పుట:Yogasanamulu.djvu/193

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

192

లంక సూర్యనారయణ


మన ప్రాణము వున్నప్పటికి పంచేంద్రియాలతో మనస్సు సంపర్గము లేని యడల మనకు ప్రపంచమందలి విషయములను ఈ ఇంద్రియముల ద్వారా తెలిసికొనలేము. సంపూర్ణముగా నిద్రించు చున్న సమయమున మనస్సు అజ్ఞా చక్రమందు అనగా రెండు కనులకు మధ్యగా కొంచెము పై భాగమున హిందువు తిలక ధారణము చేయు చోటునందు కేంద్రీకరించ బడి విశ్రాంతిని పొందు చున్నది. ఆ సమయమునే గాఢ సుషుప్తి అని అందురు. ఒకొక్క సమయములోను, గాఢ నిద్రకు ముందుగాను శరీరము విశ్రాంతి తీసుకొను చున్నను మనస్సు తన వృత్తియైన సంకల్ప వికల్పములు చేయు చుండుట వలన స్వప్నములు కలుగు చున్నవి. ఇది స్వప్నావస్థ. మనకు మెలకువ వున్నపుడు మన ఇచ్చ అవసరము లేకయో ఈ ఇంద్రియములు మనసుతో సంపర్గము పొందుటచే విషానుభవమును పొందు చున్నాము. మన ప్రయత్నంతో మెలుకువగా వున్నపుడు కూడ మనస్సును నిగ్రహించి ఈ ఇంద్రియములతో సంయోగము చెందనీయక ఉప సంహరించి నిర్వ్యాపారముతో వుండుటయే ప్రత్యాహారము. అనగా యింద్రియ వ్యాపారమును ప్రతి హరించుట అని అర్థము. దీనిని ప్రాణాయామమునందు అధిక ప్రావీణ్యమును సంపాదించ గల్గినట్లయిన సాధించ వచ్చును. అనగా ప్రాణాయామము యొక్క ఫల స్థితి వలన మనస్సు ఇంద్రియముల నుండి విడదీయ గల్గుదుము.