పుట:Yogasanamulu.djvu/172

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

యోగాసనములు

171


సర్వ కార్యములు, ప్రాణమనెడు సూక్ష్మరూపమునకు స్థూల రూపములు. అనగా మానసిక శక్తులు, భౌతిక శక్తులు, రసాయిన శక్తులు వాని వాని స్థూల రూపమున వుండి సూక్ష్మ రూపములో నున్నపుడు ప్రాణ మనబడును. ఇట్టి ప్రాణ శక్తి మానవ శరీరమున శ్వాసను కల్గించుచున్నదే కాని శ్వాస మాత్రము ప్రాణము కాదు. ఊపిరి తిత్తులు ప్రాణ శక్తి వలన ఉచ్చ్వాస నిశ్వాసములు జరుపు చున్నది అట్టి స్వాస క్రియకు కారణ రూపమగు శక్తియే ప్రాణము. ప్రాణము వలన శ్వాస , శ్వాస వలన మనస్సు చలించు చున్నవి. కనుక ప్రాణము చలించని యడల శ్వాసయు మనస్సు ఈ రెండునూ స్థంభించును. కనుక మనస్సును నియమించుటకు ప్రాణ నిరోధము అనగా ప్రాణయామము అవసరము. శాస్త్రీయ మగు పద్దతిని ప్రాణాయామము అభ్యసించుట కర్తవ్యము.

అనగా మన శరీరమును సూక్ష్మ రూపముగా గ్రహించిన యడల కారణ రూపము ప్రాణమయి వుండగా స్థూల రూపములో కార్య రూమందినది. శ్వాస క్రియ అవ్యక్తమగు సూక్ష్మము, స్థూలముగా వ్యక్తమగను. అవ్యక్తమగు కారణ రూపమున వున్న ప్రాణము స్థూల రూపమున శ్వాసగా వ్వక్తమగు చున్నది. ప్రాణమునకు శ్వాసకును ఇట్టి సంబంధముడుట వలన శ్వాసను నిరోధించిన యడల ప్రాణ నిరోధము కల్గు చున్నది. శరీరమున ఉన్న మనస్సు ప్రాణ శక్తి వలన చలించుట చేత ప్రాణశక్తిని నిరోధించి వశము చేసికొనుట వలన మనసు నిరోధించ బడి వశమగును. కనుక శ్వాస కార్యమును నిరోధించిన యడల మనసు నిరోధించ బడి వశమగును.