పుట:Yogasanamulu.djvu/112

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

యోగాసనములు

111



65. హస్తస్థిత పాదోద్ధితానాసనము



రెండు చేతులను నేలమీద లుంచి, ఒక మోకాలిని ఆవైపు వున్న మోచేతి మీద లుంచి, ఆకాలి మడమ మీద రెండవ కాలి మోకాలును వుంచి, పాద మును పైకి ఎత్తి వుంచ వలయును.

ఉపయోగములు
చేతులు బలముగా అగును.

66. ఉత్తాన జానుసిర సంయుక్తాసనము

నిలువుగా నిలబడి, చేతులు రెండు పైకి చాచి, రెండు చెవులను తాకునట్లు ఉంచి, ముందునకు పాదములకు దగ్గరగా వంగి, ముఖము మోకాళ్ళను తాకు నట్లుంచ వలయును.