పుట:Yogasanamulu.djvu/162

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

యోగాసనములు

161


6.వజ్రోలి ముద్ర

దీనికి సూక్ష్మ నాడీ మందలము పైన చాల ప్రభావము కలదు. భారతీయ (ఆయుర్వేద) వైద్య శాస్త్రముననుసరించి శుక్రము సూక్ష్మమై ఓజస్సుగా మారి, ఊర్త్వముగా మజనుండి ప్రసరించును. దానినే ఊర్ద్వ రేతస్కమనిరి. ఈ ఓజస్సు శరీరమున వృద్ధియగు కొలది దివ్యమగు తేజస్సు శరీరమంట వ్యాపించును. ఇందు వలన ముఖము చుట్టు గుండ్రని తేజస్సు విరజిమ్ము చుండును. అటులనే శరీరమంతటను కూడా కాంతి విరాజిల్లు చుండును. ఒక విశేష శక్తి మంతయయిన చాయాగ్రహక యంత్రము ద్వారా ఆధునిక శాస్త్రజౣలు కొందరు ఈ కాంతి వలయము యొక్క ఛాయను చిత్ర పటములయందు తీయ గల్గిరి. ఈ విషయమును యోగులు తమ దివ్య శక్తి చేత ఎనాడో గ్రహించ గల్గి యుండిరి. ఈ సందర్భమున ఆలోపతి వైద్య శాస్త్రము ఒప్పుకొనక భేదించు చున్నది. శుక్రము శరీరమున యిమడదని అది అప్రయత్నముగా గాని ప్రయత్న పూరకముగా గాని బహిష్కరింప బడవలసినదే యని చెప్పుదురు. కాని యోగ శాస్త్రము దీనిని ఒప్పు కొనలేదు. ఇపుడిపుడు యోగ సిద్దాంతమే సత్యమగు చున్నది. ఈ శుక్రము అనారోగ్య కారణముల చేతను, సంభోగ సమయమునను, కలల యందును శరీరము నుండి బయటకు పోవు చుండును. ఈ పదార్థము యొక్క నిగ్గు బటకు పోవు చుండుట వలన శరీరము నిస్తేజమగు చున్నది. దీని వలన జ్ఞాపక శక్తి, అలోచనా శక్తియు సన్నగిల్లు చున్నది. శరీర పాటవముకూడ తగ్గి పోవు చున్నది. కావున శరీరమున ఉత్పత్తి