పోతన తెలుగు భాగవతము/ఏకాదశ స్కంధము/పిప్పలాయనభాషణ

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

పిప్పలాయన భాషణ

తెలుగు భాగవతము (పోతన తెలుగు భాగవతము/ఏకాదశ స్కంధము)
రచయిత: పోతన


(తెభా-11-57-సీ.)[మార్చు]

'రవర! విను జగన్నాథుని చారిత్ర;
'మెఱిఁగింతు నీమది కింపు మిగుల
'సదుద్భవస్థితియ కారణంబయి;
'దేహేంద్రియాదులఁ దిరము గాఁగఁ
'జొనుపు నెప్పుడు పరంజ్యోతిస్స్వరూపంబు;
'జ్వాలల ననలుండుఁ నని పగిది
'నింద్రియంబులు నాత్మ నెనయవు శబ్దంబు;
'పొరయక సుషిరంబుఁ బొందు సత్య

(తెభా-11-57.1-తే.)[మార్చు]

'నఁగ సత్త్వరజస్తమోయగుణంబు
'హదహంకారరూపమై హిమ వెలయు
'చేతనత్వంబు గలదేని జీవ మందు
'రిదియ సదసత్స్వరూపమై యెన్నఁబడును.

(తెభా-11-58-వ.)[మార్చు]

దీనికిం బెక్కైనది పరమాత్మగా నెఱింగి కమలసంభవాదులు నుతియింతు; రిట్టి పరమాత్మ స్థావరజంగమంబుల నధిష్ఠించి వృద్ధి క్షయంబులం బొందక నిమిత్తమాత్రంబునం దరులతాదు లందు జీవంబు లేక తదంతరస్థుండై వర్తించు; నంత సర్వేంద్రియావృతం బైన యాకారంబు నష్టంబైన మనంబునుం బాసి శ్రుతివిరహితుం డై తిరుగుచుండు; నిర్మల జ్ఞానదృష్టి గలవానికి భానుప్రభాజాలంబు దోఁచిన క్రియను, సుజ్ఞానవంతుడు హరిభక్తిచేత గుణకర్మార్థంబులైన చిత్తదోషంబులు భంజించి భగవత్సదనంబు సేరు” ననిన విని రాజిట్లనియె.

(తెభా-11-59-క.)[మార్చు]

పు రుషుం డే యే కర్మము
' రువడిఁ గావించి పుణ్యరుఁడై మనుఁ? దా
దు రితములుఁ దొరఁగి మురరిపు
' ణయుగం బెట్లు సేరు? న్మునివర్యా!

21-05-2016: :

గణనాధ్యాయి 12:48, 12 డిసెంబరు 2016 (UTC)