Jump to content

పుట:Yogasanamulu.djvu/192

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

యోగాసనములు

191


జరుగుచుండిన ఇట్టి యోగి తన ఇష్ట ప్రకారము అన్ని కార్యములను తుదకు శరీర త్యాగము కూడ కోరినపుడు చేయ గలడు.

సాధన సందర్భములో సాధకుడు జాగ్రత్త పడవలసిన విషయములు:....

సాధకుడు స్థిర సంకల్పముతో నిర్వికల్ప సమాధిని ధ్యేయముగా నిడుకొని భయమును విడిచి, సాహసముతో గురువుల సన్నిధిని గాని ఈ విషయమూ బాగుగా తెలిసిన వారి వద్ద గాని చేయవలయును. మొదట నాడీ మార్గమును పరి శుద్ధము చేసుకొన వలయును. స్థూల శరీరము నందు కల్గు లాఘవము తేజస్సుల చేత దీనిని గుర్తించ వలయును. అత్యాశతో తొందరపడి ఏదో ఒకటి తేళ్చుకొనవలయునని ప్రత్నించ రాదు. నాడి మార్గము శుద్ధి కాక ముందే క్రమము తప్పి చేసి నట్లయిన నాడులలో వున్న మలము చేత అవరోధము కల్గి ప్రాణము అచట నిలిచి పోవును. అట్టి సమయమందు విషయ పరిజ్ఞానము గలవారు చెంత నున్న యడల వారు నాడీ మార్గము, శరీరము బాగుగా మర్ధించిన ప్రాణము తిరిగి చలించును. ఒకొక్కపుడు చెవినందు గట్టిగా ఓం కారము ద్వని చేసినట్లయినను తిరిగి మెలకువ వచ్చును. అందుకనియే గురువుల యొక్క పర్యవేక్షణ అవసరమని శాస్త్రము శాసించినది.

ప్రత్యాహారము
...

బాహ్య ప్రపంచముతో మనము సంబంధము పెట్టుకొనుటకు మనకు పంచేంద్రియము (త్వక్, చశు, స్సోత్ర, జిహ్వ, భ్రాణములు) వున్నవి ఆరోగ్యముగా ఉన్నప్పటికి శరీర