ఈ పుట ఆమోదించబడ్డది
యోగాసనములు
147
యును. అటులనే పాదముల పట్టి పైకి లేపిన యడల శిరస్సు వరకు తిన్నగా కర్ర వలె లేవ వలయును. పూర్తిగా ఊపిరిని పీల్చి కుంబించి బయటకు పోనీయ కుండ బిగబట్టి కొంత సేపు ఉంచవలయును.
- ఉపయోగములు
- ఇందు వలన కండరములు కీళ్ళు బలపపడును. ప్రాణములు స్వాధీనములో నుండును.
110. సేతుబంధ ఆసనము
తలను, వీపును నేలకు తాకునాట్లు వెలికిల పరుండి పాదములను పిరుదుల వరకు చేర్చి చేతులను తొడల మూలములందుంచి, తలను నేల మీద లుంచి, తల పాదముల మీద ఉంచి శరీరమునంతను అనగా వెన్నెముకను తొడల పైకి ఎతి ఉంచ వలయును. ఇది బ్రిడ్జి వలె నుండును.
- ఉపయోగములు
- మెడ విపరీతమగు బలమును పొందును. కడుపు, వెన్ను చక్కగా సాగి బద్ధకమును పోగొట్టును.