160
లంక సూర్యనారయణ
నాలుకతో కొండ నాలుకను తాకుట అమర వారుణ అనగా అమృతము. చంద్ర స్థానము నుండి నిత్యము అమృతము స్రరించునని గదా తెలుప బడినది. ఇది కంఠ స్థానమున ఉన్నదని తెలిసికొంటిమి కదా: కనుక కొండ నాలుకను నాలుకతో తాకి కంఠమున వున్న అమృతమును అనుభవించమని ఆర్థము. అందు చేత విపరీతార్థములకు ఇచట తావు లేదు.
- 5. విపరీత కరణి ముద్ర
సూర్య స్థానము నాభి స్థానమున ఉన్న మణి పూరక చక్రమందు గలదు. అగ్నికి సూర్యుడు స్థానము. చంద్ర స్థానము కఠ స్థానమునందు గలదు. అందుండి నిత్యము అమృతము స్రవించును . కాని అట్లు ఉద్భవించిన అమృతము దాని క్రింది భాగములో వున్న అగ్ని యందు పడి నాశానమందు చున్నది. అమృతము అనుభవించ లేని మానవుడు జరత్వము పొందు చున్నాడు. ఆ స్థితిని నిరోదించుటకు సూర్య చంద్ర స్థానములను విపరీతము చేయుట అనగా మీదిది క్రిందుగను, క్రిందిది మీదుగను ఉంచుట వలన జరుగునని తెలిసికొని మహర్షులు విపరీత కారణిని సాధనము చేసిరి. ఆసనములో కొన్ని ఇట్టి విపరీతము చేయునవి వున్నవి. సర్వాంగాసనము, శిరసాసనము ఇట్టివి. నేలమీద వీపు తగులు నట్లు పండుకొని రెండు చేతులను రెండు ప్రక్కలయందు నడుము క్రింద భాగమును చేర్చి తొడలను 45 డిగ్రీలు పైకి ఎత్తి ఉంచునది విపరీత కరణి ముద్ర. దీని వలన శరీరమున వున్న రోగ పదార్థములు నశించును. అయువృద్ధి యగును.