పుట:Yogasanamulu.djvu/150

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

షట్క్రియలు లేక షట్కర్మలు

శరీరము ఆరోగ్యముగా లున్నపుడు శరీరమందలి వాత, పిత్త, శ్లేష్యములు సరిగా వుండి త్రిగుణములు వర్థిల్లును. అవి భేదించి ఉండవలసిన దాని కంటె ఎక్కువ తక్కువలుగా ఉన్నప్పుడు త్రిదోషములుగా పరిగణించ బడెను. ఆ దోషములు శస్రీరమునకు రోగ దాయక మగును. శరీరమున వాతము, కఫము, క్రొవ్వు ఎక్కువగా లున్న వారు వాని నివారణము కొరకు శరీరమును శుద్ధి చేయుట అవసరము. దీని నివారణము కొరకు వైద్యము చేయించు కొనవలయును. వైద్యుని పై అధార పడనవసరము లేకుండ సూక్ష్మ దేహమును శుద్ధి చేయుటకకు ప్రాణాయామమును. స్థూల దేహమును శుద్ధి చేయుటకు షట్కర్మలును అనుసరించ వలయును. 1)ద్రౌతి, 2)భస్తి, 3)నేతి, 4)త్రాటకము,,5) నౌళి, 6.)కపాలభాతి అను ఆరును ఈ షట్కర్మలు. దౌతి వలన అహారము అన్నకోశమును భస్తి క్రియ వలన మలాశయమును, నేతి వలన ముక్కును, త్రాటకము వలన కండ్లు, నౌళి వలన ప్రేవులును, కపాల భాతి వలన శిరస్సు నందలి అన్ని భాగములు శుభ్రమందును.

ఈ షట్కర్మలను నిత్యము చేయ రాదు. అవసరమును బట్టి మాత్రమే చేసిన ప్రయోజన ముండును.