Jump to content

పుట:Yogasanamulu.djvu/77

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

76

లంక సూర్యనారయణ


వజ్రాసనము వలెనే మోకాళ్ళపై కూర్చొని మోకాళ్ళు రెండింటిని కొంచెము ఎడమగా వుంచి అరికాళ్ళ (పాదముల క్రిందిభాగము) పై పిరుదులను ఆనించి కూర్చొని రెండు చేతులను మోకాళ్ళపై వుంచి గాని లేదా రెండు చేతులను భుజములకు క్రిందుగా అనించి ముందుకు వంగి వుండవలయును.

ఉపయోగములు
దీనివలన కడుపులో నున్న అపాన వాయువు నెట్టబడి మలమూత్రములు ఆయా కోశములందు చేరి ఒత్తిడి చేత బహిష్కరణ చెందును.

32. పవన ముక్తాసనము :

వెల్లికిల వీపు నేలనునట్లు పరుండి ఒక మోకాలిని ముద్దిడునట్లుగా ముఖము చేత స్పృసించునది. మోకాలిని రెండు చేతులతోను పట్టుకొని గర్భ కుహరమునకు ఒత్తి వుడవలయును. దీనిని రెండు మోకాళ్ళ తోను ఒకే సారి కూడ చేయ వచ్చును.

ఉపయోగములు
కొందరికి అపాన వాయువు బంధించ బడి కడుపులో నెప్పిని కలుగ చేయును. దీని వలన అపాన వాయువు బహిష్కరించ బడును. మలబద్ధముండదు. జీర్ణ శక్తి వృద్ధి యగును.