150
లంక సూర్యనారయణ
షట్కర్మలను చేయు విధానము
- ధౌతి
నాలుగు అంగుళముల వెడల్పు పదునైదు మూరల పొడవును వున్న పలుచని వస్త్రమును ప్రక్కల యందు దారములు పైకి రానీయ కుండ అంచులు ఏర్పాటు చేసుకొని దానిని వేడి నీళ్ళతో తడిపి ఒక కొనను తీసుకొని నెమ్మది నెమ్మదిగా కడుపులోనికి నోటి ద్వారా మ్రింగుము. మొదటి రోజున ఒక మూరెడు సుమారుగా మాత్రము మింగి నెమ్మదిగా పైకి తీయ వలయును. దీనిని మ్రింగుటకు ఉపక్రమించు నపుడు కడుపు ఖాళీగా వుండ వలయును. మెదటలో ప్రయత్నము చేయు నపుడు కడుపు లోనికి పోక వాంతి వచ్చు నట్లుండును. రెండవ దినమున సుమారు రెండు మూడు మూరల వస్త్రమును మింగి నెమ్మదిగ పైకి తీయ వలయును. అటులనే క్రమముగా వృద్ధి చేయుచు పది లేక పధి హేను దినములలో వస్త్ర మంతయు మింగి నెమ్మదిగా పైకి తీయ వలయును. వస్త్రమును పూర్తిగా మింగిన తరువాత నౌళి క్రియను చేసి కొంచెము వుంచి నెమ్మది నెమ్మదిగా పైకి తీయ వలెను. అది అన్నాశయము ప్రవేశింపగనే అందు నిల్వ యుండిన పైత్యము, శ్లేషము అంటుకొని వచ్చును. ఆ వస్త్రమును కడిగి వేడి నీళ్ళ యందు ఉడికించి నీళ్ళను పిండి ఆర బెట్టి మరియొక సారి చేయుటకు సిద్దము చేసి వుంచు కొనవలయును.
ధౌతి కర్మ వలన శ్వాస కోసలు, కఫ రోగములు, ప్లీహ వ్యాధులు కుష్టములు నివారించ బడును.