పుట:Yogasanamulu.djvu/144

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

యోగాసనములు

143


కొందరు దీనిని గూర్చి చాల దుష్ప్రచారము చేయు చున్నారు. తిరగబడి రక్తమంతయు శిరస్సు మీద పడుననియు, కండ్ల యందలి నరములకు ప్రమాదము వచ్చుననియు చెప్పుచున్నారు. ఇది సత్యము కాదు. మనము సామాన్యముగా నిలబడినపుడు మన శరీర మందలి రక్తమంతయు పాదముల మీద పడుటలేదు. మన రక్త వాహికలు కవాటములతో కూడి ఉన్నందున రక్తము ఒకచోటికి చేరుకోదు. సామాన్య స్థితిని విపద్యయము చేయుట వలన సరీరము నందలి పీడనములలో తేడా వచ్చును. ఊర్ధ్వ పీడనమున వున్న స్థానమున అధో పీడనము, అతులనే అధో పీడనము ఊర్థ్వ పీడనముగాను మారును. ఇట్టి మార్పునకు అలవాటు పడిన యడల ఎట్టి సంశములు వుండవు. సాధకులు ప్రారంభములో వాయువును కుంభించి చేయ రాదు. కుంభించి నపుడు ఒత్తిడులు ఎక్కువగగును. కనుక సామాన్యముగా శ్వాసించుచు శీర్షాసనము వేయుట చాల మంచిది.