డిసెంబరు 2016 (UTC)