పుట:Yogasanamulu.djvu/194

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

యోగాసనములు

193


ధారణ
.......

ఇంద్ద్రియముల నుండి ఉప సంహరించ బడిన మనస్సును ఒక ప్రత్యేకించిన కార్య మందు గాని ఒక స్థానమున గాని తన శరీరమందలి షట్చక్రములలో ఒక దాని యందు నియమించుటను ధారణ యని చెప్ప బడు చున్నది. అటుల చేయుట వలన మనస్సు ఒక క్రమ శిక్షణకు అలవడి ఉత్తమ స్థితిలో వర్థిల్లును. వికర్షించబడి వున్న సూర్య కిరణములను భూత అద్దములో కేద్రీకరించి నపుడు ఎక్కువ కాంతియు, వేడిమియు కల్గు చుండుట చేత ఆ కిరణములు కేంద్రీకరించ బడినపుడు బలము అధికంగా అగుచున్నట్లుగనే స్వేచ్చగా బహు వ్యాపకముతో వికర్షింపబడిన మనస్సు కేంద్రీకరించ బడినపుడు బహు గొప్ప శక్తిని పొందును. ఒక స్థానమున నియమించ బడుటకు మనస్సుకు నిర్విరామముగా శిక్షణ నీయవలయును. ఇట్టి వ్యాయామమునకు ఏకాంతము చాల ఉపకరించును. జనుల తోడను లౌకిక విషయంతోను సంబంధము చాల వరకు తగ్గించ వలయును. లేనిచో మనస్సు వికర్షింపబడి ఏకాగ్రతకు చాల కష్టమగు చుండును. యోగము అభ్యసించుట వలన సాధకులకు మనశ్శాంతియు మనో బలము యింద్రియ జయము కల్గునే గాని ఏ విధముగాను హాని చేయదు. యోగమును గూర్చిన సరియగు జ్ఞానము లేని వారు దీనిని గూర్చి తప్పుడు ప్రచారము చేయుట కలదు. బలము పొందిన మనస్సు వలన శరీరమున అరోగ్యము వృద్ధి యగును. సాధన అభివృద్ధియగు