పుట:Womeninthesmrtis026349mbp.pdf/43

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ద్వితీయాధ్యాయము

25

(దాతలులేనిచో కన్య తగినవరుని స్వయంవరము చేసికొనవలెను.)

మనువుకూడ వసిష్ఠునివలెనే మూడు సంవత్సరములు చూచి స్వయంవరము చేసికొనవలెనని చెప్పినాడు.

    త్రీణివర్షాణ్యుదీక్షేత కుమార్యృతుమతీసతీ
    ఊర్థ్వంతుకాలాదేత స్మాద్వింజేత సదృశంపతిం

(మను 9-88)

(కన్య ఋతుమతియై మూడు సంవత్సరములు వేచియుండి పిమ్మట తగిన వరుని పొందవలెను.)

ఇట్లు సకాలములో తండ్రిచేత నీయబడనిదై స్వయముగ వివాహమాడిన స్త్రీగాని యామెభర్తగాని యెంత మాత్రము దోషమును పొందరని మనుస్మృతి చెప్పుచున్నది.

    అదీయమానాభర్తా రమధిగచ్చేద్యదిస్వయం
    నైనః కించిదవాప్నోతినచయంసాధి గచ్ఛతి

(మను 9-91)

రజస్వలయైనపిమ్మట మూడేండ్లు కన్య వేచియుండవలెనని మనువు చెప్పుటచే రజస్వల కాకుండనే కన్యను దానము చేయుట తండ్రి కర్తవ్యమని యాతని యభిప్రాయమైనట్లు తేలుచున్నది. అయినను తండ్రి నేరముచే కూతురు దోషవంతురాలు కాదని యాతడు భావించుచున్నట్లుకూడ పైశ్లోకమువలన తెలియుచున్నది. అంతేకాక మొత్తముపైన మనువు