పుట:Womeninthesmrtis026349mbp.pdf/44

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

26

స్మృతికాలపుస్త్రీలు

దృష్టిలో రజస్వలా వివాహము పరాశరాదుల దృష్టిలోవలె నత్యంతము గర్హ్యమైనట్లు కాన్పింపదు. ఏమన:

    కామమారణాత్తిష్ఠేద్గృహే కన్యర్తు మత్యపి
    నచైవైనాం ప్రయచ్ఛేత్తుగుణహీనాయ కర్హిచిత్

(మను 9-89)

(కన్యామరణాన్తము పితృగృహములో నుంచుకొనవచ్చును కాని యామెను గుణహీనునకీయ కూడదు) అని మనుస్మృతి చెప్పుచున్నది. గుణహీనునకు కన్యనీయరాదనుటకు యీశ్లోకము చెప్పబడియున్నను గుణ హీనుడే కాని లభింపనపుడు కన్య ఋతుమతియైనను తండ్రిది దోషముకాదని దీనినిబట్టి యూహించుటకు వీలున్నది. ఋతుమతియైన మూడేండ్ల వఱకును కన్య వేచియుండవచ్చుననుట యిట్టి పరిస్థితులలోనే యని యన్వయించు కొనవచ్చును. ఎదియెట్లున్నను సామాన్యముగ వివాహముచేయవలసిన వయస్సు మనువు నభిప్రాయములో కూడ రజస్వల కాకపూర్వమే. మనువు స్త్రీ పురుష సంతతులకు చేయవలసిన కర్మలను జెప్పుచు పురుషుని యుపనయనమునకు బదులుగ స్త్రీ వివాహమును చెప్పుటచేతనే స్త్రీ కెనిమిదవయేట వివాహము చేయవలసినదని మనువు భావించినట్లు తెలియుచున్నది.

వైవాహికీ విధిః స్త్రీణాం సంస్కారోవైదికస్మృత:

(మను 2-67)